తీరుమారని కమ్యూనిస్టులు
మే 19వ తేది నాడు  వెలువడిన ఐదు రాష్ట్రా ఎన్నిక ఫలితాలు ఈ దేశం యొక్క రాజకీయ ముఖచిత్రాన్ని వెల్లడించింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ తమ ప్రాబల్యాన్ని ఎట్లా కోల్పోతున్నదో మొదటగా పేర్కొనదగిన విషయం. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అనేది అసాధ్యమేమి కాదు అని ఈ ఎన్నిక ఫలితాలు మరోసారి నిరూపించాయి. ఈ ఎన్నిక ఫలితాను గమనించినట్లైతే తమిళనాడు రాష్ట్రంలో జాతీయ పార్టీలు తమ ప్రాభవాన్ని ఇప్పటికి నిబెట్టుకోలేకపోతున్నాయి. గడిచిన దశాబ్దా కాలంగా తమిళనాడులో ద్రవిడ పార్టీ ప్రాబల్యం పెరిగి జాతీయ పార్టీలు నామమాత్రంగా మిగిలిపోయాయి. జాతీయ దృష్టికోణంలో ఇది ఆలోచించవసిన విషయం. బెంగాల్‌లో కూడా కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన మమతా బెనర్జీ రెండవసారి అధికారంలోకి వచ్చింది. కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. అనూహ్యంగా అస్సాంలో బీజెపి అధికారంలోకి వచ్చింది. బెంగాల్‌లో, కేరళలో కమ్యూనిస్టులు తమ ప్రాబల్యాన్ని నిబెట్టుకునేందుకు చాలా  ప్రయత్నం చేశారు. కాని బెంగాల్‌లో సాధించలేకపోయారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారు.
తమ ప్రత్యర్థుపై భౌతిక దాడులు చేయటం అనేది కమ్యూనిస్టు పార్టీ స్వభావం. మారుతున్న కామాన పరిస్థితుల్లో కూడా కాదోషం పట్టిన ఇటువంటి భౌతిక దాడును కమ్యూనిస్టులు వదుకోలేకపోతున్నారు. దీనికి తాజా ఉదాహరణ కేరళలో బీజెపి తన ప్రాభల్యాన్ని పెంచుకుంటూ అనేక చోట్ల రెండో స్థానంలో నిడింది. దీనిని తట్టుకోలేక కేరళలో బీజెపి కార్యకర్తపైన ఎన్నిక ఫలితాలు వచ్చిన కొద్ది సమయంలోనే దాడులు చేసి భీభత్సం సృష్టించింది. ఇటువంటి హింసా ధోరణి కలిగిన పార్టీకు ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దేశంలో తమ ప్రాబల్యాన్ని కోల్పోతూ కూడా ఇటువంటి విధ్వంసకర దాడులు చేయటం ఏమి సూచిస్తుంది? దాడుకు దాడులే సమాధానంగా ఎదుటివారు కూడా అటువంటి విధానాన్నే అనుసరిస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయో కమ్యూనిస్టులు గ్రహించాల్సిన అవసరం ఉంది. తమ శక్తి సామర్థ్యా తో ఎవరైనా గెలుపొందొచ్చు. హింసా రాజకీయాతో రాజకీయం చేయటం అనే విధానాన్ని కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికైనా వదులుకుంటే వాళ్ళకు, దేశానికి మంచిది. లేకున్నట్లయితే సమీప భవిష్యత్తులో కాగర్భంలో కలిసిపోవాల్సిన పరిస్థితులు తమంతట తాము నిర్మాణం చేసుకున్న వాళ్లుగా చరిత్రలో  వాళ్ళు మిగిలిపోతారు. ఈ ఎన్నిక సందర్భంగా పత్రికను ఒక విషయంలో మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.  అస్సాం మినహాయించి మిగతా చోట్లా ఎక్కడా కూడా తగినన్ని సీట్లు పొందలేకపోయినా బీజెపిని విమర్శించకుండా ఆయా రాష్ట్రాలో బీజెపి ఓటు శాతం ఎట్లా పెరిగిందో వివరించడం ఈ సారి మనం గమనించవచ్చు.

నారదుడు ఏది చేసిన లోకకల్యాణం కోసమే...
మే 28వ తేది నాడు సమాచార భారతి నారద జయంతిని పాత్రికేయ దినోత్సవంగా నిర్వహించింది. నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ హైస్కూల్‌లో నిర్వహించబడిన ఈ నాదర జయంతి కార్యక్రమానికి శ్రీ మండలి బుద్ధదేవ్‌ప్రసాద్‌ (ఏపి అసెంబ్లీ ఉపసభాపతి) ముఖ్య అతిథిగా, శ్రీ కిస్మత్‌ కుమార్‌గారు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. శ్రీ నర్సింహమూర్తిగారు (సమాచార భారతి ఉపాధ్యక్షులు) ఈ సభకు అధ్యక్షత వహించారు. సభ ప్రారంభంలో అంబేద్కర్‌-జాతీయ దృక్పథం అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. చర్చా కార్యక్రమాన్ని శ్రీ మురళీగారు (ఎక్స్‌ప్రెస్‌ టీవీ) ప్రారంభించగా, శ్రీ విజయసారథిగారు (జాగృతి మాజీ సంపాదకులు) ముగింపు వాక్యాలు పలికారు. నారద జయంతి సందర్భంగా నలుగురు పాత్రికేయును సన్మానించటం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమాన్ని శ్రీ క్రాంతిదేవ్‌ మిత్ర (టివి9) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందన సమర్పణ శ్రీమతి దేవిక (ఏబిఎన్‌) చేశారు. ఈ కార్యక్రమంలో 130 మంది జర్నలిస్టులు మరియు 30 మంది ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలు..
ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ ద్వితియ నాడు నారద జయంతి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంటుంది. గడిచిన దశాబ్దానికిపైగా భాగ్యనగర్‌లో సమాచార భారతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పత్రికా రంగానికి సంబంధించిన కొద్ది మంది జర్నలిస్టును సన్మానించటం కూడా చేస్తున్నది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి శ్రీ మండలి బుద్ధదేవ్‌ప్రసాద్‌ (ఏపి అసెంబ్లీ ఉపసభాపతి) ముఖ్య అతిథిగా మాట్లాడుతూ నారదుడు ప్రపంచ పాత్రికేయుకు ఆదర్శప్రాయుడని అన్నారు. నారదుడు అనగానే తగాదాలు సృస్టించేవాడన్న అభిప్రాయం కలుగుతుంటుంది. అయితే నారదుడు ఏది చేసిన లోక కల్యాణం కోసమే చేసారని ఎక్కడ చెడు ఉంటే దాన్ని రూపుమాపేందుకు కంకణం కట్టుకుని పనిచేసి లోకకల్యాణం కోసం కృషి చేశారు. నారదుడు నారద మహర్షి అని, విజ్ఞానఖని అని ప్రస్తుతించారు. నారదునికి అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉందని చెప్పారు. ఇప్పుడు అన్ని వ్యవస్థలు విలువ కోల్పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పత్రికా వ్యవస్థ విలువ కోల్పోరాదని అన్నారు. పత్రికా వ్యవస్థ విలువ కోల్పోతే సమాజానికి మంచి-చెడుపై విశ్లేషణ అందించేందుకు ఆస్కారం లేకుండా పోతుందని ఆయన తెలిపారు. శాసన, న్యాయవ్యవస్థను దారిలో పెట్టేది పత్రికా రంగమేనని అన్నారు. పాత్రికేయులు ఎక్కడా రాజీ పడకుండా సమాజానికి దిశానిర్దేశం చేయావల్సిందిగా ఆయన కోరారు. పాత్రికేయులు మానవాళి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పత్రికారంగం విలువ పెంచేందుకు కృషిచేయాని చెప్పారు. ఈ కార్యక్రమంలో నలుగురు పాత్రికేయును సన్మానించటం జరిగింది. 1) శ్రీ. కె.రాకాసుధాకర్‌, సాక్షి వెబ్‌ ఎడిటర్‌ 2) శ్రీమతి.సుప్రశాంతి దేవి (రేడియో న్యూస్‌ ఎడిటర్‌) 3) శ్రీ.ఎర్రం నర్సింగరావు (ఈనాడు రిపోర్టర్‌) 4) శ్రీ. సతీష్‌కుమార్‌ (సాక్షి ఛానెల్‌) ఈ నుగురిని బుద్ధదేవ్‌ప్రాసద్‌, కిస్మత్‌ కుమార్‌, తదితరులు సన్మానించారు. జాగృతి ప్రారంభంలో సంపాదకులుగా పనిచేసిన శ్రీ భండారు సదాశివరావుగారి పేరు మీద భండారు సదాశివరావు స్మారక పురస్కారం శ్రీ.కె.రాకా సుధాకర్‌గారికి, శ్రీమతి సుప్రశాంతి దేవి గారికి ఇవ్వటం జరిగింది. మరో జాగృతి సంపాదకులు శ్రీ వడ్లమూడి రాంమోహన్‌రావుగారి స్మారక పురస్కారం శ్రీ.నర్సింగరావుగారికి, శ్రీ సతీష్‌ కుమార్‌గారికి ఇవ్వటం జరిగింది. సన్మానంతరం సన్మాన గ్రహితలు తమ స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా రాకా సుధాకర్‌గారు మాట్లాడుతూ.. ఈ సన్మానం నాకు తల్లి తన కుమారుడుకి పెట్టిన ముద్దు లాంటిది. నేను చాలా అదృష్టవంతుడ్ని, ఎందుకంటే సైద్ధాంతిక సంఘర్షణలో కమ్యూనిజం అంతం అయిన తరువాత, మరియు 1992వ సంవత్సరంలో హిందుత్వ భావజాలం జాగృతమవుతున్న సమయంలో నేను పత్రికా రంగంలోకి ప్రవేశించాను. తర్వాత టెక్నాజీ మారిపోయిన సమయంలో నేను పనిచేసుకుంటూ పోతున్నాను. ఇదంతా కాలం వల్ల వచ్చిన మార్పు. అందరికీ ఆదర్శ జర్నలిస్టు కేశవ బలిరాం హెడ్గేవార్‌. కేశవ బలిరాం హెడ్గేవార్‌ హిందురాష్ట్రఅనే పత్రికను నడిపించారు. పత్రిక నడుపడంలో వారికి చాలా అనుభవం ఉంది. పత్రిక నడుపడంలో ఉండే సాధక బాధకాలు కూడా వారికి బాగా తెలుసు. అటువంటి కేశవ బలిరాం పంత్‌హెడ్గేవార్‌గారు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో నేను స్వయం సేవకునిగా చేరడం నాకు ఎంతో గర్వకారణం. నేను చేస్తున్న పనిలో నేను సక్రమంగా ముందుకు పోయేందుకు ఒక ప్రేరణగా ఈ సన్మానాన్ని నేను ఎ్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను అని వివరించారు. 
 శ్రీమతి సుప్రశాంతి దేవిగారు మాట్లాడుతూ పాత్రికేయురాలిగా తనకు డిఫెన్స్కు సంబంధించి పత్రిక నా జీవితాన్ని ఎంతో మలుపుతిప్పింది. ఆ తదుపరి రేడియో స్టేషన్లో చేరిన తరువాత అనేక స్ఫూర్తిదాయకమైన అనుభవాలు ఎన్నో నాకు కలిగాయి. భారత్‌ బయట దేశాలో ప్రధానమంత్రి పాల్గొన్న కార్యక్రమా రిపోర్టింగ్‌ కోసం వారితో పాటు  నేను ప్రయాణించి రిపోర్టింగ్‌ చేశాను.  విలును ప్రధానంగా ప్రసారం చేయటంలో నా వంతు కృషిని నేను ఎప్పుడూ చేస్తునే ఉంటాను అని చెప్పారు. శ్రీ నర్సింగ్‌రావుగారు మాట్లాడుతూ పాత్రికేయరంగంలో తన అనుభవాను వివరించారు. ఈనాటి పరిస్థితుల్లో మంచి పాత్రికేయుడిగా నిబడాలంటే కలంతో పాటు గళం కూడా ఉండాలి. సమాజంలో ఒక మార్పుకోసం మనం కూడా ఎంతో కృషిచేయ వచ్చు. నేను ఉండే ప్రాంతం కవాడిగూడ. దానికి సంబంధించిన ఒక ఉదాహరణను మీ ముందు ఉంచుతాను. కవాడిగూడలో ఒక ప్రభుత్వ పాఠశా ఉండేది. ఆ పాఠశా పరిసరాలో నిసించేవారిని ప్రభుత్వ పాఠశా ఎక్కడ ఉంది అని అడిగితే తెలియదు అనేవారు. స్కూలు గురించి మరీ మరీ అడిగితే అరే చెత్త కుండీ స్కూలా అని అనేవారు. స్కూలును చెత్తకుండి స్కూలుగా పివబడటం నాకెంతో బాధ కలిగించింది. ఆ చెత్త కుండిని అక్కడి నుండి తీసేసి ఆ స్కూలుకు ఆ పేరు లేకుండా చేయాని సంకల్పించుకొని ఆ ఏరియాకు సంబంధించిన పోలీస్‌ అధికారితో మాట్లాడి వారి సహకారంతో స్థానికులు, స్థానిక రాజకీయ నాయకు సహకారంతో కొన్ని రోజుపాటు కృషిచేసి ఆ చెత్తకుండిని అక్కడి నుంచి తొగించాం దానితో ఆస్కూలుకున్న చెత్త కుండి పేరు పోయింది. కాబట్టి పాత్రికేయుడికి కలంతో పాటు గళం ఉంటే సామాజిక అవసరాను కూడా తీర్చేందుకు పనిచేయవచ్చు. అట్లా చేస్తూ ఒక ఆదర్శ పాత్రికేయుడిగా మనం నిబడాలి. నేను అట్లా నిబడేందుకు ఈ సన్మానం నాకొక ప్రేరణగా నేను భావిస్తున్నాను అని చెప్పారు. శ్రీ సతీష్‌ కుమార్‌గారు మాట్లాడుతూ ఒక మంచి పాత్రికేయుడిగా నిబడేందుకు అనేక మందితో ఉండే సంబంధాలు ఉపయోగపడుతూ ఉంటాయి. నాకు ఈ సన్మానం ఒక మంచి పాత్రికేయుడిగా నిబడేందుకు ఒక ప్రేరణగా దీనిని నేను భావిస్తున్నాను. 

ఈ కార్యక్రమం చివర్లో వందన సమర్పణ శ్రీమతి దేవిక చేశారు. శ్రీ నీలేష్‌ పాడిన జాతీయగీతం జనగణమనతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గనవల్సిన స్వామిగౌడ్‌గారు ప్రత్యేక కారణల వల్ల కార్యక్రమానికి రాలేకపోయినారు.  ఈ కార్యక్రమం కోసం ఒక సందేశం పంపించారు.
సందేశం సంక్షిప్తంగా..
తెంగాణ శాసనమండలి (కౌన్సిల్‌) చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ నారద జయంతి కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు తన అసక్తతను వ్యక్తం చేస్తూ  ఈ సందర్భంగా పాత్రికేయుకు అభినందనలు తెలియజేస్తూ సందేశం పంపించారు. లోకకల్యాణం కోసం నారద మహర్షి చేసిన గొప్ప కార్యక్రమా గురించి తన సందేశంలో వివరించారు.
ఈ కార్యక్రమ కన్వీనర్‌ శ్రీరాంమోహన్‌, రాంపల్లి మల్లికార్జున్‌, నడిరపల్లి ఆయుష్‌ కార్యక్రమములో ఉన్నారు.

అమరవాణి
నవనీతసమాం వాణీం

కృత్వాచిత్తం మ నిర్దయమ్‌

తథాప్రబోధ్యతే శత్రు:

సాన్వయో మ్రియతే యథా

పఞ్చతన్త్రమ్‌..
వాక్కును వెన్నవలె తియ్యగా మెత్తగా మాటలాడవలెన. మనస్సును దయాశూన్యంగా చేసికొని శత్రువును సమూలంగా, దుంపతోసహా, వంశసమేతంగా నశింపచేయవలెను. శత్రువును ఎదుర్కొని చంపివేయాలి! కాని, పొల్లు మాటతో కాయాపన చేయరాదు.