దేశవ్యాప్తంగా సూర్య నమస్కారాలు - ప్రపంచ రికార్డు

రథసప్తమి సందర్భంగా 3 కోట్ల మందికి పైగా పాల్గొన్న సూర్యనమస్కార యజ్ఞం 
 
 
స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సూర్యుని జన్మదినమైన రథసప్తమి రోజున దేశవ్యాప్తంగా సూర్యనమస్కార యజ్ఞం నిర్వహించబడింది. 
 
 
ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలలో జరిగిన ఈ సూర్య నమస్కార యజ్ఞంలో 2 కోట్లకు పైగా విద్యార్థులు, 1 కోటికి పైగా ఇతరులు పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఇది ఒక ప్రపంచ రికార్డుగా నమోదయింది.