మహాభారత పద్యాలు (విదుర నీతి)

ఎదిరికి హితమును బ్రియమును
మది కింపును గాగ బలుకు మాటలు పెక్కై

యొదవినను లెస్స, యటుగా
కిది యది యనకూరకునికి యెంతయు నొప్పున్
 

భావం : రాజా! మనం పలికే పలుకు ఎదుటి వానికి మేలు కూర్చేదిగా ఉండాలి. విన్న వెంటనే హాయిగా ఉంది అనిపించాలి. మనస్సుకు ఇంపుగా ఉండాలి. అట్టి పలుకులు ఎన్నైనా మంచిదే. అలా పలుకలేకపోతే అసలు మాటాడకుండటం ఎంతో మేలు.