మహాభారత పద్యాలు (విదుర నీతి)

పరుల ధనమునకు, విద్యా
పరిణతికిని, దేశమునకు, బలమునకు మనం

బెరియంగ నసహ్యపడున
న్నరుండు దెవులు లేని వేదనంబడు నధిపా
 


భావం : రాజా! ఇతరుల ధనాన్నీ, విద్యలో ఆరితేరిన తనాన్నీ, వర్చస్సునూ, బలాన్నీ చూచి గుండె పగిలిపోయేలా ఈర్ష్యపడే మనుష్యుడు ఏ రోగమూ లేని దు:ఖం అనుభవిస్తాడు.