ప్రమాణ స్వీకారంతోనే దౌత్య సంబంధాలకు కృషి

ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి శ్రీ హమీద్ అన్సారీ, వివిధ సార్క్ దేశాల అధినేతలతో భారత ప్రధాని నరేంద్రమోది
 
మోదీ తన ప్రమాణస్వీకార కార్యక్రమం నుండే దౌత్య సంబంధాల పని ప్రారంభించారు. ప్రమాణస్వీకారం రోజున సార్క్ దేశాధిపతులను ఆహ్వానించి ఆ మరునాడు వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడారు. 
 
తన మంత్రులందరికి వంద రోజుల కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. ప్రపంచంలో అనేక దేశాలు మోదీని అభినందించాయి. చైనా ప్రధాని స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అమెరికా అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియచేయటమే కాక భారత సంతతికి చెందిన అమెరికా అధికారిని దౌత్య విషయాలు మాట్లాడటానికి పంపిస్తున్నారు. మోదీతో జపాన్ దేశాధినేతకు మంచి సంబంధాలు ఉన్నాయి. మోదీ కూడా మొదట జపాన్ దేశానికే పర్యటనకు వెళ్తున్నారు. 
 
గత 10 సంవత్సరాలలో దేశ పాలనలో చోటు చేసుకొన్న అవకతవకలను సరిచేసే ప్రయత్నంలో నిమగ్నమైనారు. దేశంలో కొద్ది రోజులలో మంచిమార్పు తీసుకురావటానికి కృషి జరుగుతున్నది. ఇది దేశానికి మంచి మలుపు.