బ్రాహ్మణేతర మహిళా పూజారులు

విఠల్ - రుక్మిణి దేవాలయంలో పూజారిగా ఇంటర్వ్యూకు హాజరైన ఒక మహిళ
 
హిందూధర్మం - హిందూ జీవన విధానాలలో పిడివాదం, మూర్ఖత్వాలకు స్థానం లేదు. మిగిలిన అన్ని మతాలూ 'స్టాటిక్' కాగా హిందుత్వం 'డైనమిక్'. ఉదాహరణకు పండరీపురం (మహారాష్ట్ర) లో విఠల-రుక్మిణీ దేవాలయం అతి ప్రసిద్ధి చెందిన ఆలయం.
 
ప్రతి ఆషాఢమాసంలో రెండు కోట్లకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలో 900 సంవత్సరాల సాంప్రదాయాన్ని ప్రక్కకుపెట్టి పూజారులుగా బ్రాహ్మణేతర మహిళలను నియమించారు. మంగళూరు వద్ద గల డ్రోలీ (కర్నాటక) గోకర్ణక్షేత్రంలో ఉంటున్న హరిజన కులానికి చెందిన లక్ష్మి, చంద్రావతి అనే ఇద్దరు మహిళలకు ప్రత్యేక శిక్షణనిచ్చి ఈ దేవాలయ పూజారులుగా నియమించారు. ఈ సంఘటనకు ఈ ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. మమ్మల్ని గర్భగుడిలోకి రానిస్తారని మేము కలలో కూడా ఊహించలేదని వారు గద్గద స్వరంతో చెపుతూ తన్మయులయ్యారు.
 
- ధర్మపాలుడు