చర్చల్లో త్రిపుల్‌ తలాఖ్‌



మా మతాచారాల్లోకి ఎవ్వరి జోక్యాన్ని సహించమంటూ ఇస్లామిక్‌ సంస్థలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ముస్లిం మహిళలు తమకు కూడా పురుషులతో సమానంగా మసీదులు, దర్గాల్లోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా తమ భర్తలు తలాఖ్‌... తలాఖ్‌... తలాఖ్‌ అని మూడుసార్లు చెప్పి విడాకులు ఇచ్చే విధానాన్ని రద్దుచేయాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇది ఎన్నికల ముందు కామన్‌ సివిల్‌ కోడ్‌ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమని దేశంలోని లౌకిక పార్టీలు, ముస్లిం మత పెద్దలు నెత్తినోరు బాదుకుంటున్నారు. కొందరైతే షరియా చట్టాల అమలులో ముస్లింలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అసలు ఈ త్రిపుల్‌ తలాఖ్‌ ఏంటి? ఈ గోడవేంటి? ముస్లిం మహిళాలు దీన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి? దీనిపై రాజ్యాంగం ఏమంటుంది? అనే అంశాలను చిన్నగా పరిశీలిద్దాం.

భారతీయ ముస్లిం మహిళా ఆందోళన నాయకురాలు జకియా సోమన్‌ మాటల ప్రకారం త్రిపుల్‌ తలాఖ్‌కు సంబంధించి ఖురాన్‌లో ఎటువంటి ఆధారాలు లేవని, ప్రవక్త మరణానంతరం తాత్కాలికంగా దీనిని చేర్చడం జరిగిందని, తొంభై రోజుల కాలంలో కలిసి ఉండడమా విడిపోవడమా నిర్ణయించే హక్కు ఇరువురికి ఉంటుందని అన్నారు. ఆమె మాటల ప్రకారం ఖురాన్‌లో త్రిపుల్‌ తలాఖ్‌ ప్రస్తావన లేని కారణంగా దానిని నిషేదించడం షరియాకు వ్యతిరేకం కాదు. ముస్లిం మత పెద్దలు ఈ విషయంలో రాద్దాంతం చేయడంలో అర్థం లేదని వారు వాదిస్తున్నారు. నిజానికి షరియా చట్టాల ప్రకారం భర్తకు మాత్రమే విడాకులు ఇచ్చే హక్కు ఉంటుంది. భార్యకు ఎటువంటి హక్కు ఉండదు. భార్యకు ఒకవేళ 90రోజుల కాలవ్యవధిలో భర్తకు తిరిగి ఇష్టం పుడితే ఆమెను దగ్గరికి తీసుకోవచ్చు. విడాకులు పొందిన అనంతరం భార్య కూడా మరో పురుషుడిని వివాహం చేసుకోవచ్చు.

కాని నేడు చాలమంది షరియా చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బహు భార్యత్వాన్ని షరియా సమర్థించడం; తలాఖ్‌ అని చెప్పిన వెంటనే విడాకులు మంజూరు చేయడం ద్వారా ఎంతోమంది ముస్లిం మహిళలు అన్యాయానికి గురవుతున్నారు. నేటి భారతీయ ముస్లిం మహిళలు ఈ విధానాలను వ్యతిరే కిస్తున్నారు. షరియా చట్టంలోని త్రిపుల్‌ తలాఖ్‌ను నిషేధించాలంటూ ఉద్యమాలు చేపడుతున్నారు.

నిజానికి షరియా చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఒక దేశంలోని పౌరులకు ఒకేరకమైన చట్టం ఉండాలి. అందుకు భిన్నంగా భారతదేశంలో ప్రైవసీతో పాటు షరియా కూడా చలామణిలో ఉండడం ఒకింత బాధాకరం. ముఖ్యంగా దళిత, గిరిజనులతో పాటు స్త్రీలకు ప్రత్యేక హక్కులను కల్పించింది. ముస్లిం మహిళల కోసం ప్రత్యేక
చట్టాలను రూపొందించ వలసింది పోయి వాటిని సమర్థించేలా ముస్లిం మత పెద్దలు వ్యవహరించడం మహిళలకు అన్యాయం చేయడమే. అంతేకాకుండా దేశ లౌకిక స్ఫూర్తికి భంగం కలిగించడమే. ముఖ్యంగా తన భర్తకు నచ్చలేదనో, కోపం వచ్చిందనో, మరేదో కారణం చేతనో తలాఖ్‌ అని చెప్పి విడాకులు ఇచ్చి అన్యాయం చేయడం హేయమైన చర్యగా భావించవచ్చు.

భారత రాజ్యాంగంలోని అధికరణం 15(1) ప్రకారం లింగవివక్షను చూపొద్దు. అధికరణం 15(3) ప్రకారం ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకచట్టాలను రూపొందించ వచ్చు. రాజ్యాంగ అధికరణం 23(1) ప్రకారం మానవ అక్రమ రవాణా, బలవంతంగా కూలీ చేయించండం నేరం. రాజ్యాంగంలోని 39(ఎ) అధికరణం స్త్రీ, పురుషులకు జీవించడానికి సమాన హక్కులు కల్పించాలని సూచిస్తుంది. 39(డి) స్త్రీ, పురుషులు ఇరువురికి సమాన జీతం చెల్లించాలి. ఆర్టికల్‌51-ఎ(ఈ) ప్రకారం స్త్రీల గౌరవాన్ని కాపాడడం పౌరుల ప్రతి ఒక్కరి బాధ్యత.

త్రిపుల్‌ తలాఖ్‌ విధానాన్ని అనుసరించడం అంటే రాజ్యాంగం స్త్రీలకు ఇచ్చిన హక్కులను కాలరాయడమే. వారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా చేయడమే. వారి సమానత్వాన్ని అణగద్రొక్కడమే. సమానత్వం కావాలి అంటూ ఇన్ని రోజులు మొత్తుకున్న మహిళా సంఘాలు ఈ విషయంలో నోరు మెదపకపోవడం విచారకరం. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ మత రాజకీయాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ముస్లిం మహిళల పట్ల తాము ప్రవర్తిస్తున్న తీరుకు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణమిది.

మావి మాకే.. మీ వన్నీకూడా మాకే..!



జంతుశాస్త్రం ''పరాన్న భుక్కులు'' అనే జీవుల గురించి ప్రస్తావన చేస్తుంది. ఇటువంటి వారు మనుషులలో కూడా ఉన్నారు. మనుషులు అవయవ దానం చేయడం గురించి మనం తరచూ వింటూ ఉంటాం. కానీ! ఎవరు దానం చేస్తున్నారు... ఎవరు ప్రయోజనం పొందుతున్నారు అని ఎప్పుడు మనం ఆలోచించాం. ''జీవన్‌దాన్‌'' అనే ఒక స్వచ్ఛంద సంస్థ తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 241 మంది బ్రైన్‌ డెడ్‌ వ్యక్తులు అవయవదానం చేశారు. వీరు దాదాపు అందరూ హిందూవులే. ఈ అవయవ దానం ద్వారా ప్రయోజనం పొంది ప్రాణాలు నిలుపుకున్న వారు చాలా మంది మహ్మదీయులే!. ఐతే! ఇప్పటివరకు ఎంతమంది మహ్మదీయులు అవయవదానం చేశారో మీకు తెలుసా! ఐతే, వినండి దానం చేసిన ముస్లింల సంఖ్య గుండు సున్నా. అనగా ఒక్క ముస్లిం కూడా దానం చేయలేదు, కానీ వీరు హిందూవుల దానం మాత్రం స్వీకరిస్తారు.

దుష్ప్రచారం మిధ్య! సరస్వతి సత్యం



హిందూవులకు ఉన్న అసంఖ్యాకమైన తీర్థాలలో ప్రయాగ ఒక ప్రముఖ స్థానం ఆక్రమిస్తుంది. ఇక్కడి గంగ, యమున, సరస్వతి త్రీవేణి సంగమం జగత్ప్రసిద్ధం. ఇది అంతా బోగస్‌ సరస్వతి, గిరస్వతి ఏమి లేదు. అంతా మూఢనమ్మకం అని సూడో మేధావులు కొట్టి పారేస్తుంటారు. హర్యానా ప్రభుత్వం నియమించిన ఒక నిపుణుల సంఘం సుధీర్ఘంగా పరిశోధనలు జరిపి సరస్వతీ నది ఒకప్పుడు ఉండేదని సంఘం అధ్యక్షుడు మరియు భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు పద్మభూషణ్‌ కె.ఎస్‌.వైద్య ధ్రువీకరించారు. సరస్వతీ నది యొక్క మూడు వంకలు భారత్‌లోను, ఒక భాగం ఇప్పటి పాకిస్తాన్‌లో ప్రవహించిందని చెప్పారు. హిమాలయాలలో జన్మించి హర్యానా, రాజస్తాన్‌, గుజరాత్‌ల మీదుగా ప్రవహించి రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ద్వారా సింధూ సాగరంలో సంగమం అయ్యేదని వివరించారు.

భారత్‌తో సంబంధాలు చాలా విలువైనవి



2014 సంవత్సరానికి ముందు ఉన్న ప్రభుత్వాల అసమర్థతవల్ల ప్రపంచంలో భారత్‌ ఏకాకి అయింది. 2014 నుండి ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధాలు బలపరచుకుంటున్నది. అమెరికా ఎన్నికలలో కూడా 'భారత్‌తో సంబంధాలు' అనే అంశం చర్చకు వచ్చింది. ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇలా అంటున్నారు.''భారత్‌తో పాటు హిందూవులకు నేను పెద్ద అభిమానిని. ప్రవాస హిందూవులు, భారతీయ అమెరికన్లు మా దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. నేను విజయం సాధిస్తే భారతీయులకు శ్వేత సౌధంలో ఒక మంచి మిత్రుడు దోరుకుతాడు.'' ఇది ఇలా ఉండగా ఎవరు అధ్యక్షులుగా గెలిచినా, వారు 100 రోజుల లోపున మోదిని కలవాలి; భారత్‌తో సంబంధాలకు పెద్దపీట వేస్తారని అంటున్నాయి అమెరికా పత్రికలు.

దీపావళి వేడుకలు



''ఇంట్లో ఈగల మోత - బయట పల్లకి మోత'' అన్నట్లు ఉంది పరిస్థితి. ఏటా మనం జరుపుకునే దీపావళి పండుగకు ప్రపంచ ఖ్యాతి ఉన్నది. విదేశీయులు హిందువులను రెండు అంశాలతో గుర్తిస్తారు. ఒకటి - బొట్టు; రెండవది దీపావళి. ఇటీవల అన్ని హిందూ పండుగలను, ఉత్సవాలను వ్యతిరేకించడమే కొంతమంది దేశద్రోహులకు అలవాటుగా మారింది. కానీ, మన దీపావళి ఇతర దేశాలలో గౌరవం, మన్ననా పొందుతూ ఉండడం విశేషం. అమెరికా అధ్యక్ష అధికారిక నివాసం ''వైట్‌హౌస్‌''లో ప్రతి సంవత్సరం దీపావళి వేడుకను అధికారికంగా జరుపుతారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు.

25-10-2016 నాడు బ్రిటన్‌ ప్రధాని శ్రీమతి ''థెరిసా మే'' తన అధికార నివాసంలో అక్కడి భారతీయులకు దీపావళి విందు ఇచ్చారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడులు ప్రారంభించారు. ఆహుతులతో మాట్లాడుతూ ''ప్రధానిగా ఇలా మీకు తొలి దీపావళి విందు ఇవ్వటం తనకు ఎంతో ఆనందంగా ఉన్నదని'' ఆమె అన్నారు.