యో హి ధర్మం సమా శ్రిత్య

యో హి ధర్మం సమా శ్రిత్య
హిత్వా భర్తు: ప్రియాప్రియే 
అప్రియా ణ్యాహ పథ్యాని
తేన రాజా సహాయవాన్

భావము : ధర్మమునే ఆశ్రయించి ప్రియమును, అప్రియమును పట్టించుకొనక ప్రభువునకు అప్రియము లైనను మేలొనరించు  పలుకులు పలుకువాడు రాజుకు నిజమైన సహాయకుడు.
- విదుర నీతి