గ్రామ స్వయం సంవృద్ధి ప్రజల సంకల్పం కావాలి..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి రేపు ఆగష్టు 15తో 69 సంవత్సరాలు పూర్తయ్యి 70 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నది. 1200 సంవత్సరా నిరంతర సంఘర్షణ తర్వాత భారతదేశానికి 1947 ఆగష్టు 15నాడు స్వాతంత్య్రం వచ్చింది. అదే సమయంలో 1947 ఆగష్టు 14వ తేది నాడు ప్రపంచ పటంలో పాకిస్తాన్‌ అనే పేరుతో భారతదేశం నుంచి ఒక దేశం విడిపోయింది. ప్రపంచంలో మతం ఆధారంగా ఏర్పడిన దేశం బహుశా ఆ దేశం ఒక్కటే కావచ్చు. ఆ దేశం ఏర్పడటమే ఒక విద్వేష భావంతో ఏర్పడింది. ఆ విద్వేషం ఆరోజు నుండి ఈ రోజు వరకు అట్లాగే కొనసాగుతున్నది. ఆ దేశ విభజన నుండి ఈ దేశ పాకులు ఎటు వంటి పాఠాన్ని నేర్చుకోలేదు. ఈ విభజనతో మనం ఏమి సాధించుకున్నాం అంటే 1) ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోలేకపోయాం. 2) వేలాది సంవత్సరా ఈ దేశ సాంస్కృతిక జాతీయ భావాకు అవమానం కగజేయటమే కాక దానిని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాం. మతాన్ని జాతీయతతో ముడిపెట్టి భిన్నజాతు  సిద్ధాంతాకు బలం చేకూర్చాం. దాని ప్రభావం ఈరోజున కూడా దేశంలో కనబడుతుంది.  గడిచిన 69 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్న పరిణామాను గమనించినట్తైతే ఈ దేశంలో ఇస్లా మిక్‌ ఉగ్రవాదం దేశానికి ఒక పెనుసవాలు విసురుతున్నది అని అర్థమవుతుంది. మరోప్రక్క క్రైస్తవం చాపకింద నీరులాగా మతం మార్పిడిలు చేసుకుంటూ ఈ దేశాన్ని బహీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నది. మరోప్రక్క కమ్యూనిస్టులు ఇది ఒక దేశం కాదు ఒక జాతి కాదు ఇది అనేక జాతు సమూహరం అని గడిచిన 70 సంవత్సరాకుపైగా అలుపెరగకుండా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. జాతు  స్వాంతంత్య్రాన్ని మేము సమర్థిస్తామూ అంటూ కాశ్మీరులో జరుగుతున్న వేర్పాటు వాదాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు. ఇండియా ఈజ్‌ ఏ నేషన్స్‌ ఆఫ్‌ నేషన్‌ అనే మాటను ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్ని ఈ దేశం యొక్క సార్వభౌమత్వానికి పెను సవాళ్ళుగా నిలుస్తున్నాయి. భారతదేశంలో బీదరికం, అభివృద్ధి ఈ రెండు పోటీపడి మరీ పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో నిర్మాణమైన దయనీయ పరిస్థితులు చూసినట్లైతే రాబోయే రోజుల్లో ఈ దేశం ఎటువంటి స్థితిలో ఉంటుందో ఆందోళన కలుగుతున్నది. 6క్షకు పైగా గ్రామాలున్న భారతదేశం యొక్క అభివృద్ధి, గ్రామీణాభివృద్ధే నిజమైన అభివృద్ధి ఈ విషయాన్ని విస్మరించి పనిచేసుకుంటూ వస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ విషయంపై పూర్తి శ్రద్ధ ఉంచి గ్రామాను స్వయం సమృద్ధంగా చేయటంలో కృషి చేయావసిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో మహాత్మాగాంధీజి ఈ దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది ఇంకా రావాల్సింది గ్రామ స్వరాజ్‌ అట్లాగే గ్రామ స్వయం సమృద్ధి అని పిలుపు నిచ్చారు. గ్రామాను సర్వతంత్ర స్వతంత్రంగా నిర్మాణం చేయటమే ఈ దేశం యొక్క సమగ్రతకు ఒక ఆధారం అవుతుంది. రాబోవు రోజుల్లో ఈ దేశంలో ప్రజలు, పాకులు ఈ దిశలో కృషిచేయటమే ఇప్పటి తక్షణ అవసరం, అదే నిజమైన స్వాతంత్య్రం అవుతుంది.

విశ్వమంతా ఒక్కటైన వేళ...
యోగా కోసం సరిహద్దులు చెరిగిపోయాయి. విశ్వమంతా ఒక్కటైంది. భారత ప్రధాని నరేంద్రమోదీ చొరవతో ప్రపంచస్థాయిలో పండుగ జరుపుకుంది. అంతర్జాతీయ వేదికపై ఆసన విన్యాసాలు చేసింది. యావత్‌ ప్రపంచం ఆసనమేసింది. కోట్లాది మంది వీధుల్లోకి వచ్చి క్రమశిక్షణతో ఆసనాలు వేయడం కన్ను పండువ అయ్యింది. గత యేడాదే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించగా.. ఈసారి రెండో యేడాది మరింత ఉత్సాహంగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాకుగాను లిబియా, యెమెన్‌ మినహా అన్ని దేశాలు  యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాయి. వీటిలో అరబ్‌ దేశాలు కూడా ఉండటం నిజంగా విశేషం. భారతీయ సంస్కృతిలోనే ప్రత్యేక స్థానం ఉన్న యోగా.. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి హాట్‌ ఫేవరేట్‌ అయ్యింది. ప్రాణాను నిబెట్టేదే కాదు.. నిత్యయన్వనాన్ని తెచ్చిపెట్టేది కూడా యోగా.
మోదీ ప్రతిపాదన.. ఐరాస ప్రకటన :
2014 సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ యోగా ప్రాధాన్యతను వివరిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆవశ్యకతను వివరించారు. అంతేకాదు.. జూన్‌ 21నే యోగా దినంగా ఎందుకు జరుపుకోవాన్న దానిపైనా మోదీ స్పష్టత ఇచ్చారు. ఉత్తరార్థగోళంలో నమోదయ్యే అతిపెద్ద రోజు జూన్‌ 21. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆ తేదీకి ప్రాధాన్యత ఉంది. అందువల్లే యోగా దినోత్సవం ఆరోజు జరుపుకుంటే బాగుంటుందని ప్రతిపాదించారు. తదుపరి యేడాదే ఐక్యరాజ్యసమితి ఈమేరకు ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజాన్ని యోగా వేదికపైకి తీసుకొచ్చింది.  ఈయేడాది.. ‘’అభివృద్ధి క్ష్యాలు సాధించాలంటే ఆరోగ్యకరమైన జీవనం అవసరం’’ అన్న నినాదంతో యోగా దినోత్సవాన్ని నిర్వహించింది ఐక్యరాజ్యసమితి. 

ఢిల్లీలో ప్రణబ్‌, చండీగఢ్‌లో మోదీ...
ఐక్యరాజ్యసమితి యోగా వేడుకల్లో 139 దేశా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌ యోగాసనాలు వేయించారు. దేశ రాజధాని ఢల్లీలో రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. యోగా ఒక రోజు లాంఛనం కాకూడదని.. యోగా దైనందిన జీవతంలో భాగం కావా ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆకాంక్షించారు. ఇక.. చండీగఢ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో 30వే మంది యోగా చేశారు. నరేంద్రమోదీ వందరకా యోగాసనాలు ప్రదర్శించారు. యోగాకు ఒక మతం లేదని, యోగా వల్ల జీవితంలో క్రమశిక్షణ అవాటు చేసుకునే వీలు కుగుతుందని మోదీ గుర్తు చేశారు. ఇహలోక సుఖం కోసం ప్రతీ ఒక్కరూ యోగాను ప్రాక్టీస్‌ చేయాని ఆయన సూచించారు. ఫరీదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌.. యోగాసనాలు వేసి జనాన్ని ప్రోత్సహించారు. ఢల్లీలోని అమెరికా రాయబార కార్యాయంలో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ యోగా చేశారు. భారత సైన్యం, సరిహద్దు  భద్రతాదళాలు కూడా యోగాలో భాగస్వామ్యమయ్యాయి. భారత యుద్ద నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ సిబ్బంది కూడా యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా 391 వర్శిటీలు, 16 వే కాలేజీలు, 12 వే పాఠశాల్లో యోగా దినోత్సవం నిర్వహించారు. మనదేశంలోనే క్షకు పైగా యోగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అమెరికా ఖండమంతా ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమాల్లో 36 మిలియన్ల మంది యోగాసనాలు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్ల జనం యోగాసనాలు వేసినట్లు భావిస్తున్నారు. భారతదేశానికి చెందిన 173 సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో యోగా కార్యక్రమాల్లో ప్రజచేత ఆసనాలు వేయించాయి.  
గర్భిణీయోగా రికార్డు :
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ లో రెండువే మంది గర్భిణీ మహిళలు ఏకకాంలో యోగా చేయడం ద్వారా యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పా రు. యోగా చేస్తున్న ఆ మహిళకే కాదు.. వాళ్ల కడుపులోని బిడ్డకూ ఆరోగ్యకరమే అని ప్రబోధించారు. అంతేకాదు.. సుఖప్రసవానికి కూడా యోగా దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. మరోవైపు.. హైదరాబాద్‌ లోనూ వందమంది గర్భిణీ స్త్రీలు యోగాసనాలు వేశారు. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించారు. 

యోగా పోస్టల్‌ స్టాంప్‌ :
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సూర్య నమస్కారాతో కూడిన ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుద చేసింది.
విశ్వవిద్యాయాల్లో యోగా కోర్సు :
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతియేడాదీ అట్టహాసంగా జరుగుతున్నందున.. ఇదే స్ఫూర్తితో దేశంలోని విశ్వవిద్యాయాల్లో యోగాను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. యోగా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్ని నిర్వహించాలంటూ యూజీసీని ఆదేశించాని కేంద్ర మానవ వనరు అభివృద్ధి శాఖ నిర్ణయించింది.

అమరవాణిసర్వం పరవశే దు:ఖం
సర్వమాత్మవశే సుఖమ్‌
ఇతి మత్వాతు రాజేన్ద్ర
స్వయం దాసాత్‌ తపస్విన:
ఇతరు మీద ఆధారపడితే ప్రతీదీ దు:ఖకరమే. తన చేతుల్లో ఉన్న ప్రతీదీ సుఖకరం. ఇది తెలిసిన మునులూ, ఋషులూ స్వయం దాసులుగా ఉంటారు. అనగా! వ్యక్తికి విద్య, నైపుణ్యం, సామర్థ్యం కలిగి ఉండి ఇతరు సహాయానికై అర్థించవసిన అవసరం రాకూడదు. తన పని తాను చేసుకోగలిగి ఉండడము ఉత్తమము.