శాంతి సందేశం పంపితే శవం ఫొటో జవాబుఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థతో శాంతి చర్చలు జరిపేందుకు నేను సందేశం పంపిస్తే.. వారు నరికివేసిన వ్యక్తి త ఫొటోను నాకు జవాబుగా పంపారు. దీంతో నా ప్రయత్నాన్ని మానుకున్నాను. దీన్నిబట్టి వారు ఎటువంటి శాంతి చర్చనూ కోరుకోవడం లేదని అర్థమవుతున్నందున ఈ సమస్యను సైనిక చర్య ద్వారానే పరిష్కరించాని భావిస్తున్నాను.
- శ్రీశ్రీ రవిశంకర్‌

భిన్నత్వం వైషమ్యాలకు కారణం కాకూడదు.భిన్నత్వం వైషమ్యాకు కారణం కాకూడదు. మనదేశంలో ఉన్న హిందువు, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు అత్యంత అల్పసంఖ్యాక వర్గంగా ఉన్న పార్శీలు, ఆస్తికులు, నాస్తికులు అందరూ భారతదేశంలో అంతర్భాగమే. సామాజిక ఘర్షణను మనం నిరోధించాలి.
- నరేంద్రమోడీ, ప్రధానమంత్రి

మరో కృష్ణభగవానుడు ఆదిశంకరాచార్య

 
భారతీయ జాతీయ జీవనంలో కృష్ణపర మాత్మ తరువాత జగద్గురు శంకరాచార్యు అవతారమే దేశంలోని మౌలికమయిన ఏకత్వానికి వ్యావహారికి రూపం చేకూర్చింది. కృష్ణభగవానుడు భిన్న భిన్నమయిన విచార శాఖల్లో భగవద్గీత ద్వారా ఏకత్వం స్థాపించడానికి ప్రయత్నించాడు. చాతురంతమయిన ధర్మరాజ్య సామ్రాజ్యం ద్వారా జాతీయతను స్థాపించాడు. శంకరాచార్యులు భారతీయైక్యత కోసం ధర్మరాజు వంటి రాజకీయ పురుషుణ్ణి తయారుచేయలేదు. కాని జాతీయ జీవనంలో ప్రతి ఒక్క క్షేత్రంలోను ఏకత్వం స్థాపించాడు. ఆ ఏకత్వంలో పారంపర్యంగా సంస్కారం నిలుపుతూ వచ్చే వాళ్ళని సృష్టించాడు. దాంతో సాంస్కృతిక జీవనంలోకి ఏకత్వానికి శక్తి భించింది. అందుచేత ఆరోజుదాకా భిన్నమయిన్నీ అంతరంగికంగా ఉన్న భారతీయైక్యభావం సత్యం కింద పరిణమించింది. అనేకత్వంలో ఏకతవ్వమన్న ప్రాచీన సిద్ధాంతానికి శంకరాచార్యులే ఆత్మిక, భౌతిక, నైతిక, ధార్మిక, సాంఘిక, రాజనైతిక క్షేత్రాల్లో తన అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించి వ్యవహారంలోకి తీసుకువచ్చాడు. ఈ సిద్ధాంతమే మానవజాతికి శాంతి, కల్యాణాలు ప్రసాదించడానికి కారణమయింది.

లోకోహం క్షోభరహితంనరకండి, చంపండి, పగుకొట్టండి, కూల్చివేయండి అంటోందొక మతం` సేవ ముసుగులో మభ్యపెట్టి మతం మార్చండి` అంటున్నదింకొక మతం. కానీ హిందువులు ఏమంటున్నారో వినండి, అందరూ సుఖంగా ఉండాలి, ఎవ్వరికీ బాధ కగకూడదు. అనడమే కాదు ఆచరణలో చూపిస్తున్నారు.
మహరాష్ట్రలో కరువు నెకొంది. సాటి మనిషికి తిండిపెట్టి ఆదరించటం సరే! వారు ఇంకొక అడుగు ముందుకువేసి ఏ ఆధారం లేని పశువును ఆదుకుంటున్నారు. కర్షకులు తమ పశువుకు మేత, నీరు పెట్టలేని స్థితిలో ఉన్న కారణంగా ఆ పశువును ప్రత్యేకంగా నిర్మించిన పశుశాలకు తరలించి వాటికి ఉచితంగా ఆహారం నీరు అందిస్తున్నది మహరాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి శిబిరాల్లో ఐదుక్షబది వే (5,40,000) పశువులు సేదతీరుతున్నాయి. ఈ శిబిరాను నిర్వహించటానికి దినానికి రెండుకోట్ల ఏడు క్ష (రూ.2,07,00,000) వ్యయమవుతున్నది. మానవత్వం అంటే ఇదే.

ఔనా?.. నిజమేనా??చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాలిఫోర్నియా (అమెరికా) విశ్వవిద్యాయం శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి, పరిశోధన చేసి, అధ్యయనం చేసి నిద్రాహారాలు మాని ఏకదీక్షతో కష్టపడి ఒక క్రొత్తవిషయం కనుక్కున్నారు. అదేమిటో తెలుసా? ఆవుపాలు తల్లిపాతో సమానమట. ఆవుపాలు త్రాగిన పిల్లలో రోగనిరోధక శక్తి పెరుగుతుందట, ఆవుపాల్లో పోషకాలు బాగా ఉన్నాయట. శరీరానికి మంచిచేసే బాక్టీరియాను కూడా ఆవుపాలు రక్షిస్తాయట.
అయ్యా! ఇందులో క్రొత్త ఏముంది? వే సంవత్సరా క్రితమే హిందువులు తెలుసుకున్న విషయమే కదా! గోవును గోమాత అని ఉత్తినే అన్నారా? ఐతే ఒక్క విషయం తెల్లవాడు ఆంగ్లంలో చెపితే తప్ప మనవారు వినరు కదా! అదే మన బహీనత.