హిందువులారా కళ్ళు తెరవండి

మనం ఏమంటామండీ? అన్ని మతాలు సమానమనా? పరమత సహనం కావాలనా? అందుకే దేవాలయాలు కూల్చినా, మనవారిని బవంతంగా  మతం  మార్చినా, మన కుమార్తెనులవ్్జిహాద్పేరుతో అపహరించినా మనం నోరు మూసుకుని ఊరుకుంటాము. ఒక మహమ్మదీయుడు మనకు ‘‘ భాయిజాన్, ఒక క్రైస్తవుడు ‘‘బ్రదర్’’. కానీ! మన సోదర హిందువు మాత్రం మనకు అస్పుస్యుడు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని  ఒక గ్రామంలో  ఒక దళితుడు తన వివాహం సందర్భంగా గుఱ్ఱం ఎక్కినందుకు గ్రామంలోని హిందువులంతా అతడిని రాళ్లతో కొట్టారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ప్రతాప్‌ఘడ్ మండలం, రెహువాలాల్ గంజ్ గ్రామానికి చెందిన ఇద్దరు దళిత యువకులు ప్రతిష్ఠాకరమైన ఐఐటి పరీక్ష వ్రాసి ఉన్నత చదువుకు ఎంపిక అయ్యారు. ఐతే గ్రామంలోని కొందరు గ్రామస్థులు ఇది సహించలేక యువకుల ఇంటిపై రాళ్ళు రువ్వారు. అన్నదమ్ములో ఒకడైన రాజూసరోజ్ ఎంతో బాధపడుతూ ‘‘అయ్యా దళితులం చదువుకోరాదా? అదేమైనా నేరమా? అని ప్రశ్నించాడు. ఇద్దరు అన్నదమ్ములూ ఐఐటిలో సాధించిన విజయానికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ సన్మానం కూడా చేశాడు. హిందువులారా ఇకనైనా మేలుకొనండి. ప్రతి హిందువు మన బంధువు అనే ఇంగితం కలిగి ఉండండి.

ఎట్టకేలకు స్పందించిన దేశాలు

ఇస్లామిక్ తీవ్రవాదానికి బలికాని దేశం లేదు అంటే  అతిశయోక్తి  కాజాలదు. ఒక్కొక్కటిగా ప్రపంచదేశాల తీవ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు ప్రారంభిస్తున్నాయి. రంజాన్ మాసంలో ఎవ్వరూ ఉపవాసం చేయరాదు` బహిరంగంగా నమాజు చేయరాదు అని హోటళ్ళు తెరిచే  ఉంచాలి ` నమాజుకు రమ్మని పిలిచే ‘‘అజాన్  చదవరాదు అని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఒక మసీదు నిర్మించుకోవటానికి ముస్లింలు అనుమతి కోరగా ` తిరస్కరించింది క్యూబా దేశం. ముస్లింలకు పౌరసత్వం ఇవ్వరాదని జపాన్ నిర్ణయించింది. అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం షరియా చట్టాన్ని నిషేధించింది. ఇదే బాటలో అంగోలా, నార్వే, పోలాండ్ మరియు ఆస్ట్రేలియాలు పయనిస్తున్నాయి. ఎట్టకేలకు ఇస్లాం ఒక సమస్య అనే ఆలోచన  పాశ్చాత్య దేశాలలో ప్రభుత్వాలు  ఇప్పుడు గ్రహిస్తున్నాయి.

కాంగీకి దేహ శుద్ధి

 
ఒక వ్యక్తిని చావగొట్టి చెవులు మూయడం మనమెఱిగిందే! దొంగకు దేహశుద్ధి చేయడం కూడా మనం విని ఉన్నాం. కాని ఇప్పుడు జరిగింది. ఒక పార్టీకి దేహశుద్ధి`వివరాల్లోకి వెడితే ఒరిస్సా రాష్ట్రంలో కాంగీపార్టీవారు రాష్ట్రబందుకు పిలుపు యిచ్చారు. ఎప్పటిలాగే విధ్వంసానికి దిగారు. కాని కాంగీ చర్యు ప్రజలకి నచ్చినట్లు లేదు, కాంగ్రెస్ కార్యకర్తలను కనపడినవారిని కనపడినట్లు చితకబాదారు. కాంగీపార్టీకి చెందిన ద్విచక్ర  వాహనాలను తగులబెట్టారు.  పరిణామాలకు నిర్ఘాంతపోయిన కాంగీ వీరులు తెల్లముఖం వేసుకుని కాళ్ళ బేరానికి దిగారు. తమ కార్యకర్తల చర్యకు క్షమించాలనిపిసీసీ అధ్యక్షులు ప్రసాదహరి చందన్ ఒరిస్సా ప్రజలను కోరాడు.

సద్గురు శివానందమూర్తి గారు శివైక్యం చెందారుభారతీయ పరంపరలోని (1) బ్రహ్మచర్యా శ్రమము (2) గృహస్థాశ్రమము   (3) వానప్రస్థా శ్రమము (4) సన్యాసాశ్రమము నాలుగు ఆశ్రమాలలో జీవనం  సాగించి చరితార్థులైన సద్గురు శివానందమూర్తిగారు జూన్ 9 రాత్రి శివైక్యం చెందారనే వార్త సనాతనధర్మ భక్తులందరిని శోక సముద్రంలో ముంచింది. భారతదేశంలో ఋషి పరంపర గురించి మనం చదువుకొన్నాము. ఋషి పరంపరకు ప్రతీకగా  సద్గురు శివానందమూర్తిగారు మన కళ్ళముందు జీవించారు.
సద్గురు శివానందమూర్తిగారు దైవభక్తి, దేశభక్తితో సమ్మిళితమైనవారు. రెండు వేర్వేరుగా వారు ఎప్పుడు చూడలేదు. దేశ క్షేమము కోసము మన శాస్త్రాతలో చెప్పిన యజ్ఞ యాగాదును క్రమ పద్ధతిలో శాస్త్రోక్తంగా నిర్వహించినవారు సద్గురు శివానందమూర్తి గారు. దేశంలో జన్మించిన అనేకమంది   మహా పురుషులు దేశ పరిస్థితులపై అవగాహన కొరకు దేశమంతాచుట్టి వచ్చారు, అదే ప్రేరణ వారి జీవితాలను మార్చి వేసిందని. చరిత్రలో మనం చదువుకొన్నాము. ఆది శంకరాచార్య, స్వామి వివేకానంద దేశమంతా తిరిగి దేశ ప్రజలను జాగృతం చేయటం, దేశ, ధర్మ సంస్కృతులను కాపాడుకోవటం మనందరి కర్తవ్యమని ప్రజలకు బోధించి సనాతన ధర్మం వైపు నడిపించారు. అటువంటి పరంపరకు చెందినవారు శివానంద మూర్తిగారు.
సద్గురు శివానందమూర్తిగారు 1928 సం డిశంబరు 20 తేదీ రాజమండ్రిలో జన్మించారు. విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత పోలీసు శాఖలో ఆఫీస్ అసిస్టెంట్‌గా చిన్న ఉద్యోగంలో చేరి డి.జి.పి.కి కార్యదర్శిగా ఉన్నత పదవిలో పని చేసారు. 1951 సం లో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తలు. పదవీవిరమణకు నాలుగు సంకు ముందుగా అంటే 1982 సం స్వచ్ఛంద పదవీ విరమణచేసి ఆధ్యాత్మిక సాధన చేసేందుకు విశాఖపట్టణానికి 36 కి.మీ. దూరంలో ఉన్న భీమిలి గ్రామం చేరారు. భీమిలి కేంద్రంగా వారి ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమైంది. 1982 సం నుండి కుటుంబ బంధనా నుండి క్రమంగా బయటపడి వానప్రస్థ జీవనం గడిపారు. కొద్ది సంకు శైవ పీఠానికి అధిపతులుగా బాధ్యతలు కూడా స్వీకరించారు. సికింద్రాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ శంకరాచార్యపీఠానికి అధిపతిగా ప్రభుత్వం నియమించింది. శ్రీ శివానందమూర్తి అనేక పత్రికలో వ్యాసాలు వ్రాశారు. సుపథ అనే ద్వైమాసిక పత్రికను తన ప్రణాళికకు అనుగుణంగా నడిపించుతూ వచ్చారు.  ఆంగ్లంలో, తెలుగులో అనేక గ్రంథాలు రచించారు. సమాజానికి అవసరమైన గ్రంథాల ప్రచురణకు ప్రోత్సహించారు, సహకరించారు.
దేశహితంకోసం 1991 మే 3 భీమిలిలో యజ్ఞం నిర్వహించారు. తదుపరి దేశంలో  ఉన్న అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు, ముఖ్యమైన శక్తి పీఠాలు దేశసరి హద్దులో, మారుమూల వనవాసీ క్షేత్రాలలో నాలుగువందలకు పైగా యజ్ఞ యాగాదు నిర్వహించారు.  కళ్యాణాశ్రమానికి కూడా అడదండలందించారు. దేశంలో పని చేస్తున్న హిందూ సంస్థలన్నింటితో సన్నిహిత సంబంధాలు ఉండేవి. సికింద్రాబాద్‌లో బైసన్‌పోలో  గ్రౌండ్లో  షుమారుగా  ఒక లక్షమందితో జరిగిన సంఘ కార్యక్రమంలో శ్రీశివానందమూర్తి అధ్యక్షులుగా పాల్గొన్నారు. నాటి సర్‌సంఘచాలకులు శ్రీ రజ్జూభయ్యా   సభలో ప్రధాన వక్త. విద్యార్థి దశలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంతో సంబంధం ఉన్నదని, పూ గురూజీని  కలిసినట్లుగా పూ శ్రీ గురూజీ జన్మశతాబ్ది ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు.  స్వాతంత్య్రం పొందిన తర్వాత మనదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో మన నాయకులెవరికీ సరైన కల్పన లేదని, కేవలం శ్రీ గురూజీకి మాత్రమే విషయంలో సమగ్రమైన కల్పన ఉన్నదని  తాను  గ్రహించానని    సభలో వివరించారు.     విధంగా   సద్గురు శివానందమూర్తి గారు దేశహితం కోసం ఆధ్యాత్మికజీవనం గడిపిన మహాత్ములు.
సందర్భంగా వారు పదే పదే చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకొందాము. మన హిందూ సమాజం సమైక్యమైతేనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. దాని కోసం మనము కృషి చేయాలి. దిశలో దేశంలోని అన్ని సాంప్రదాయాలకు చెందిన పెద్దలు,  పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ పరస్పర అవగాహనతో కలిసి పని చేయాలి. అదే సనాతన ధర్మ వ్యాప్తికి ఎంతో తోడ్పడుతుందని వారి ఆకాంక్ష.  ఆకాంక్ష సాధనకు కృషి చేయటమే వారికి మనం సమర్పించగలిగిన నిజమైన నివాళి.