హిందుత్వమే యావత్ ప్రపంచ సమస్యలకు పరిష్కారం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నిర్మాత డా.కేశవ రావు బలిరాం హెడ్గేవార్ కర్ణాటక ఉత్తర భాగంలో ఉన్న చిక్కోడి శాఖకు 1937వ సంవత్సరం జనవరి 16న పర్యటనకు వచ్చి నేటికి 75 సంవత్సరాలు

హిందూ దేశంలో గుడిగంటకు నిషేధం

భారతదేశం హిందూదేశం. ఇక్కడ ఏ మతాన్నయినా ఆచరించవచ్చును. అభ్యంతరం లేదు. కానీ వింత ఏమిటంటే...

ఈ పిల్లలు అనాథలు కాదు - నా కుటుంబం

"సేవాహి పరమోధర్మః" అనే సూక్తికి సార్ధకత చేకూర్చిన అనేక వందల వేల ఉదాహరణలు ఈ దేశంలో మనకు కనబడతాయి. అట్లా సంస్థల రూపంలో వ్యక్తిగతంగా చేసేవారు కనబడతారు. 

చక్కని ఆరోగ్యానికి చక్కని దినచర్య

ఆరోగ్యముగా నుండగోరు మానవుడు ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తమున నిదుర మేల్కొనవలెను. ఇచట బ్రాహ్మీముహూర్తమనగా సూర్యోదయము నకు 45 నిముషముల ముందు. నిదురలేచిన

మానవత రూప ధర్మము నెన్నడు విడువరాదు

మననశీలుడై, తనకు వలెనే ఇతరులకు సుఖదుఃఖములు, హాని, లాభములు కలుగునని ఎంచువానినే మనుష్యుడనవలయును. మనుష్యు డెన్నడు నన్యాయమొనర్చు బలవంతునకు గూడ

2జి స్పెక్ట్రమ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

2జి స్పెక్ట్రమ్ కేటాయింపులలో వేలకోట్ల రూపా యలు దోచుకోబడ్డాయని సుప్రీంకోర్టులో కేసు వేయ బడటం, దానిపై విచారణకు సుప్రీం ఆదేశించటమే కాక ప్రత్యేక పరిస్థితుల్లో విచారణను స్వయంగా

ధృతి క్షమా దమోస్తేయం

ధృతి క్షమా దమోస్తేయం 
శౌచ మింద్రియ నిగ్రహః |

బిజెపి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చగలదా?

తెలంగాణలో సకల జనుల సమ్మె విరమణ తరువాత ఒక నిస్తేజ వాతావరణం కనిపిస్తున్నది. తెలంగాణా పొలిటికల్ జాక్ ఇచ్చిన పిలుపుతో అన్ని ఆందోళనలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో

విద్య నీలోని అంతఃచేతన

విత్+య=విద్య అన్నారు. అంటే అంధకారమును పోగొట్టునది అని అర్థం. నరేంద్రుడు తన మనో వికాసాన్ని, అంధకారాన్ని వదిలించుకుని వివేకా నందుడయ్యాడు. పశ్చిమగడ్డమీద  భారతీయ

అమాయకుడు అజ్మల్ కసబ్

ముంబై నగరం అంటే ఇస్లామిక్ తీవ్రవాదులకు ఎంతో అభిమానం. అందుకే క్రమం తప్పకుండా శక్తివంచన లేకుండా  శ్రద్ధగా ముంబై నగరం మీద దాడులు చేస్తుంటారు. 2008 సంవత్సరంలో

కాశ్మీర్ లో వేర్పాటువాదం అనేది ఉన్నదా?

జనవరి 29వ తేదీనాడు "జమ్మూ కాశ్మీర్ నిజాలు - సమస్యలు - పరిష్కారాలు" అనే అంశంపై ఒక సదస్సు నిర్వహించబడింది. ఆ సదస్సులో జమ్మూ-కాశ్మీర్ అధ్యయనకేంద్ర

ఎన్ సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం

5 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భారతీయ సంస్కృతీ, పరంపర, జీవన మూల్యాలు వాటి చరిత్రలను ఒక సమగ్ర రూపంలో అందించ టానికి విశేషప్రయత్నం ఒకటి ఈ మధ్య జరిగింది. 

జీతాలు పెరిగాయి

జీతాలు పెంచమని గొడవ చెయ్యలేదు. సమ్మె చెయ్యలేదు, ధర్నా లేదు, నిరసన లేదు, నిరాహార దీక్ష లేదు. అయినా జీతాలు పెరిగాయి, ఎంత పెరిగిందండీ అంటే వందశాతం పైమాటే! నమ్మ

నాసాలో శిక్షణకు సూర్య వంశి

ప్రతిష్ఠాత్మకమైన అమెరికా అంతరిక్ష విద్యా కార్యక్రమానికి అనుసంధానకర్తగా ప్రప్రథమంగా ఒక భారతీయ ఉపాధ్యాయిని ఎంపికయ్యింది. మహా రాష్ట్ర పుణే విద్యావాలీ ప్రాథమికోన్నత పాఠశాల 

సంస్కృత భాష 15 వ విశ్వమహాసభ

జనవరి 5న డిల్లీలో జరిగిన  సంస్కృత భాష విశ్వమహాసభలో మన ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ "సంస్కృత భాష భారతీయుల ఆత్మ.

పాక్-బంగ్లాలలో అనిశ్చిత స్థితిలో ప్రజాస్వామ్యం

అఖండ భారతదేశం నుండి విడిపోయిన రెండు ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో జరుగుతున్న పరిణామాలు మనకు ఆందోళన కలిగిస్తునాయి. ఈ దేశాల్లో తరచూ తలెత్తుతోన్న

ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం భారతదేశంలో మాత్రమే ఉన్నది

ఇటీవల కంచ ఐలయ్య "హిందూ మతానంతర భారతదేశం" అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకాన్ని సమీక్షిస్తూ డా.ఎం.ఎఫ్.గోపీనాద్ ఆంధ్రజ్యోతి పత్రికలో హిందూమతంలో ఆధ్యాత్మిక

ఆహా మోడీ.. ఓహో మోడీ.. - ఇట్లు కాంగీ

"నరేంద్ర మోడీ కార్యదక్షత గల నాయకుడు. తెలివైన వ్యూహకర్త. మోడీ తన పాలనలో ఎన్నో విజయాలు సాధించారు"

విదేశంలో స్వదేశీ !

వింతగా ఉందా? ఇది అచ్చు తప్పు కాదులెండి. మనం స్వదేశీ గురించి మాట్లాడితే చాలామంది హేళన చేస్తారు. స్వదేశీ అన్నమాట చాలా విస్తృతమైంది. భారతీయ ఉత్పత్తులు వాడడమే

జాతీయ భావానుభూతే తృతీయవర్ష

2012 తృతీయవర్ష సంఘ శిక్షావర్గలో పాల్గొన్న స్వయంసేవకులు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో కార్యకర్తలకు శిక్షణ అనేది ఒక విశేషమైన యోజన. కార్యకర్తలకు సంఘ సిద్ధాంతము, కార్యపధ్ధతి, దేశం యొక్క సమగ్రత, ఈ దేశ మహాపురుషుల ప్రేరణదాయక విషయాలు మొదలైన విషయాలు అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తారు. ఈ సంవత్సరం తృతీయవర్ష నాగపూర్ లో మే 13వ తేదీన ప్రారంభమై జూన్ 12 ఉదయం దీక్షాంత సమారోప్ తో పూర్తి అయ్యింది.

దేశం మొత్తం నుండి 1013 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. పశ్చిమ ఆంధ్ర ప్రదేశ్ నుండి 52 మంది
శిక్షార్థులు పాల్గొన్నారు. మలేషియా, నేపాల్, అమెరికా దేశాల నుండి 5 గురు శిక్షార్థులు పాల్గొన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుండి కామరూప్ వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల వాళ్ళు వర్గలో పాల్గొన్నారు. ఒకరి భాష ఒకరికి సరిగా అర్థం కాకపోయినా హావభావాలతో ఆత్మీయంగానే కలిసిపోయారు. సంఘ కార్యం దేశవ్యాప్తంగా ఉన్నది అనే అనుభూతి, దేశ సమగ్రత గురించి, దేశ వ్యాప్తంగా పని చేస్తున్నాము అనే విశ్వాసం, సైద్ధాంతిక సమగ్రతను అర్థం చేసుకోవటం, సమన్వయ భావం నిర్మాణం చేయటం తృతీయవర్ష ప్రత్యేకత.

నాగపూర్ రేశంభాగ్ మైదానంలో 1928 నుంచి శిక్షావర్గ నడుస్తున్నది. ఇది 81వ శిక్షావర్గ. పూజనీయ సర్ సంఘచాలక్ 6 రోజులపాటు వర్గలో ఉండి 
శిక్షార్థులకు మార్గదర్శనం చేశారు.

జూన్ 11వ తేదీనాడు సార్వజనికోత్సవం జరిగింది. ఆ కార్యక్రమంలో పంజాబు కేసరి పత్రిక సంపాదకులు శ్రీ అశ్వనీ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, శ్రీ మోహన్ జీ భాగవత్ ముఖ్య వక్తగా ప్రసంగించారు.

శ్రీ అశ్వనీ కుమార్ మాట్లాడుతూ "స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనప్పటికీ పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని ఎందుకు విముక్తి చేయలేకపోయాం? దిగజారుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ, దేశంలో అంతర్గతంగా, చైనా నుండి ఎదురవుతున్న సవాళ్ళను మనం ఎదుర్కోవాలి. దేశ అఖండత, సమైక్యతను కాపాడేందుకు మనం పని చేయాలి. మనకు ఎక్కువ సమయం లేదు" అని అన్నారు.

----------------------------------------------------------------------
ఖలిస్తాన్ ఉగ్రవాదులు పెట్రేగిపోయి, పని చేస్తున్న రోజులలో పంజాబులోని పంజాబు కేసరి పత్రిక దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రాధాన్యమిచ్చి పని చేసింది. అందుకుగాను ఎంతో మూల్యం చెల్లించింది. ప్రస్తుత సంపాదకులు శ్రీ అశ్వనీ కుమార్ కు తాత అయిన లాల్ జగత్ నారాయణ, తండ్రి అయిన శ్రీ జగత్ ఉమేష్ చందర్ ఇద్దరూ ఉగ్రవాదుల తూటాలకు బలియైనారు. అయినా అధైర్యపడక "నా తాత, తండ్రి అడుగుజాడలలోనే నా శరీరములో ప్రాణమున్నంత వరకు ఈ పత్రికను నడుపుతూనే ఉంటాను, దేశ సమైక్యతా, సమగ్రతలకు పాటు పడుతూనే ఉంటాను" అని శ్రీ అశ్వనీ కుమార్ ప్రకటించారు. 
----------------------------------------------------------------------

శ్రీ మోహన్ జీ భాగవత్ సందేశం

ప్రపంచ దేశాలలో భారతదేశంలోని ప్రజలకు మాత్రమే తమ గుర్తింపు విషయంలో స్పష్టత లేదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. స్వాతంత్ర్య పోరాట కాలంలో ఈ దేశ ప్రజలలో ఈ దేశం గురించి స్పష్టత లేని కారణంగా 1947 ఆగస్టు 14న దేశం ముక్కలు చేయబడింది. ఈ రోజున కూడా ఈ దేశ ప్రజలందరిలో దేశం గురించి, జాతీయత గురించి స్పష్టత లేని కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ "ఈ దేశంమీద దురాక్రమణ చేసిన వాళ్ళు తమ పరాక్రమంతో ఇక్కడ గెలవలేదు. ఈ దేశ ప్రజలలో ఉన్న విభేదాలే వారి గెలుపుకు కారణమయ్యాయి. ఎన్నో త్యాగాలు, ఎంతో పరిశ్రమ చేసి ఇప్పుడు స్వాతంత్ర్యం సంపాదించుకొన్నాము. కాని మనలో విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. విభేదాలు సమసిపోయి మనమందరం సోదరులం అనే భావనను గుర్తించలేకపోతే ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని కాపాడలేదు" అని చెప్పారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ దేశ ప్రజలలో దేశభక్తి భావాన్ని నిర్మాణం చేయటానికి కృషి చేస్తున్నది. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత ఈ సమాజం యొక్క సంపూర్ణ పరివర్తన కోసం ప్రారంభించిన పనులు కొన్ని మధ్యలో ఆగిపోయాయి. వాటిని కొనసాగిస్తూ వారి కలలను సాకారం చేసేందుకు హిందూ సమాజాన్ని సంఘటన చేయాలి. సమాజమంతటా మనం పని చేయాలని మోహన్ భాగవత్ జీ
పిలుపునిచ్చారు.

భగవంతుడిది శాశ్వత ప్రేమ

వివేక సూర్యోదయం - ధారావాహికం - 7

http://2.bp.blogspot.com/-9I5Dav5PfyQ/TwxBzvqyS6I/AAAAAAAAAYM/97mWZ2Dzes0/s200/Vivekasuryodayam.jpg

భక్తి అంటే భగవంతుని పట్ల అవ్యాజమైన ప్రేమ. మనిషి భగవంతుడ్ని ఎందుకు ప్రేమించాలి అనే ప్రశ్నను చేదించనంత వరకు విషయం బోధపడదు. జీవితానికి రెండు భిన్నమైన ఆదర్శాలున్నాయి. ఏ దేశస్తుడైనా, మతం తెలిసిన వారెవరినైనా తను శరీరము, ఆత్మల కలయిక అని తెలుసు. కాని మానవ జీవన లక్ష్యాలలో చాల భేదముంది. పాశ్చాత్య దేశాల్లో ప్రజలు మానవ శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. భారతదేశంలో ఆత్మ గురించి చింతన ఎక్కువ. ఇంగ్లండులో మరణం గురించి చెప్పినప్పుడు మానవుడు తనలోని భూతాన్ని వదిలిపెట్టాడంటే, భారత్ లో మానవుడు శరీరాన్ని వదిలాడంటారు. పాశ్చాత్య దేశాల్లో మానవుడెందుకు జీవిస్తున్నాడంటే, భోగాలను, వాసనలను, సంపదను అనుభవించేందుకంటారు. అంతకు మించి అతనాలోచించలేడు. భవిష్యత్తులోనూ మానవుడు ఇదే ఆనందం కొనసాగిస్తుంటానంటాడు. మరణం తరువాత కూడా తానెక్కడికో వెళ్తానని అక్కడ కూడా ఇవన్నీ లభిస్తాయని భావిస్తుంటాడు. ఈ లక్ష్యం కోసమే భగవంతుడ్ని పూజిస్తుంటాడు. భగవంతుడనే వాడొకడున్నాడని, అతడే ఇవన్నీ తనకిస్తుంటాడని భావిస్తుంటాడు.


భారత్ లో భగవంతుడంటే జీవన లక్ష్యం. భగవంతుడికి మించినది లేదు. భోగాలను, వాసనలను శాశ్వతమైనవిగా కాక జీవన ప్రవాహంలో కొన్ని మజిలీలుగానే భావిస్తాం. వీటికి మించిన పరమోత్కృష్ట సాధన ఒకటుందని నమ్ముతాం. కేవలం వీటి గురించే ఆలోచించడం భయానకమని తెలుసుకుంటాం. కుక్క తినేటప్పుడు చూడండి, అంత తృప్తిగా ఎవరూ తినరు. పంది కూడా అంతే. అంత తృప్తిగా మనిషి జీవించలేడు. చిన్న చిన్న జంతువులలో వినికిడి శక్తి, చూసే శక్తి ఎక్కువ. వాటి వాటి వ్యవహారాల్లో అవి మునిగి తేలుతుంటాయి. వాసనలను అనుభవిస్తూ అవి ఒళ్ళు మరిచిపోతుంటాయి. మనిషి కూడా అదే స్థాయికి వెళితే అతనికీ అదే తరహా ఆనందం లభిస్తుంటుంది. కొంచెం స్థాయి పెరిగితే అతని లక్ష్యం ప్రేమ వైపు మళ్ళుతుంది. అదే భక్తి వైపు నడిపిస్తుంది. జీవితంలో అన్ని దశల్లోనూ మనం ఒకేరకంగా ఆలోచించం. చిన్నతనంలో స్వీట్లు, బిస్కట్లు గూర్చి ఉన్న యావ క్రమంగా జీవితంలో కొన్ని ఉన్నతమైన విషయాలను, విలువలను విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ ఉన్నత లోకాల వైపు ఆలోచనలు మళ్ళుతాయి. ఒక దశలో ఎంతో ప్రధానమైనది మరో దశలో అప్రధానమై క్రమంగా శాశ్వత సత్యమైన భక్తి వైపు, భగవంతుని వైపు ఆలోచన జరుగుతుంది. భగవంతుడు పూర్ణతత్వం, అంతకుమించి ఆనందం లేదు, నిస్వార్థమైన ప్రేమ అది. కుటుంబంలో భార్యను, పిల్లలను ప్రేమించడం ఒక మజిలీ. శాశ్వతమైన భగవంతుడి ప్రేమను చేరేందుకు ఇవన్నీ కొన్ని దశలు. ఎవరి పట్లా కోపం, ద్వేషం లేక ఎప్పుడూ సంతులనం కోల్పోక, జనన మరణాల పట్ల సమదృష్టి కల్గిన వాడే భగవంతుడు. భగవంతుడి మార్గం సుదూరమైనది. కష్టసాధ్యమైనది. కొందరే దాన్ని సాధించగలరు. అదొక నిరంతర పోరాటం. సూర్యోదయానికి ముందు మిణుకు మిణుకుమనే చిన్న నక్షత్రాల వంటివి సాంసారిక ప్రేమతో కూడిన బంధనాలు. సూర్యోదయం అయినా వెంటనే అవి మటుమాయం అవుతాయి. కనుక సూర్యోదయమే భగవత్ సాక్షాత్కారం, శాశ్వత ప్రేమతో సమానం. 

- హనుమత్ ప్రసాద్

ఆరోగ్యానికి ఆహారం - 3

తోటకూర నేత్రములకు మంచిది, విరేచనము కాగోరు వారికి అత్యంత మంచిది. భోజనం చేసిన వెంటనే ఏదో ఒక ఫలాన్ని భుజించుట ఆరోగ్యమునకు చాలా మంచిది. ఫలములన్నింటిలో ద్రాక్షపండు శ్రేష్ఠం. దానిమ్మ గర్భిణీ స్త్రీలకు శ్రేష్ఠం. నారింజపండు స్త్రీలలో నెలవారీ ఋతుస్రావమును క్రమబద్ధీకరించును. ముట్టునొప్పిని తగ్గించును, చర్మానికి కాంతిని కలిగిస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది.


బచ్చలి కూర : మధురరసం కలిగి ఉంటుంది. బలాన్ని కలుగచేస్తుంది. శుక్రవృద్ధిని కలిగిస్తుంది.  కఫం ఎక్కువవుతుంది. చలువ చేస్తుంది. 

పాలకూర : బలకరము, నేత్రములకు మంచిది. చలువ చేయును, రుచిగా నుండును, అతిగా తీసుకొన్నచో మూత్రపిండములలో రాళ్ళు ఏర్పడతాయి. 

గోంగూర : అత్యంత ఉష్ణవర్థకము, బలం, రక్తవృద్ధిని కలుగచేయును. 

తోటకూర : చలువ చేయును, నేత్రములకు మంచిది, మలమూత్రములను జారీ చేయును. విరేచనము కాగోరు వారికి అత్యంత మంచిది.  

ఫలములు :  


భోజనం చేసిన వెంటనే ఏదో ఒక ఫలాన్ని భుజించుట ఆరోగ్యమునకు చాలా మంచిది. ఆయా ఋతువులలో లభించు అన్ని ఫలములను తప్పక వాడవలయును. 

ద్రాక్ష : ఫలములన్నింటిలో ద్రాక్షపండు శ్రేష్ఠమయినది, చలువ చేయును. నేత్రములకు మంచిది, బలమును కలుగచేయును. మలమూత్రములను జారీ చేయును, శుక్రవృద్ధిని కలిగిస్తుంది, రుచిని కలిగించును. దప్పికను తగ్గించును. జ్వరము, శ్వాస, వాత రోగములందు, కామెర్లు, మూత్ర రోగములందు, రక్తస్రావములందు అత్యంత మంచిది. ద్రాక్షపండ్లు తాజాగాను మరియు ఎండు ద్రాక్షపండ్లుగాను దొరుకును. ఎండు ద్రాక్ష అత్యంత గుణవత్తరం. 

ఖర్జూర : ఇది కూడా తాజా పండుగను, ఎండబెట్టినవిగాను దొరుకును. హృదయమునకు మంచిది. ఛాతి వ్యాధులందు, క్షయ రోగమందు మంచిది. రక్తస్రావ రోగములందు హితకరం, దగ్గు ఆయాసంలను తగ్గించును. దప్పికను తగ్గించును, బలకరం, శుక్రవృద్ధికరం. 

ఎండు ద్రాక్ష, ఖర్జూర కాయలను పగులగొట్టి నీటిలో నానవేసి త్రాగిన వేసవిలో దాహము, ఎండ వేడిమి నుండి ఉపశమనము కలుగచేయును. చంటి పిల్లలకు త్రాగించుట వలన వడదెబ్బ తగలనీయదు. 

దానిమ్మ : దాహము, జ్వరము, హృద్రోగము, కంఠ రోగములందు మంచిది. నోటి దుర్వాసనను పోగొట్టును. శుక్రవృద్ధిని కలిగించును. పైత్యమును తగ్గించును, గర్భిణీ స్త్రీలకు శ్రేష్ఠం. 

మామిడి : హృదయమునకు మంచిది. బలమును కలిగించును, వాతమును హరించును, శుక్రవృద్ధికరం, రుచికరము, కాంతిని కలుగచేయును, శరీరమునకు చలువ చేయును. 

అరటిపండు : చలువ చేయును, మలబద్ధము చేయును (త్వరగా జీర్ణము కాదు). బలము కలుగచేయును. దప్పిని తగ్గించును. రక్తస్రావము, క్షయ రోగములందు పథ్యము. 

నారింజపండు : చలువ చేయును, దప్పికను తగ్గించును, రుచిని కలిగించును, మధుమేహమునందు పనిచేయును, పైత్యమును తగ్గించును, స్త్రీలలో నెలవారీ ఋతుస్రావమును క్రమబద్ధీకరించును. ముట్టునొప్పిని తగ్గించును, నులి పురుగులను నశింపచేసి, జీర్ణాశయ సంబంధ వ్యాధులను తగ్గించును. రక్తవృద్ధిని చేస్తుంది. చర్మానికి కాంతిని కలిగిస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది. 

- వచ్చే సంచికలో మరిన్ని ఫలాల గురించి..

కాబోయే ప్రధానికి హిందుత్వంపై విశ్వాసం ఉండకూడదా?

నితీష్ కుమార్
ఇటీవలి రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలకు తెర లేచింది. ఎన్.డి.ఏ.లోని భాగస్వామ్య పక్షమైన జనతాదళ్(ఎస్) నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భా.జ.పా. బలపరిచిన అభ్యర్థి పి.ఏ.సంగ్మాను కాదని, యు.పి.ఏ. ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీ అభ్యర్ధిత్వాన్ని బలపరిచాడు. నితీష్ కుమార్ రాజకీయ ఎత్తుగడలలో ఇది ఒక భాగం. గత కొంతకాలంగా సెక్యులర్ నాయకుడిగా తానూ గుర్తింపు పొందాలని ఆయన తాపత్రయపడిపోతున్నారు. వాస్తవానికి ఎన్.డి.ఏ. కూటమిలోనికి రాక ముందు బీహార్ రాజకీయాలలో నితీష్ పాత్ర అంతంత మాత్రమే. బి.జే.పి. సహాయంతో రెండు పర్యాయాలు బీహార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తరువాత జాతీయస్థాయి నాయకుడిగా గుర్తింపు లభించింది. దాన్ని మరచి, భాజాపాలోని అనేక అంశాలపై తరచూ విభేదిస్తూ బీహార్ లోని ముస్లిం వర్గాలలో సెక్యులర్ నాయకుడుగా గుర్తింపు పొందటానికి తాపత్రయపడుతున్నారు. బీహార్ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీని ప్రచారానికి రాకుండా చేయటం కూడా అందులో ఒక భాగం.

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు నిరాకరించటమే కాకుండా 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బి.జే.పి. తరపున ప్రధానమంత్రిగా ప్రతిపాదించే వ్యక్తి "సెక్యులర్" వాది అయి ఉండాలని అనవసరమైన, అసందర్భ ప్రకటనను విడుదల చేశారు. రెండు సంవత్సరాల తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి, 185 పార్లమెంటు స్థానాలున్న భా.జ.పా. పార్టీకి సరిగ్గా 20 స్థానాలు కూడా లేని జనతాదళ్(ఎస్) నాయకుడు నితీష్ కుమార్ షరతులు విధించడం విడ్డూరమే. భా.జ.పా. అండతో పైకెదిగి భా.జ.పా.కే షరతులు విధించడం ఇంకా విచిత్రం. బీహార్ లో నితీష్ కుమార్ సెక్యులర్ నాయకుడుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటానికి భా.జ.పా.ను ఒకరకంగా బ్లాక్ మెయిల్ చేయాలనుకొంటున్నట్లున్నది.

శ్రీ మోహన్ భాగవత్
కానీ దేశ ప్రధాని విషయంలో నితీష్ కుమార్ చేసిన ప్రకటనపై స్పందించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ ఒక సందర్భంలో మాట్లాడుతూ "ఈ దేశానికి కాబోయే ప్రధాని హిందుత్వ భావాలపై విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి అయి ఎందుకు ఉండకూడదు? అని ప్రశ్నించారు.

పై విషయం జాతీయ రాజకీయాలలో ఒక సంచలనమైన చర్చను తెర పైకి తెచ్చింది.


రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్.డి.ఏ. భాగస్వామ్య పక్షమైన జనతాదళ్(ఎస్) నాయకుడు నితీష్ కుమార్ ఎన్.డి.ఏ. అభ్యర్థిని వ్యతిరేకించగా యు.పి.ఏ. పక్షంలోని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ యు.పి.ఏ. ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించడం ఆసక్తికరం.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికలలో నూతన రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనా ఈ నూతన సమీకరణాల స్పష్టతకు ఇంకా కొద్ది రోజులు వేచి చూడవలసిందే. 


- పతికి

సనాతన ధర్మ సంస్కృతుల రక్షణకై చేసే సంకల్పమే రక్షాబంధన్


ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఒక విశిష్ట స్థానమున్నది. భారతీయ సంస్కృతికి ఆధారం ధర్మాచరణ. ధర్మము అనే పదానికి మన హిందూ సమాజంలో ఒక విశేషత ఉన్నది. అందుకే ఈ దేశంలో "ధర్మో రక్షతి రక్షితః" అంటారు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తూ ఉంటారో వారిని ధర్మం రక్షిస్తుందని భావం. ధర్మం ఎప్పుడు అస్థిరమవుతుందో అప్పుడు సమాజ జీవనంలో పతనం ప్రారంభమవుతుంది. అందుకే ధర్మాన్ని కాపాడటం మనందరి కర్తవ్యం. సనాతనమైన మన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు పరస్పరము రక్షకులమై మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవాలని తెలిపేదే రక్షాబంధన్.

నిత్య జీవితంలో ఎవరికి వారు మన మన వ్యవహారాలలో, సంసారాలలో చిక్కుకొని నడుస్తున్నప్పుడు మన ధర్మ రక్షణ ఆశయము విస్మరణ జరగకుండా, ఏ విద్యావిజ్ఞానాల మీద మన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలు ఆధారపడి ఉన్నాయో వాటిని గుర్తు చేసేది, వాటిని మననం చేయాలని స్ఫురింపచేసేది శ్రావణ పూర్ణిమ. ఈ శ్రావణ పూర్ణిమ విద్యాధ్యయనమునకు ప్రారంభ దినంగా పాటించబడుతూ ఉండేది. సన్యాసులు మూడు రాత్రులు ఒకచోట నిద్ర పోరాదు అనే ఒక నియమం ఉంది. అంటే నిరంతరం తిరుగుతూనే ఉండాలి. ఆ నియమానికి ఒక్క ఆషాఢ పౌర్ణమి నుండి నాలుగు మాసాలు మినహాయింపు ఉంది. ఆషాఢ పౌర్ణమి నుండి చాతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది. ఈ నాలుగు మాసాలు కదలకుండా ఒకే స్థలంలో ఉంటూ ప్రజలకు ధర్మ ప్రబోధం చేస్తూ ఉండాలి. అటువంటి బాధ్యత సాధుసంతులకు ఉంది. సమాజంలో ధర్మం, సంస్కృతి గురించి ప్రజలకు అవగాహన కలిగించటం ఎంత ముఖ్యమో ఆ ధర్మ సంస్కృతులను నిత్య జీవితంలో ఆచరించటం, వాటిని కాపాడుకొనేందుకు కృషి చేయటం కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన అంశం. మహాభారత గాధ చదువుతున్నప్పుడు ధర్మం కోసం పాండవులు పడినపాట్లు మన హృదయాలను కదిలిస్తాయి. భగవాన్ శ్రీకృష్ణుడు "ఇదం న మమ" అనే భావంతో వ్యవహరించిన కర్మమయ జీవనం ఏ కాలానికైనా ఆదర్శం. ధర్మ సంరక్షణకు శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నాలు ఎంతో ప్రేరణదాయకం.

ధర్మరక్షణలోనే సమాజ రక్షణ, పరస్పర రక్షణ ఉన్నది. ధర్మ సంరక్షణకు ఇంద్రుని భార్య శచీదేవి ఇంద్రుడికి రక్ష కట్టి ఈ రక్ష సాక్షిగా మీరు విజయం సాధిస్తారని చెప్పింది. ఆ స్ఫూర్తే మనకు రక్షాబంధనం ఇచ్చే సందేశం. రక్షాబంధన్ నేటికీ సమస్త భారతంలో ఏదో రూపంలో మనకు కనబడుతుంది. మన దేశంలో ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ఒక సంకల్పం చెప్పుకొంటాం. ఈ సంకల్పానికి చిహ్నంగా కట్టే మామిడి తోరణమే రక్ష. మన దేశం మీద విదేశీయుల దురాక్రమణ జరుగుతున్న సమయంలో పరస్పరం సంరక్షించుకొని సమాజ సంరక్షణకు చేసిన ప్రేరణ కలిగించే అనేక సంఘటనలు కనబడతాయి. చత్రసాల్ బుందేల్ ఖండ్ కు రాజు. మొగలులతో పోరాటంలో తన శక్తి సరిపోకపోతే బాజీరావు పీష్వాకు సందేశంగా రక్ష కట్టి పంపించాడు. బాజీరావు చత్రసాల్ కు రక్ష పంపి సహకరించాడు. ఈ విధంగా దేశ ధర్మ సంరక్షణకు కృషి చేశారు.  

ఈ రోజున ప్రపంచంలో మార్పు కోసం భారత్ భారత్ గా నిలబడాలి. భారత్ భారత్ గా నిలబడాలంటే హిందువు హిందువుగా నిలబడాలి. హిందువు హిందువుగా నిలబడాలంటే హిందుత్వం గురించి అవగాహన కావాలి. హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను అర్థం చేసుకొని సమర్థవంతంగా తిప్పికొట్టగలగాలి. ఈ దేశంలోని పాలకులకు హిందుత్వ అవగాహన ఉండాలి. హిందూ సమాజ సంరక్షణకు నిలబడాలి. అందుకే హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకొన్న వ్యక్తి ఈ దేశ ప్రధాని కావాలి. ఈ దేశంలో హిందువు తనను తాను హిందువుగా గుర్తించుకోని  కారణంగా కాశ్మీర్ రావణ కాష్టంలా ఉంది. పాలకులు తమ అధికారాన్ని పదిలపరచుకొనేందుకు అవసరమైన విధానాలను అమలు చేస్తూ సమస్యలను మరింత జటిలం చేస్తున్నారు. 

మరోప్రక్క పాకిస్తాన్ కంటే ప్రమాదకరంగా బంగ్లాదేశ్ అవతరించింది. అక్కడి హిందువుల జీవన పరిస్థితులను దుర్భరం చేయటం, హిందువులను మహమ్మదీయులుగా మతం మార్చటం విశృంఖలంగా సాగిపోతున్నది. ఇంకొక ప్రక్క బంగ్లాదేశ్ తన చిరకాల వాంఛ అయిన ఈశాన్య రాష్ట్రాలను ఇస్లాంమయం చేసేందుకు అక్రమ వలసలు ప్రోత్సహిస్తూ అనేక సమస్యలు సృష్టిస్తున్నది. ఆ సమస్యల దుష్ఫలితాలు ఈ రోజున చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అస్సాం హిందువు, కాశ్మీరీ హిందువు, దేశంలో మరో ప్రాంతంలో ఉన్న హిందువు - ఇలా మనందరం హిందువులం. మనలో మనకు గల పరస్పర సంబంధం, ఐక్యతే ఈ దేశాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుతుంది. అదే మనకు శ్రీరామరక్ష అనే భావం పటిష్టం కావాలి. దానికోసం కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఆర్ధిక సరళీకరణ పేరుతొ విశృంఖల ఆర్ధిక విధానాలు ప్రజలను అనేక సమస్యలలోనికి నెడుతున్నది. దేశంలో అవినీతి ఎంతగా పెరిగిపోయిందంటే అవినీతే ఈ రోజున ఈ దేశాన్ని పాలిస్తున్నది. ఈ సంకట పరిస్థితుల నుండి మనలను మనం కాపాడుకొంటూ సమాజాన్ని కాపాడుకోవటం మనందరి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుకొంటూ మనం పరస్పరం రక్ష కట్టుకోవాలి. ఈ దిశలో ఈ దేశంలో పని చేస్తున్న అన్ని ధార్మిక శక్తులను కలిపి ఈ సమాజాన్ని శక్తివంతం చేసేందుకు కృషి చేయాలి. 

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ పనిని వేగవంతంగా చేసుకొంటూ ముందుకు పోతున్నది. ఈ రోజున ఈ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులలో "మనం" అనే భావనను నిర్మాణం చేస్తూ మన ధర్మం, సంస్కృతిని కాపాడుకొనేందుకు కృషి చేసేందుకు పని చేస్తున్నది. హిందూ సమాజంలో భేద భావనలు దూరం చేసి పరస్పర సోదర భావంతో కలిసి ఉండేందుకు, ఉండగలుగుతాము, అద్భుతాలు సాధించగలుగుతాము అని అనేక ఉదాహరణలు సంఘం ఈ రోజున సమాజం ముందు ఉంచుతున్నది. ఈ రోజున దేశ ప్రజలలో సంఘం యెడల శ్రద్ధ, విశ్వాసం నిర్మాణమవుతున్నాయి. ఈ పనిని ముందుకు తీసుకొని వెళ్లేందుకు మనందరం కృషి చేయాలి. ధర్మ దోష శక్తుల కుయుక్తులను వమ్ము చేయాలి. ఈ దేశ ప్రజలలో భేదభావాలు నిర్మాణం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్న అన్ని శక్తుల కుతంత్రాలను విఫలం చేయాలి. హిందూ సమాజం ఒకే కుటుంబంగా లేచి నిలబడి వసుధైవ కుటుంబ భావనను పటిష్టం చేసి ప్రపంచంలో శాంతిని సాధించాలి. ఆ లక్ష్యమే పరమేశ్వరుడు హిందూ సమాజానికి యుగయుగాలుగా ఇచ్చాడు. ఆ లక్ష్య సాధన దిశలో "నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం ఈ దేశానికి, ధర్మానికి, సంస్కృతికి రక్ష" అనే భావంతో రక్ష కట్టుకొని ఆ కర్తవ్యాన్ని జాగృతంగా ఉంచుకొందాము. అదే రక్షాబంధన్ మనకు ఇచ్చే సందేశం. 

ప్రణబ్ రాష్ట్రపతి పదవికి తగినవాడు కాదా?!


రాష్ట్రపతి పదవికి యుపిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ అసలు అత్యుత్తమ అభ్యర్థి కాదనేది ఆయన గురించి బాగా తెలిసిన విశ్లేషకుల వాదన. దాదా ఎమర్జెన్సీకి వత్తాసు పలకడమే కాక, దేశమంతటా దమనకాండ సాగించిన ఇందిర అనుచర వర్గంలో ఒకరనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, కార్పొరేట్ లాబీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే ఆర్థికమంత్రిగా కూడా ఆయనకు పేరు ఉంది. అవినీతి, అక్రమాలతో విదేశాల్లో నల్లధనం దాచుకున్న దొంగల పేర్లు బయటకు వెల్లడించకుండా కాపాడింది ప్రణబ్ దాదాయేనని ప్రముఖ న్యాయవాది రాంజత్మలానీ ఇటీవలె ఆరోపించారు. దేశ ప్రజలచే గాంధీ, నెహ్రూలకంటే ఎక్కువగా అభిమానించబడిన నేతాజీ విషయంలోనూ దాదా తన దుష్టభుద్ధిని చాటుకున్నారని అనుజ్ థార్ అనే జర్నలిస్టు తన "ఇండియన్ బిగ్గెస్ట్ కవరప్" అనే పుస్తకంలో విమర్శలు గుప్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారనే వాదనను నిజమని నిరూపించేందుకు ప్రణబ్ నేతాజీ కుటుంబ సభ్యులకు లంచం ఇవ్వజూపారని ఆ పుస్తకంలో వివరించారు. 

1995లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి విదేశాంగ శాఖ మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ జర్మనీ వెళ్ళారు. అక్టోబర్ 21న బోస్ సతీమణి ఏమ్లీని కలుసుకున్నారు. నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించారనీ, దీనికి అంగీకరిస్తున్నట్లుగా ఒక పత్రంపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారు. తన ప్రతినిధి ద్వారా బ్యాంక్ చెక్ ఇచ్చేందుకు కూడా ప్రణబ్ యత్నించారు. ప్రణబ్ తీరుపై ఏమ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకం చేసేందుకు నిరాకరించారు. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించాడని తమ కుటుంబ సభ్యులు నమ్మడం లేదని చెప్పారు. అంతేకాదు, జపాన్ లో ఉన్న అస్థికలు నేతాజీవి కావని స్పష్తం చేశారని అనుజ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్ లోని నేతాజీ ముని మేనల్లుడు సూర్యకుమార్ బోస్ కు ఏమ్లీ ఫోన్ చేసి చెప్పారని, సూర్య కుమార్ బోస్ ఈ విషయాన్ని తన డైరీలో వ్రాసుకున్నారని అనుజ్ థార్ తన పుస్తకంలో స్పష్టం చేశారు.

ఇక్కడ అందరికీ ప్రశ్నార్ధకం అయిన విషయం ఏమిటంటే, ప్రణబ్ దాదా నుంచి ఈ ఆరోపణలపై ఎటువంటి సమాధానం లేకపోవటం. ఇది పలు విమర్శలకు, అనుమానాలకు దారి తీస్తున్నది. దేశ అత్యున్నత పీఠంపై కూర్చునే వ్యక్తి వివాదాస్పదుడుగా ఉండకూదనేది ప్రజల మనోభావం. 


- నారద

హిందూ ధర్మ సమ్మేళనంకై స్వామీజీల పిలుపు

కలియుగాబ్ది 5114 , శ్రీ నందన నామ సంవత్సరం, ఆషాఢ మాసం

భాగ్యనగరంలోని శిల్పకళావేదికలో జూలై 1న హిందూ ధర్మ సమ్మేళనం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలు, వేద పండితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ మఠాధిపతులు "స్వదేశంలోనే హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారు. ధార్మిక, మత వ్యవహారాలలో అడుగడుగునా ప్రభుత్వ పెత్తనానికి, వివక్షతకు గురి అవుతున్నారని, హిందూ సమాజానికి విదేశాల నుండి కూడా ముప్పు వాటిల్లుతున్నదని" విచారం వ్యక్తం చేశారు. దేశంలో కేవలం హిందూ దేవాలయాలపై మాత్రమే ప్రభుత్వ అజమాయిషీ ఉంటున్నదని, మరే ఇతర మతాల ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వ అజమాయిషీ లేదన్న విషయాన్ని ఎత్తి చూపారు. హిందూ ఆలయాలు, ధార్మిక సంస్థల నిధులను డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం వంటి వాటికి వినియోగించరాదని, అలాగే దేవాలయాలలో అన్యమతస్తులను ఎగ్జిక్యూటివ్ అధికారులుగా నియమించరాదని సూచించబడింది. మతమార్పిడుల పట్ల శ్రీ అరవిందరావు, శ్రీ హనుమాన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ పరిస్థితులను అధిగమించేందుకు హిందువుల న్యాయబద్ధ రాజ్యాంగ విహిత ప్రాథమిక మతహక్కులను నిలబెట్టేందుకు విశాల ప్రాతిపదికపై హిందూ ధర్మ సమ్మేళనం అనే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, దానికి భక్తి చానల్ అధినేత టి.నరేంద్ర చౌదరి బాధ్యత స్వీకరించాలని నిర్ణయించబడింది. "హిందూ ధర్మ సమ్మేళనం" వ్యవస్థ యొక్క స్వరూప స్వభావాలను త్వరలో ఖరారు చేయాలని నిర్ణయించటం స్వాగతించదగిన విషయం. పూజ్యులు సద్గురు శివానంద మూర్తి గారు, ప్రముఖ స్వామీజీలు హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు చేసిన ఈ సంకల్పము త్వరలోనే కార్యాచరణకు రావాలని, ఇప్పటికే ఈ దిశలో వివిధ రంగాలలో పని చేస్తున్న ప్రముఖులను కలుపుకొని పోవటానికి చేసిన నిర్ణయం ఎంతో హర్షించదగినది. దేశ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న అనేకమంది ప్రముఖులను కలిపే ప్రయత్నం శ్రీ శ్రీ దయానంద సరస్వతీ స్వామీజీ చేస్తున్నారు. వారి శిష్యులు శ్రీ పరిపూర్ణానంద (శ్రీ పీఠాధిపతి) స్వామి, అనేకమంది ఇతర స్వామీజీలు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు వేగవంతం కావాలి. హిందూ సమాజం జాగృతమై తన సమస్యలను తానే పరిష్కరించుకోవాలి. హిందూ సమాజం యొక్క సర్వతోముఖాభివృద్ధికి సమాజాన్ని సిద్ధం చేయటం ఎంతో మహత్తరమైన కార్యం. ఈ కార్యక్రమానికి కొత్తరూపం ఇవ్వాలని, పనిని వేగం చేయాలని నిర్ణయించి ఈ దిశలో ప్రయత్నాలు ప్రారంభించటానికి నాంది ఈ కార్యక్రమం. ఇది స్వాగతించదగినది.

నా రూటే వేరు


"ఉలగం పలు విధం - అది లెనా నొరువిదం" అని ఒక అరవ సామెత ఉన్నది. అనగా "ప్రపంచం పది విధాలుగా ఉంటుంది. అందులో నాదొక విధం" అని అర్ధం. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ప్రపంచ దేశాలన్నీ ఒక పద్ధతిలో సాగుతుంటే భారతదేశం "నా రూటే వేరు" అన్న ధోరణిలో సాగుతున్నది. అల్ప సంఖ్యాక వర్గాల వారికి భారతదేశంలో మహారాజ భోగమే. అనుమానమా? అయితే సామియేలు గారి సంగతి చూడండి. జైళ్ళ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శామ్యూల్ జాన్సన్ ఒక అవినీతిపరుడు. గతంలో జైళ్ళ డైరెక్టర్ జనరల్ గా ఉన్న, లోకేంద్ర శర్మకు లంచం ఇవ్వబోయి ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడు. ఈయన మీద హైకోర్టులో క్రిమినల్ కేసు పెండింగులో ఉంది.

సామాన్యంగా ఐతే ఇటువంటి అధికారిని ఉద్యోగం నుండి పూర్తిగా తొలగిస్తారు. కానీ! మన ప్రభుత్వం నిర్వాకం చూడండి, శామ్యూల్ గారు ఉద్యోగ విరమణ చేయడానికి ఒక్క రోజు ముందు ఆయనకు ఇన్స్పెక్టర్ జనరల్ గా ప్రమోషన్ ఇచ్చి సగౌరవంగా సాగనంపారు. ఈయన ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో ఉన్నది కొన్ని గంటలు మాత్రమే. ఐతే ఏమి? ఈ పదోన్నతి కారణంగా ఎన్నోరెట్లు టర్మినల్ బెనిఫిట్లు పెరుగుతాయి. ఉద్యోగ విరమణానంతరం ఎన్నో సౌకర్యాలు ఒనగూడుతాయి. ఇది సెక్యులర్ దేశం అయినప్పటికీ, ఏ పని జరగాలన్నా మత ప్రాతిపదిక పైనే!

జై లౌకికవాదం   

- ఈనాడు, 30/6/2012. 

- ధర్మపాలుడు

దేశభక్తులను రూపొందించే ఫాక్టరీ ఆర్.ఎస్.ఎస్.


శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య ప్రముఖ మార్క్సిస్టు కమ్యూనిస్టు నాయకుడు. నిరాడంబరుడుగా పేరుబడ్డ ఈయనను తెలియని వారుండరు. శ్రీ సుందరయ్య తన ఆత్మకథలో ఇలా వ్రాసుకున్నారు. "శ్రీమద్ భగవద్గీత నాకు ఎంతో స్ఫూర్తి దాయకమైనది. అంతేగాక ఆర్.ఎస్.ఎస్. నాయకుడు శ్రీ గోళ్వాల్కర్ మాటలు, ఆయన వ్యక్తిత్వం నాలో దేశభక్తిని రగిలించాయి". హిందూ ధర్మ ఔన్నత్యం తననెంతో ప్రభావితం చేసిందని కూడా వారు పేర్కొన్నారు. కొంతమంది అగ్ర నక్సలైట్ నాయకులు కూడా వారి బాల్యంలో శాఖకు వెళ్ళినట్లు కొన్ని సందర్భాలలో పత్రికలలో చూశాం. 

నా బొజ్జ నిండితే చాలు అదే శ్రీరామరక్ష అనుకొనే కాలంలో ఎవరైనా సమాజాన్ని గురించి ఎందుకు ఆలోచించాలి? సాటి మనిషి కష్టాలు పట్టించుకోవాలంటే స్పందించే హృదయం కావాలి. స్పందించే హృదయం కావాలంటే దేశభక్తి ఉండాలి. దేశభక్తి సంఘ శాఖలో మాత్రమే లభిస్తుంది. అదీ ఉచితంగా. పనిచేసే రంగమేదైనా కావచ్చు.  కానీ స్వార్ధాన్ని ప్రక్కన పెట్టి దేశాన్ని గురించి ఆలోచించాలంటే ఒక్క సంఘ శాఖకే అది సాధ్యం. శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు తన ఆత్మకథలో ఈ విషయాన్ని చెప్పారు. 

ఈనాడు మన దేశంలో వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉండి మంచి పేరు తెచ్చుకున్న వారు ఎందఱో వారి బాల్యంలో నిక్కరు ధరించి శాఖకు వెళ్ళిన వారే. ఆ విషయం వారే స్వయంగా వివిధ సందర్భాలలో చెప్పిన విషయం మనం వినే ఉంటాము. 

- జూన్ 12,  ఆంధ్రజ్యోతి వ్యాసం ఆధారంగా

- ధర్మపాలుడు

జమ్మూ కాశ్మీర్ పై మధ్యవర్తుల నివేదిక ప్రగతి శీలమా? ప్రమాదకరమా?

వేదికపై ప్రసంగిస్తున్న డా. జితేంద్ర సింగ్
జూలై 1వ తేదీన బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోషల్ కాజ్ మరియు జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం సంయుక్తంగా జమ్మూ కాశ్మీర్ పై మధ్యవర్తుల నివేదిక ప్రగతిశీలమా? ప్రమాదకరమా? అనే అంశంపై జరిగిన సంగోష్టి కార్యక్రమంలో శ్రీ జితేందర్ సింగ్ (బిజెపి చీఫ్ స్పోక్స్ పర్సన్), శ్రీ మాడభూషి శ్రీధర్ (నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్), శ్రీ రాహుల్ (కాశ్మీర్ పండిట్) ప్రసంగించారు. శ్రీ రాకా సుధాకర్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమతి సోమరాజు సుశీల గారు (సోషల్ కాజ్) వందన సమర్పణ చేశారు. 

కార్యక్రమంలో శ్రీ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ "ఇంటర్ లాక్యుటర్స్ అనే పదమే చాలా విచిత్రంగా ఉంది. సమస్యను పరిష్కరించాలని లేనప్పుడు ప్రభుత్వాలు చేసే పని ఒక కమిటీ వేసి అధ్యయనం చేయించటం. కమిటీ నివేదికలో అందరూ బాగుండాలి అని చెప్పింది. అందరూ బాగుండాలంటే సాధ్యాసాధ్యాలు చర్చించాలి. ఈ కమిటీ అట్లా చర్చించకుండా ఇంకొక కమిటీ వేసేందుకు వీలుగా రిపోర్ట్ తయారు చేసింది. ఈ నివేదిక తాజా అభిప్రాయం కాదని ప్రభుత్వ గృహమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ నివేదికలో కాశ్మీర్ కు ప్రత్యేకంగా కేటాయించిన 370 ఆర్టికల్ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడటంలో కేంద్రం, వివిధ పార్టీలు విఫలమైనాయనే అభిప్రాయం కనబడుతోంది. తాత్కాలికం అని చెప్పబడిన 370 ఆర్టికల్ ను శాశ్వతం చేయాలని సూచించారు. దీనిలోనే అసలు సమస్య ఉన్నది. ఈ నివేదిక ఎటువంటి ముగింపును ఇవ్వలేదు. ముగింపు ఇవ్వకపోవటమే ముగింపు అని చెప్పింది. ఇంతకాలం అధ్యయనం చేసిన కమిటీ చివరకు చెప్పింది ఇదీ. రాహుల్ మాట్లాడుతూ "కాశ్మీర్ సమస్య గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ  మాట్లాడినా కాశ్మీర్ లోయ గురించి, కాశ్మీర్ ముస్లింల గురించి మాట్లాడతారు కాని, కాశ్మీర్ పండిట్స్ గురించి మాట్లాడరు. ఈ కమిటీ కూడా కాశ్మీరీ పండిట్స్ అభిప్రాయం తీసుకోవటం కాని, నివేదికలో వారి సమస్యల పరిష్కారం గురించి పేర్కొనటం కాని చేయలేదు. 1989 - 90 సంవత్సరాలలో కాశ్మీర్ లోయ నుండి కాశ్మీరీ పండిట్స్ బయటకు వచ్చేశారు. వాళ్ళందరూ దేశంలో అనేక చోట్ల, విదేశాలలో కూడా ఉన్నారు. వారి సమస్యకు పరిష్కారం ఎప్పటికి దొరుకుతుందో? 

ప్రధాన వక్త శ్రీ జితేందర్ సింగ్ మాట్లాడుతూ ... 

కాశ్మీర్ సమస్య పూర్వాపరాలు ఆలోచిస్తే అందులో రాజకీయ సమస్యలు చాల ఉన్నాయి. వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఉన్నాయి. వీటన్నింటికంటే కీలకమైనది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని విముక్తం చేయటం. అదే కాశ్మీర్ సమస్యకు పరిష్కారమని 1994 సంవత్సరంలో కాంగ్రెస్  ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. అది పార్లమెంట్ మినిట్స్ లో కూడా ఉంది. అంటే అది ప్రభుత్వ విధాన నిర్ణయం. మధ్యవర్తిత్వ కమిటీ (ఇంటర్ లాక్యుటర్స్) నివేదికలో దానికి విరుద్ధంగా ఉండటం దురదృష్టకరం. అసలు మన ప్రభుత్వాలు ఏ సమస్యనూ పూర్తిగా పరిష్కరించక పోవటమే విధానంగా కనబడుతున్నది. చాలా సంవత్సరాలకు పూర్వం అమెరికా ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ ను పత్రికా విలేఖరుల సమావేశంలో ఒక భారతీయ రిపోర్టర్ శ్రీ ఇంద్రజిత్ "టెక్సాస్ సమస్య మళ్ళీ తలెత్తుతుందా?" అని అడిగాడు. లిండన్ జాన్సన్ దానికి సమాధానంగా ఆ అధ్యాయం ముగిసి పోయిందని చెప్పారు. భారత దేశంలో ఏ అధ్యాయానికీ ముగింపు లేదు. అధ్యాయాలను తిరగదోడుతూ ఉంటారు. 

దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారత దేశం రెండు భాగాలుగా ఉండేది. 1) బ్రిటీష్ వాళ్ళు నేరుగా పాలించిన భూభాగాలు, 2) బ్రిటీష్ వాళ్లకు సామంతులుగా ఉన్న సంస్థానాలు. బ్రిటీష్ వారు పాలించే భూభాగం స్వతంత్రమయ్యింది. సంస్థానాలకూ స్వతంత్రం వచ్చింది. సంస్థానాలు అటు పాకిస్తాన్లో, ఇటు భారత్ లో ఎక్కడైనా విలీనం కావచ్చు. ఆ సమయంలో 560 సంస్థానాలను పటేల్ భారత్ లో విలీనం చేశారు. కాశ్మీర్ విలీనం మాత్రం నెహ్రూ తన చేతుల్లోకి తీసుకొన్నారు. ఈ సమయంలో కాశ్మీర్ కు సంబంధించి నెహ్రూ మూడు తప్పిదాలు చేశారు. 1) షేక్ అబ్దుల్లాకు మద్దతుగా కాశ్మీర్ రాజుపై వత్తిడి తెచ్చిన కారణంగా జమ్మూ కాశ్మీర్ విలీనం కొంత ఆలస్యమైంది. 2) పాకిస్తాన్ కాశ్మీర్ ను ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మన సైన్యం తిప్పికొడుతున్న సమయంలో ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి (UNO) కి తీసుకొని వెళ్ళారు. 3) కాశ్మీర్ కు తాత్కాలికం అని పేర్కొన్న ప్రత్యేక ప్రతిపత్తిగా 370 అధికరణం ఏర్పాటు చేశారు. 370 అధికరణం కాశ్మీర్ లోని ముస్లింలకు కూడా సమస్యాత్మకమయింది. దీనిపై చర్చ జరగాలి. తాత్కాలికం అని పేర్కొనబడ్డ 370 అధికరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపైన బహిరంగ చర్చకు ఆహ్వానించినా ప్రభుత్వం స్పందించడం లేదు. సమస్యను ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి అనటంలో కొందరికి కొన్ని రకాల మోహాలు దానిపై ఏర్పడ్డాయి. దానిని ఆసరా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. మధ్యవర్తిత్వ కమిటీ నివేదికలో ఆరు రకాల తప్పుడు సంకేతాలు కనబడతాయి.

1) రాజ్యాంగ కమిటీ ద్వారా 1953 కి ముందు, తరువాత కాశ్మీర్ కు వర్తింపచేసిన కేంద్ర ప్రభుత్వ చట్టాలను పునః సమీక్ష చేయాలని సూచించింది. అంటే పాత విధానాలను తిరిగి తోడాలనేది దాని సారాంశము. అంటే ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు ఇద్దరు రాష్ట్రపతులు, రెండు విధానాలు ఉండటం గతం. ఆ విధానానికి వ్యతిరేకంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ గళం ఎత్తారు. చివరకు బలిదానమైనారు. వాటిని ప్రభుత్వం ఎత్తకెఅలకు రద్దు చేసింది. వాటిని పునరుద్ధరించాలనేది ఆ కమిటీ సూచన. 

2) రాజ్యాంగము 370 అధికరణాన్ని తాత్కాలికం అని పేర్కొన్నారు. ఆ అధికరణంలోని తాత్కాలికం అనే పదాన్ని తొలగించాలని సూచించారు. అంటే ఆ అధికరణం శాశ్వతం కావాలనేది వాళ్ళ సూచన.  

3) కాశ్మీర్ భారత్ లో అంతర్భాగము, అందులో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది, అందుకే దానిని పి.ఓ.కే. అంటాము. ఈ నివేదికలో "పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్" అనే పదజాలం ఉపయోగించింది. ఇటువంటి విషయాలు కాశ్మీర్ లోయలోని వేర్పాటు వాదులు మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాలను ఈ నివేదికలో పేర్కొనటం దురదృష్టకరం. 

4) కాశ్మీర్ సమస్య అంటే కేవలం కాశ్మీర్ లోయలోని ముస్లింల సమస్య అనే అభిప్రాయం వ్యక్తమయింది. హురియత్ వాళ్ళతో చర్చలు జరపాలని కూడా సూచించారు. కాశ్మీర్ నుండి గేన్తివేయబడిన హిందువుల గురించి గాని, హిందూ ప్రతినిధులను కలవటం గాని చేయలేదు. ఇది తీవ్ర అభ్యంతరకరమైనది. కాశ్మీర్ పండిట్ లు లేని కాష్మీరియాట్ అనే దానికి అర్థం ఉందా?

5) కాశ్మీరు గవర్నరును నియమించాలంటే కాశ్మీర్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి మూడు పేర్లు సూచించాలి. దానిలో ఒక పేరు ఎన్నుకొంటారు. గవర్నర్, ముఖ్యమంత్రి వంటి పదాల విషయంలో ఉర్దూ పదాలు వాడాలని సూచించారు. ఇది భారత్ ఫెడరల్ రాజ్యాంగాన్ని నీరుగార్చేది.

6) గడిచిన 20 సంవత్సరాల నుండి కాశ్మీర్ లోను, దేశంలోను పాక్ ప్రేరిత ఉగ్రవాదం చాలా తీవ్రమైన సమస్యగా ఉన్నది. ఈ సమస్య గురించి ఆ కమిటీ ఎక్కడా ప్రస్తావించలేదు.

దేశ విభజన సమయంలో, కాశ్మీర్ ను పాకిస్తాన్ ఆక్రమించుకొన్న సమయంలో రక్షణ కోసం అక్కడ నుండి కాశ్మీర్ చేరిన హిందువులు రెండు లక్షలకు పైగా ఉంటారు. వారికి ఈ రోజుకీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసే హక్కు లేదు. 

మధ్యవర్తుల కమిటీ సూచించిన ఇటువంటి వివాదాస్పద విషయాలు కాశ్మీర్ సమస్యకు పరిష్కారం సూచించలేవు. దాని కోసం మరో కమిటీ వేయవలసిన పరిస్థితి నెలకొంది. ఇదే ముగింపుగా కమిటీ సూచించినట్లయింది. 

జమ్మూ కాశ్మీర్ సమస్య గురించి ప్రభుత్వం నిర్మల హృదయంతో ఆలోచించాలి

శ్యాంప్రసాద్ ముఖర్జీ

1953 ఫిబ్రవరి 14 న పార్లమెంటులో శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రసంగిస్తూ కాశ్మీర్ సమస్యను గురించి నిర్మల హృదయంతో ఆలోచించమని ప్రభుత్వ నేతలకు విజ్ఞప్తి చేశారు. 

"మనం ఒకరినొకరం నిందించుకోవద్దు. అలా చేసుకునేందుకు వేరే సందర్భాలు వస్తాయి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. తనను, ప్రజా పరిషత్ ను మతతత్వం పేరుతో జవహర్ లాల్ నెహ్రూ పదే పదే నిందించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన "ప్రధానమంత్రి మా అందరినీ మతతత్వ వాదులుగా ముద్ర వేశారని నాకు తెలుసు. వాదంలో గెలువలేకపోయిన ప్రతిసారీ ఆయన ఆ సమాధానాన్నే ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ అసత్యమైన ఆరోపణలతో నేను విసిగిపోయి ఉన్నాను. ఈ దేశంలో మతతత్వం ఉన్నదా? ఏదైనా రాజకీయ పార్టీ బహిరంగంగానే దీనిని ఆశ్రయిస్తున్నదా? అన్న విషయాన్ని తేల్చడానికి మనం ఒక తేదీని నిర్ణయించుకుని, చర్చిద్దాం. ముందు ప్రభుత్వాన్ని ఆరోపణలు పెట్టమనండి. మేం వాటికి సమాధానం ఇస్తాం. ఈ దేశంలో మతతత్వం ఉండాలని మేం ఎంతమాత్రం కోరుకోవడం లేదు. వివిధ మతాల ప్రజలు సమాన పౌరులుగా, సమాన హక్కులతో జీవించే సమాజం నిర్మాణం కావాలనే మేం కోరుకుంటున్నాం. పరస్పరం అవమాన పరచుకునేందుకు, ప్రయోజనాలు పొందేందుకు సంబంధించిన అంశం కాదిది. జాతీయ ప్రాధాన్యత గల ఒక సమస్యను పరిష్కరించడానికి సంబంధించిన అంశం. ఈ అంశం తీవ్ర సమస్యలను సృష్టించగలదు. దేశంలో అనేక ప్రాంతాలలో శాంతిని, సుఖాన్ని నాశనం చేయగలదు. సమయం మించి పోకుండానే చర్య తీసుకోమని ప్రధానమంత్రిని నేను అభ్యర్ధిస్తున్నాను".

అమెరికాలో పల్లకి మోత


ఇంట ఈగల మోత - బయట పల్లకి మోత అనే సామెత విన్నారు కదా! హిందువులు భారత దేశంలో రెండో శ్రేణి పౌరులు. కానీ! వారినే అమెరికా నెత్తిన పెట్టుకుంటోంది. ఇటువంటి వార్తలు క్రొత్త కాకపోయినా, నిన్న మొన్న జరిగిన ఒక విషయం చిత్తగించండి. మిత్రదత్తా గువాహాటీ (అస్సాం) డిల్లీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ చదివిన అనంతరం సిన్ సినాటీ (అమెరికా) విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా అందుకున్నది. ఈమె పరిశోధకురాలిగా, పాలనాధ్యక్షురాలిగా, అధ్యాపకురాలిగా చూపిన ప్రతిభ కారణంగా, చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా నియమించబడింది.

ఇది ఇలా ఉండగా అంజీ జైన ఇండోరు
విశ్వవిద్యాలయంలో పట్టా అందుకుని, కర్ణావతిలోని భారత మేనేజిమెంటు సంస్థ (ఐ.ఐ.ఎం.) లో ఎం.బి.ఏ. చదివి, కాలిఫోర్నియా (అమెరికా) విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పట్టా పొందారు. వీరు ఎల్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మేనేజిమెంటులో సీనియర్ అసోసియేట్ డీన్ గా నియమితులైనారు.

అది మన వాళ్ళ ప్రతిభ.


- ఆంధ్రజ్యోతి, 19/06/2012

- ధర్మపాలుడు