రామాయణం - శ్లోకాలు

ధర్మజ్ఞ స్సత్యసన్ధశ్చ ప్రజానాం చ హి తే రత: I
యశస్వీ జ్ఞానసంపన్న శ్శుచిర్వశ్య స్సమాధిమాన్ II

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా I
వేద వేదాఙ్గ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠిత: II

భావం : ధర్మము నెరిగినవాడు, సత్యసంధుడు, ప్రజల మంచియందాసక్తి గలవాడు, కీర్తి జ్ఞానములు గలవాడు, శుచి గలవాడు, భక్తులకు వశుడైనవాడు, నియతి గలవాడు.

తన క్షత్రియ ధర్మమునకు, తన జనులకు రక్షకుడు, వేదవేదాంగము లెఱిగినవాడు, ధనుర్వేదమందు నేర్పు ఉన్నవాడు.