హిందూధర్మంలోకి తిరిగివచ్చేవారికి ఆత్మీయ స్వాగతం

మతంమారిన హిందువులు తిరిగి తమ మాతృధర్మంలోకి రావాలనుకున్నట్లయితే వారికి హిందువులు ఆత్మీయ స్వాగతం పలకాలని, అటువంటి వారికి పూర్థి భద్రత కల్పించాల్సిన

సంక్రాంతి - రథసప్తమి

మకరరాశిలో ప్రవేశించిన సూర్యుడు సంక్రాంతి మొదలు ఉత్తరాయణంలో ప్రయాణిస్తూ ఏడు గుర్రాల రథాన్నెక్కి ఈశాన్యదిశగా వెళ్తుంటాడు. సంక్రాంతి తరువాత వచ్చే మాఘమాసంలో

హిందూ సంస్కృతే నన్ను గెలిపించింది

హిందూసంస్కృతి నుండి స్ఫూర్తిపొందిన కొందరు విదేశాలలో అందలం ఎక్కుతున్నారు. విజయవాడలో పుట్టిపెరిగిన దావులూరి నీనా అనే బాలిక ఇప్పుడు అమెరికాలో ఉంటూ

రాజ్యాంగ సమీక్ష చేయాలి

స్వతంత్రభారతదేశం తనదైన రాజ్యాంగాన్ని అమలుపరచుకొని వచ్చే జనవరి 26వ తేదీకి 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని 66వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఈ 65 సంవత్సరాలలో దేశం అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 

హిందుత్వం అందరికీ చెందిన ఒక సమగ్ర జీవనవిధానం

మతమార్పిడుల గురించి అర్థం కావాలంటే చరిత్రలోకి వెళ్ళి చూడవలసిందే. క్రీ.శ. 11వ శతాబ్దంలో మహమ్మదీయులు భారతదేశంలో ప్రవేశించింది మొదలు క్రీ.శ. 1750 ఈస్ట్ ఇండియా

మాకైతే బాగుంది ! మీ సంగతి...!

మోదీ ప్రధానమంత్రి అయి ఇంకా ఏడునెలలు కూడా పూర్తికాకుండానే కొందరు స్వార్థరాజకీయ నాయకులు "మోదీ ఏం చేశాడు, ఏదేదో చేస్తానన్నాడుగా! 

శతాబ్దాలుగా సాగుతున్న మతమార్పిడులకు అడ్డుకట్ట వేయాలి

ఈ దేశంలో వందల సంవత్సరాల నుండి మతంమార్పిడులు బలవంతంగా ప్రలోభాలతో కొనసాగిస్తున్నది ముస్లింలు, క్రైస్తవులు. ఇస్లాం, క్రైస్తవాలు కేవలం భారత్ లోనే కాదు

ఆధ్యాత్మికతను అంటిపెట్టుకొనడమే కర్తవ్యం

మనం ఆధ్యాత్మికతను అనుసరించకుండా హిందూదేశ పునరు జ్జీవనం అసంభవం. అంతమాత్రమే కాదు, యావత్ప్రపంపచపు శ్రేయస్సు కూడా మనపైనే ఆధారపడియుంది. 

మేం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తున్నాం

ఆఫ్ఘన్ లో సోవియట్లకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి మేం చేసిన యుద్ధంలో మేం (పాకిస్తానీలు) మతాన్ని ఎగదోశాం. దానికిప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం.

ముందు తల్లి గొప్పదనాన్ని గురించి తెలుసుకో...

తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును
మన్ను నెరుగువాడు మిన్ను నెరుగు


భగవద్గీతను జాతీయ గ్రంథమనడం తప్పా?

యావత్ ప్రపపంచంలోనూ శిరోధార్యంగా గౌరవించ బడుతూ ఉన్న గీతను వీరు వ్యతిరేకించడం ప్రారంభించారు. ఇది మరీ విడ్డూరం. దాదాపు 20 దేశాలకు చెందిన విదేశీ ప్రముఖులు పాల్గొన్న

మాతృభాష కారాదు మృతభాష

"Language is a medium of Communication" అన్నది ఒక ఆంగ్లపదబంధం. కాని ఆశ్చర్యంగా ఈ పదబంధాన్ని ఎక్కువ ఉపయోగించేది మాత్రం తెలుగువారు.

విద్య కాషాయీకరణా..! అంటే ఏమిటి..?

విద్యను కాషాయీకరణం చేస్తున్నారు, చదువులో మతతత్వాన్ని నింపుతున్నారు అంటూ నానా యాగీ చేస్తున్నారు. ఇంతకూ 'కాషాయీకరణ' అంటే  ఏమిటి? 

ఎందరికో స్పూర్తి - కీర్తి

అనాగరిక సమాజం నుంచి నాగరికతపైకి విస్తరిస్తున్నాం. అయినా సరే దేశంలో ఎక్కడో ఒక చోట మహిళలపై దురాచారాలు, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళను శక్తిగా కొలిచిన మనదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. కొన్ని రాష్ట్రాలో ఇప్పటికీ బాల్యవివాహం అనే రాక్షసి రాజ్యమేలుతోంది. రాజస్థాన్ రాష్ట్రం ప్రకృతికీ వీర గాధకు పెట్టింది పేరు. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అక్కడే చైల్డ్ మ్యారేజెస్ సంఖ్య ఎక్కువ. పసిపిల్లలకు పెళ్లిళ్లు చేసే సంప్రదాయానికి వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు, సెక్షన్లు ఉన్నా  అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. బాల్యవివాహం అరికట్టాలనే ఆలోచన 28 ఏళ్ల కీర్తి భారతికి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలని అనుకుంది. తనకు తెలుసు ఇలాంటి కార్యక్రమాలను చేస్తే ముందుగా ఎన్ని ఒత్తిళ్లు అవాంతరాలు వస్తాయో. వాటన్నింటికీ భయపడకూడదనుకుంది. అనుకున్నట్లుగానే చాలా మంది చంపేస్తామంటూ బెదిరించారు. అయినా సరే వాటన్నింటినీ ఎదుర్కొంది వారిని కోర్టుకీడ్చింది. ఆమె చేసిన కృషి  వల్ల అక్కడ బాల్యవివాహలను అడ్డుకోవడంతో పాటు బాలికకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకూ 29 బాల్యవివాహలను అడ్డుకుని, 850 మందికి పైగా బాలికలకు పునరావాసం కల్పించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది కీర్తి.

తను కూడా బాదితురాలే..
కీర్తి భారతి కూడా చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాలను అనుభవించింది. ఆమె తండ్రి డాక్టర్. కానీ కీర్తి కడుపులో ఉండగానే అమ్మానాన్న విడిపోయారు. దాంతో కీర్తిని కడుపులోనే చంపేయాలని ఆమె తల్లి తరుపు బంధువులు బలవంతం చేశారు. ఆమె తల్లి వినలేదు. కీర్తి పుట్టిన తర్వాత కూడా ఆమెను చంపాలని విష ప్రయోగం చేశారు. దీంతో కొన్నిరోజులు ఆమె చదువుకు దూరం అయింది. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కున్న కీర్తి వీటన్నింటికీ కారణం అమ్మాయిు చదువుకు దూరం కావడం, వారికి తగిన సంక్షేమం దొరకక పోవడమే అని గ్రహించింది. అందుకోసం రాజస్థాన్లో బాల్యవివాహలకు వ్యతిరేకంగా పోరాడి ఆరువేల మంది ప్లికు, 5,500 మంది మహిళకు పునరావాసం కల్పిస్తోంది.

సాయం కోసం సారథి ట్రస్ట్..
అరాచకాలకు ఫుల్ స్టాప్ పడాలనే కీర్తి 2011లో సారథి అనే ట్రస్టు ప్రారంభించింది. సంస్థ ఏకైక లక్ష్యం మహిళలకు సామాజిక న్యాయం జరిగేలా చూడటమే. బాల్యవివాహలను అడ్డుకునేందుకు చేసే ప్రయత్నంలో చాలాసార్లు తన ప్రాణాలను పణంగా పెట్టారు. సంస్థ బాధ్యత కేవలం బాల్యవివాహలను అడ్డుకోవడమే కాదు, తర్వాత వారికి మరింత మెరుగైన జీవితాన్ని ప్రసాదించడం కూడా . ట్రస్ట్ ద్వారా  బాలికకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నది. తర్వాత వారిలో ధైర్యం నింపేందుకు రిహాబిలిటేషన్ వంటివి కూడా చేపడుతున్నది. సారథి ట్రస్ట్ ఇప్పటివరకు 29 బాల్యవివాహలను రద్దు చేయించింది.  ఆమె సూర్తిదాయకమైన కథని సీబీఎస్ విద్యా ప్రణాళికలోనూ చేర్చారు. ఇంత సాధించినా కీర్తి పొంగిపోలేదు. ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని- తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని అంటారు.అవును నిజంగానే మహిళ తలుచుకుంటే తనతో పాటు తమ కుటుంబాన్ని సమాజాన్ని కూడా మార్చగలదు. అందుకోసం కొంచం ధైర్యం, శక్తి, యుక్తులు సంపాదించుకుంటే చాలు.