రామాయణం - శ్లోకాలు

చారిత్రేణ చ కో యుక్త: సర్వభూతేషు కో హిత:
విద్వాన్ క: క స్సమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శన:


ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయక:
కస్యబిభ్యతి దేవాశ్చ జాతిరోషస్య సంయోగే
 

భావం : పూర్వపు చరిత్రముతో గూడిన వాడు, అన్ని భూతములందు విరోధము లేనివాడు ఎవడు? విద్యావంతుడు, సామర్ధ్యము గలవాడు అందరనొకేవిధముగా ప్రేమతో జూచువాడు ఎవడు? ఆత్మవంతుడు, కోపమును జయించిన వాడు, ప్రకాశము గలవాడు, అసూయ లేనివాడు ఎవడు? పుట్టుకతో రోషముగల యెవని యుద్ధమునందు దేవతలు సైతము భయపడుదురో అట్టివాడు ఎవడు?