హిందుత్వాన్ని దోషిగా నిబెట్టడమే వాళ్ళ లక్ష్యామా?మధ్య కాలంలో దేశంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా దేశంలోని సెక్యులర్ వాదులు, వామపక్ష మేధావులు అలజడి చేయడం ప్రారంభించారు. దేశంలో మైనార్టీలు, దళితులకు రక్షకులం మేమే అని వాళ్ళకు వాళ్ళు అనుకొంటు హిందుత్వంపై, హిందూసమాజంపై దాడులు చేస్తున్నారు. పత్రికలో, ఛానళ్ళలో వాళ్ళు హిందుత్వ వాదులు దేశంలో భయానక పరిస్థితులు నిర్మాణం చేస్తున్నారని చర్చలు, వ్యాసాలు గుప్పిస్తున్నారు. హిందుత్వ శక్తులు వైవిధ్యాన్ని అంగీకరించకపో వటమే అసలు సమస్య అని దేశంలో, విదేశాలో ప్రచారం చేయటం వాళ్ళ లక్ష్యంగా కనబడుతున్నది. మధ్య సాక్షి దినపత్రికలో శేఖర్గుప్త (ప్రముఖ జర్నలిస్టు) వ్రాసిన వ్యాసంలో వైవిధ్యాన్ని అంగీకరించకపోటమే అసలుచిక్కుఅంటూ వ్యాసం వ్రాసారు.  ఢల్లీలో ఢల్లీ హైకోర్టు స్వర్ణోత్సవాలో మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూవిభిన్న సంస్కృతుల సమూహరమైన భారత్ గడిచిన కొన్ని శతాబ్దాలుగా సహనంతో ఐకమత్యంతో ఉన్నది దానిని మనం కాపాడుకోవాలని చెప్పారు. ఆర్.బి. గవర్నర్ రంగరాజన్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వాళ్ళ మాటల సారంశము దేశంలో మైనార్టీలో అభద్రత భావం చోటుచేసుకొంటున్నదని ఆందోళన చెందుతున్నారు. వాళ్ళలో భద్రతభావం కలిగించాలి అని అన్నారు. దేశంలో హిందుత్వము వైవిధ్యంలో ఏకాత్మకతను సాక్షాత్కరించుకొన్న దేశం.  దేశంలో ఎన్నో మతాలు, సాం ప్రదాయాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి మధ్య ఏదో రకమైన సయోధ్య సాధించ బడుతున్నది కాబట్టి దేశం ప్రశాతంగా ఉంది. విషయాన్ని మాట్లాడిన పెద్దలకు తెలియదు అని అనుకోలేము. దేశంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు దాడి ప్రధానంగా హిందుత్వంపైన కేంద్ర ప్రభుత్వంపైన ఉన్నట్లుగా కనబడుతున్నది. దానికి అంతర్జాతీయంగా కూడా మద్దతు లభిస్తున్నదా అనిపిస్తున్నది. భారత్లో మత వైషమ్యాలు, మానవ హక్కు ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటువంటి దేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఉండరాదనే కుట్ర జరుగుతున్నదా? రెండోప్రక్క కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా దేశం ముందు, ప్రపంచం ముందు నిలబెట్టాలని చూస్తున్నట్లుగా కనబడుతున్నది. విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఎత్తుగడను హిందూసమాజం తిప్పికొట్టాలి. దేశ సమైక్యతను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి.

హిందూత్వం సనాతన ధర్మం - హితవచనంహిందూ మతమంటే ఏమిటో పాశ్చాత్యులకు, పాశ్చాత్య విద్యా ప్రభావం ఉన్న ఈనాటి మేధావులకు అర్థం కాని కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి 1949 సంలో అరవింద మహర్షి విశ్లేషించారు. వారు చెప్పిన విషయాలను గమనిద్దాం.
అందరూ నమ్మవలసిన సిద్ధాంతంగా గాని, అట్లా నమ్మకపోతే అధోగతి తప్పదన్న భావంగాని, ఇతర మతాలనుండి భిన్నమైన నియమిత విశ్వాసాలుగాని లేనిది మతమెట్లా అవుతుంది? ఒక మతాధిపతిగాని, మతాన్ని అమలు జరిపే ధార్మిక యంత్రాంగంగాని, దేవాలయాలుగాని, సామూహిక ప్రార్థనలుగాని, అందరు ఆచరించవలసిన నిబంధనలుగా లేనిది మతమెట్లా అవుతుంది? హిందూ పూజారులు కేవలం క్రతువును నిర్వహించేవారేగాని వారికేవిధమైన అధికారాలు లేవు. పండితులు శాస్త్రానికి అర్థం చెప్పగలిగే వారేకాని మతానికి సంబంధించిన శాసకులుగా గాని, అధినేతలుగా గాని కానేకారు. అన్ని విశ్వాసాలనూ చివరకు నిరీశ్వరవాదాన్ని, అనాత్మవా దాన్ని కూడా అనుమతించి విభిన్నమైన ఆధ్యాత్మికానుభూతులను ఆమోదించి వివిధ ధార్మికప్రయోగాలను వహించే హిందూ ధర్మాన్ని మతమెట్లా అనగలం. హిందుత్వం సనాతన ధర్మం.
అరవింద మహర్షి

అడవి మనిషి చేసిన అద్భుతం

వైపు దేశం మొత్తం అభివృద్ధి, పారిశ్రామికరణ పేరిట అడవులన్నీ నరికి పర్యవరణ సమతుల్యతని పాడుచేసి, జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే కరువు కాటకాలకు, ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతు సామాజిక స్పృహ లేకుండా ఉన్న సమాజంలో... ఛత్తీస్గఢ్కు చెందిన పెద్దాయన 600 ఎకరాల్లో చెట్లు పెంచి అడవినే సృష్టించాడు. గ్రామస్తులు జీవనోపాధి మెరుగుపర్చేందుకు, వన్యప్రాణులను కాపాడేందుకు 67ఏళ్ల దామోదర్ కాశ్యప్ 600 ఎకరాల్లో విస్తారంగా చెట్లు నాటారు. బస్తర్ జిల్లా సంధ్ కార్మారీ గ్రామానికి చెందిన అడవి మనిషిని సీపీఎస్ అవార్డు వరించింది. అడవికి మాత్రం తీసిపోని ప్రాంతానికి బారేకోట్ అటవీ ప్రాంతంగా నామకరణం చేశారు. కోతులు, జింకలు, ఎలుగుబంట్లు వంటి జంతువుకు ఇది ఆవాసంగా మారింది. 60వేలకు పైగా ఫలవృక్షాలు, వైద్య సంబంధిత చెట్లు, మొక్కలను సహజ వాతావరణంలో సేంద్రియ పద్ధతిలో పెంచారు.  
ఇంత చేసి కూడాఇదేం అద్భుతం కాదు` నేను చెట్లని ప్రేమిస్తాను.. వాటితో మాట్లాడతాను అంతేఅంటాడీ పెద్ద మనిషి. దామోదర్ ముప్పై ఏళ్ల క్రితం తొలుత 100 ఎకరాల్లో కొద్ది కొద్దిగా మొక్కలు నాటడం మొదలుపెట్టారు.ఆయన సంకల్పాన్ని చూసి గ్రామస్తులు చెట్లు పెంచేందుకు మరొ 500 ఎకరాలు విరాళంగా ఇచ్చారు. గ్రామస్తులు ఎవరైనా స్వతంత్రంగా అడవిలోని సదుపాయాలన్నీ ఉపయోగించుకోవచ్చునని, అయితే చెట్లు నరికేందుకు ప్రయత్నిస్తే మాత్రం రూ. 500 వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. చెట్లు పెంపకంలో దామోదర్ పనితీరు అద్భుతమని పర్యావరణ పరిరక్షణ సంస్థ సీపీఎస్ చైర్పర్సన్ ఎమ్. గుప్త ప్రశంసించారు.