రామాయణం - శ్లోకాలు

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామోనామజనైశ్శృత:
నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ||

బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాఞ్చత్రు నిబర్హణ:
విపులాంసో మహాబాహు: కమ్బుగ్రీవో మహాహను:||
 

భావం : ఇక్ష్వాకు వంశమున బుట్టిన రాముడను ప్రసిద్ధిగలవాడుగా జనులలో వినబడుచున్న వాడు, నియతాత్ముడు, పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, ప్రకాశముగలవాడు, ఇంద్రియముల నిగ్రహించినవాడు ఉన్నాడు. 

ఆ రాముడు ఐశ్వర్యవంతుడు, బుద్ధిమంతుడు, నీతిగలవాడు, మాటలలో నేర్పరి, శత్రువుల సంహరించువాడు, విరివియైన మూపులు గలవాడు గొప్ప భుజములు గలవాడు, శంఖము వంటి కంఠము గలవాడు, గొప్ప చెక్కిళ్లు గలవాడు.