అశోక్ సింఘాల్జీకి దేశవ్యాప్తంగా ఘనమైన నివాళి

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకులు, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు, అయోధ్య ఉద్యమ రథసారథి అయిన శ్రీ. అశోక్ సింఘాల్ జీ నవంబర్ 17 తేది నాడు ఢల్లీలో తుది శ్వాస విడిచారు. వారికి దేశవ్యాప్తంగా ఘన నివాళి ఇవ్వబడింది. భాగ్యనగర్లో జరిగిన శ్రద్ధాంజలి సభలో శ్రీ.ప్రవీణ్ భాయ్ తొగాడియా ప్రసంగించారు.  ఢల్లీలో జరిగిన కార్యక్రమంలో సరసంఘాచాలక్ మోహన్జీ భాగవత్ ప్రసంగించారు. ప్రసంగాలు సంక్ష్తిప్తంగా....
భాగ్యనగర్ కార్యక్రమము
ఢల్లీలోని రెండు చిన్న అద్దె గదుల కార్యాయంలో ఉన్న విశ్వహిందూ పరిషత్ను విశ్వవ్యాప్తం చేసిన వారు శ్రీ.అశోక్ సింఘాల్జీ. భారతదేశ సమ కాలీన చరిత్ర మలుపు తిప్పిన అయోధ్య ఉద్యమం యొక్క రథసారథి శ్రీ.అశోక్ సింఘాల్. దేశంలోని సాధుసంతులను ఏకం చేసి ధర్మసంసద్ ఏర్పాటు చేసి ధర్మదండం గా దానిని మలిచినవారు శ్రీ.అశోక్ సింఘాల్జీ అని ప్రవీణ్ భాయ్ తొగాడియా కొనియాడారు.
కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ. శ్రీమన్నారాయణ చిన్న జీయర్స్వామిజీ ప్రసంగిస్తూ ప్రపంచంలో ఉగ్రవాదులకు శాంతి కాముకులకు మధ్య యుద్ధం కొనసాగుతున్నది. శాంతి కోసం పనిచేస్తున్న వారిపైనే నిందలు మోపే పరిస్థితి దేశంలో జరుగుతున్నది. శాంతి కాముకులకు విజయం చేకూరేలా మనమంతా కలిసి పనిచేయటమే అశోక్ సింఘాల్ జీకి మనం సమర్పించే నిజమైన నివాళి

సందర్భంగా నవంబర్ 22 తేదిన ఢల్లీలో జరిగిన శ్రద్ధాంజలి సభ లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘచాలక్ శ్రీ.మోహన్జీ భాగవత్ మరియు బీజెపి నాయకులు డా మురళీ మనోహర్ జోషి, బీజెపి అఖిల భారత అధ్యక్షుడు అమిత్షా మొదలైన బీజెపి నాయకులు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాద్యక్షులు శ్రీ.ప్రవీణ్ భాయ్ తొగాడియా, ప్రముఖ స్వామి జీలు, మరియు దీదీమా సాధ్వీఋతుంబరా పాల్గొన్నారు. సందర్భంగా సాధ్వీ ఋతుంబరా మాట్లాడుతూ దేశంలో లక్షలాది మంది యువకులను చైతన్య పరి చినవారు శ్రీ.అశోక్ సింఘాల్జీ అని కొనియాడారు.
సందర్భంగా మోహన్జీ భాగవత్ మాట్లాడు తూ అశోక్ సింఘాల్జీ గొప్ప వక్త, సంగీత ప్రవీణ్యు డు. అశోక్ సింఘాల్జీ జీవిత కల. రామ జన్మభూమి స్థలంలో భవ్యమైన రామమందిరం నిర్మాణం చేయ టం. తద్వారా ప్రపంచానికి హిందూ సంస్కృతిని అందించటం అందుకే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణమే వారికి మనం సమర్పించే నిజమైన నివాళి.

ప్రజాస్వామ్యం కొత్త కాదుగానీ..

భారతదేశానికి ప్రజాస్వామ్యం అంటే తెలియదని కాదు. రాజరి కాలున్న కాంలో కూడా భారత దేశంలో గణతంత్ర రాజ్యాలున్నా యి. అప్పట్లో పూర్తిస్థాయి ప్రజా స్వామ్యం ఉండేదని చెప్పటం లేదు. కాకపోతే భారతదేశానికి పార్లమెంట్లుగానీ, పార్లమెంటరీ సంప్రదాయాలు గానీ కొత్త కాదు. బౌద్ధ భిక్ష సంఘాలపై జరిగిన అధ్యయనాలలో.. నేటి ఆధునిక ప్రపంచానికి తెలిసిన పార్లమెంటరీ సంప్రదాయాలను నాటి సంఘాల్లో పాటించే వారని చెబుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను భారతదేశం కోల్పోయింది.  ఇప్పుడు మళ్లీ కోల్పోతుందా? నాకు తెలియదు. భారత్ వంటి దేశంలో ఇది సాధ్యమే. చాలా కాలంగా ప్రజాస్వామ్యం అమల్లో లేదు. ఇపుడు కొత్తగా ఉంటుంది. నియంతృత్వానికి దారిఇచ్చే అవకాశం  కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది. ప్రజాస్వామ్యం తన రూపాన్ని అలాగే ఉంచుకుని దానిలోనే నియంతృ త్వానికి కూడా అవకాశం కల్పిస్తుంది. జాగరూకతతో ఉండటం అవసరం.
డా బి.ఆర్.అంబేద్కర్

మత స్వాతంత్య్రంలో భారత్‌కు ప్రథమస్థానం
ప్రపంచం అంతా హిందూదేశాన్ని పొగడ్తలతో ముంచి ఎత్తుతూ ఉండగా.. మన దేశంలోని సెక్యులర్ గుంటనక్కలు మాత్రం ఏదో కొంపమునిగిపోయినట్లు ఊళులు వేస్తున్నాయి. జ్ఞానానికి విద్యకు హిందూదేశం పుట్టినిలు అని విదేశాల ఘోషిస్తూ ఉంటే, ‘మనవాళ్ళు ఉత్త వేధవాయిలోయ్అని ఇక్కడి అంగుష్ఠమాత్రపు మేధావులు వాపోతున్నారు.‘వ్యూ` రిసెర్చిసెంటర్అనేది అమెరికాలో ఒక విషయ` సమాచార సేకరణ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా సర్వేక్షణలు నిర్వహించి ఫలితాలను నిస్పాక్షికంగా ప్రకటిస్తూ ఉంటుంది. వీరు ఇటీవలమతస్వేచ్ఛఅనే అంశంపై ఒక ప్రపంచ వ్యాప్త సర్వేని నిర్వహించారు. 38దేశాలలో 40,786 మందిని ఇంటర్వ్యూ చేశారు. వివిధ దేశాలో స్పందన విడివిడిగా ఉండగా, భారత్లో మాత్రం 83శాతం మంది ప్రజలుపూర్తి మతస్వేచ్ఛఉందని కుండబద్దలు కొట్టారు. భారతదేశంలో ఉన్నంతసహనంప్రపంచంలో ఇంకెక్కడా లేదనివ్యూ`రిసెర్చిస్పష్టంగా పేర్కొంది. ఐతే  యీ విషయాన్ని మన ఘనత వహించిన మీడియా పట్టించుకోలేదు. కొన్ని దినపత్రికలు మాత్రం క్రొద్ది సమాచారం ప్రచురించాయి. స్త్రీ- పురుషులకు ఉండే అధికారాల ప్రశ్న వచ్చినపుడు కూడా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి వివక్షతలూ ఉండరాదనీ, వారికి సామాజిక అధికారాలు సమానంగా ఉండాలని భారత్లో 71శాతం పేర్కొనగా, ప్రపంచ వ్యాప్తంగా 65% శాతానికన్నా తక్కువ మాత్రమే స్త్రీ అభ్యున్నతికి ఓటు వేశారు. వాస్తవాలు ఇలా ఉండగా భారతదేశం గురించి నీచంగా కొంతమంది సెక్యులర్ వీరులు కూతలు కూయడం వింతగా ఉన్నది.

ఆకాశంపై ఉమ్మేసిన ఘనుడుతీరికూర్చొని కందిరీగ తుట్టెను కెలికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు ఒకడు మన యువరాజు పని అట్లా ఉంది. ప్రజాభిమానం చూరగొని, ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్న నరేంద్రమోడీని ఎదోవిధంగా ఇరకాటంలో పెట్టాలనుకున్న కాంగీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో మౌంట్కార్మెట్ మహిళా కళాశాల విద్యార్థునులతో ముఖాముఖీ కార్యక్రమం చేపట్టిన రాహుల్, ‘స్వచ్ఛభారత్, ‘మేక్ఇన్ఇండియాపథకాలను ఎండగట్టే ప్రయత్నం చేసి బోర్లాపడ్డాడు. మాటామంతీ యిలా సాగింది.
రాహుల్: స్వచ్ఛభారత్ ఆచరణలో ఉన్నదా?
విద్యార్థిను : ..ఔను బాగా ఔతున్నది.
లేదుఅనే సమాధానం కోసం ఎదురుచూసిన రాహుల్ ఖంగుతిని మళ్ళీ ఇలా అన్నాడు
మేక్ఇన్ ఇండియాపని చేస్తోందా?
విద్యార్థిను: ఔను... ఔను.. ఔను.. పనిచేస్తున్నది.
కళావిహీనమైన వదనంతో రాహుల్ కార్యక్రమాన్ని మద్యంతరంగా ముగించాడు. అందుకే అన్నారు చెరపకురా! చెడేవు