విశ్వమంతటా ఉన్న హిందువుల రక్షణకు ఆవిర్భవించినదే విశ్వహిందూ పరిషత్

వైవిధ్యము సృష్టి యొక్క ప్రత్యేకత. వైవిధ్యంలో ఉన్న ఏకత, ఏకాత్మతను ఆవిష్కరించిన వాళ్ళు మన మహర్షులు. వైవిధ్యము హిందూ సమాజం యొక్క స్వభావము.