చెట్టు క్రింద పాఠశాల

మానవ సేవే మాధవ సేవ - శ్రీమతి వసుంధర (ఫోటో ద హిందూ సౌజన్యంతో)

మనదేశంలో డబ్బు సంపాదన, లేదా మతమార్పిడి చేయడం వంటి ఏ స్వార్థమూ లేకుండా కేవలం దేశ శ్రేయస్సు కోసం పనిచేసిది ఒక్క సరస్వతీ శిశుమందిరాలు మాత్రమే. అదే బాటలో నచికేతానందపురి, శివానందపురి అనే ఇద్దరు స్వామీజీలు ఇచ్చిన స్ఫూర్తితో శ్రీమతి వసుంధర అనే మహిళ మాధవపురంలోని వడ్డెర బస్తీలోని పిల్లలు పేదరికం కారణంగా సరైన చదువు లేక పోషణ లేక కునారిల్లుతూ ఉండడం చూసి "నచికేత తపోవన విద్యామందిరం" పేరుతో పిల్లలకు ఉచితంగా చదువు చెప్పనారంభించారు. ఎటువంటి వసతులూ లేక చెట్టు క్రింద తరగతులు నడుస్తూ ఉండేవి. ఇది ఒక దశాబ్దం క్రిందటి మాట. ఇప్పుడు ఆ తపోవన విద్యామందిరానికి మూడు అంతస్తుల స్వంత భవనం చేకూరింది. చదువు పూర్తిగా ఉచితం. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం ఉచితం. ఇక్కడ చదువుతోపాటు సంస్కృతి, సత్ప్రవర్తన బోధించబడతాయి. వసుంధరని చూడగానే అక్కడి పిల్లలు ఎంతో ఆప్యాయంగా "ఓం నమ: శివాయ వసుంధరమ్మా" అని కేరింతలు కొడతారు. ఇటువంటి సేవాభావం కావాలి. మతమార్పిడులు కాదు.
- ధర్మపాలుడు