రసాయ వ్యవసాయాన్ని వదిలితేనే రైతులకు భవిష్యత్తు

సుభాష్ పాలేకర్
 
 
రసాయన వ్యవసాయాన్ని విస్మరిస్తేనే సాగు చేసే రైతులకు భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ పరిశోధకులు, బసవశ్రీ అవార్డు గ్రహీత డా.సుభాష్ పాలేకర్ పేర్కొన్నారు. వరంగల్ లో కాకతీయ ఫౌండేషన్, మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో "గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై రైతుశిక్షణ" కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పంట దిగుబడులు పెంచాలనే లక్ష్యంతో రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారని, దీనితో భూమిలో ఉన్న పంటలకు మేలు చేసే కోట్లాది సూక్ష్మజీవులు నాశనమవుతున్నాయని అన్నారు. పెట్టుబడి లేకుండా పంటలను సాగుచేయాలంటే గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయమే మార్గమన్నారు. ఒక్క ఆవుతో పెట్టుబడి లేకుండా పంటలు పండించవచ్చని, ఒక్క ఆవు నుంచి వచ్చే గోమూత్రం, పేడతో 30 ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చని అన్నారు. జర్సీ ఆవులు మంచివి కావని ఆయన తెలిపారు. గోబర్ గ్యాస్ వినియోగంతో ఇంటికి, పంటకు అవసరమైన కరెంటును మనమే ఉత్పత్తి చేసుకోవచ్చునని సుభాష్ పాలేకర్ తెలిపారు.  
 
- బాబ్జీ, వరంగల్