2014-15 సంఘ విస్తరణ సంవత్సరం

మార్చి 13,14,15 తేదీలలో నాగపూర్ లో జరిగిన సమావేశాలు
2014-15 దేశవ్యాప్తంగా సంఘపని విశేష విస్తరణ జరిగిన సంవత్సరంగా గుర్తింపు
మాననీయ భాగయ్యగారు సహ సర్ కార్యవాహగా, శ్యాంకుమార్ గారు క్షేత్ర ప్రచారక్ గా ప్రకటన


జనాభా సమతుల్యతను సాధించటమే కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం
కాశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పులలో ఉగ్రవాది బుర్హన్‌వని మృతి చెందిన అనంతరం జులై 8వ తేది నుండి కాశ్మీర్‌లోయలో నిరంతర ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ఫ్యూ కూడా విధించబడింది. పరిస్థితులు ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. కాశ్మీర్‌ భారత్‌లో విలీనమైన నాటి నుండి దేశంలో ప్రధానవార్తల్లో కాశ్మీర్‌ ఎప్పుడూ కనబడుతూనే ఉంది. ఒక ప్రక్క పాకిస్తాన్‌, మరోప్రక్క కాశ్మీర్‌లో పనిచేస్తున్న వేర్పాటువాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు కాశ్మీర్‌ను ఎప్పుడూ ఘర్షణ వాతావరణంలోనే ఉంచుతున్నాయి. ఈ పరిస్థితును చక్కదిద్దేందుకు సరియైన ప్రయత్నాలు జరగటం లేదు అనేది దశాబ్ధా చరిత్ర మనకు తెలియజేస్తున్నది. ఈ పరిస్థితుకు కారణాలు ఏంటి అనే విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్‌కు సంబంధించిన సమస్యను పూర్వాపరాలు మనం జాగ్రాత్తగా పరిశీలించినట్లైతే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కాశ్మీర్‌లో పనిచేస్తున్న సంస్థలు కొన్ని కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఉంచాని పనిచేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలిపేయాని ప్రయత్నం చేస్తున్నాయి. గడిచిన 69 సంవత్సరాలుగా కాశ్మీర్‌లో జరుగున్న పరిణామా సారంశం  కాశ్మీర్‌ పరిష్కారానికి భారత్‌ కఠిన చర్యలు తీసుకోకపోతే పాకిస్తాన్‌ అస్తిత్వం ఉన్నంవతరకు ఈ సమస్య ఇట్లాగే ఉంటుంది. కాశ్మీర్‌ సమస్య ఇట్లాగే ఉండటానికి మరో మౌలిక అంశం ముస్లిం మనస్తత్వమే అని మనకు అర్థమవుతుంది. ముస్లింలు తాము మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో స్వతంత్ర ప్రతిపత్తి కోసం ఎదోరకమైన ఆందోళన చేయటం ఇస్లాం చరిత్రను పరిశీలించినట్లైతే అర్థమవుతుంది. ఎక్కడైనా ముస్లిం మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో వారు చేసే పనులు 1) మతం మార్పిడులు చేయటం 2) భయభ్రాంతును చేసి పారిపోయేట్లు చేయటం చేస్తుంటారు అనేది జగద్వితం. ఈ మధ్య ఉత్తప్రదేశ్‌లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతా నుంచి హిందువులులు వెళ్లిపోయినటువంటి వార్తలు మనం పత్రికల్లో చూశాం. ఈ పరిస్థితిని ఈ రోజే కాదు స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి హైదరాబాద్‌లోని పాతబస్తి మొదలుకొని దేశంలో అనేక ముస్లిం మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఇవే.
పాకిస్తాన్‌ భారత్‌లో అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్‌ను కూడా ఏదో రకంగా కబళించాని గడిచిన 70 సంవత్సరా నుంచి ప్రయత్నం చేస్తున్న విషయం జగద్వితం. అందుకే ఎదురు కాల్పుల్లో చనిపోయిన బుర్హన్‌వనిని ఒక వీరుడిగా కీర్తిస్తూ జులై 19వ తేదిని పాకిస్తాన్‌ ప్రభుత్వమే నిరసన దినంగా ప్రకటించింది. ఇది మన దేశం యొక్క అంతర్గత విషయంలో జోక్యంగా భావించి తీవ్ర నిరసన తెలియచేయవసి ఉంది. కాని మన స్పందన సరిగా లేదు. దేశ విభజన అనంతరం నిర్మాణమైన కాశ్మీర్‌ సమస్య భగవంతుడు భారతదేశానికి ఒక వరంగా ఇచ్చాడు. ఆ వరాన్ని మనం శాపంగా మార్చుకున్నాం. ఎందుకంటే దేశ విభజన సమసిపోయేందుకు చేయవసిన ప్రయత్నాకు కాశ్మీర్‌ ఒక ఆధారంగా కాదగింది. దానిని మనం వదులుకున్నాం. దాని కారణంగా కాశ్మీర్‌ సమస్య రావణకాష్టంగా మారింది. హింసకు హింసే శాశ్వత పరిష్కారం కాదు అందు కోసం ముస్లిం మెజారిటీగా ఉన్న కాశ్మీర్‌ ప్రాంతంలో జనాభా సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉంది. దాని కోసం పదవీ వీరమణ చేసిన సైనికాధికా రుకు అక్కడ నివాసం ఏర్పాటు చేయాలి, అట్లాగే కాశ్మీర్‌లోయను వదిలి పెట్టి వెళ్లిన కాశ్మీర్‌ పండిట్‌కు పునరావాసం కల్పించాలి. తద్వారా జనాభాను సమతుల్యతను సాధించే ప్రయత్నం చేయవచ్చు. మరో ప్రముఖమైన అంశం 1994 సం॥ భారత పార్లమెంట్‌ ఉభయ సభలో కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌ తిరిగి స్వాధీనం చేసుకోని కాశ్మీర్‌ ప్రాంతానికి స్థిరత్వం సాధించాల్సిన అవసరం ఉంది అని తీర్మానించారు. ఈ దిశలో కావాల్సిన ప్రయత్నాను చేయటమే మరోరకంగా కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం అవుతుంది.

ఆర్‌.ఎస్‌.ఎస్‌ పట్ల అధికమవుతున్న ప్రజాదరణ
పెరుగుతున్న సంఘ కార్యక్రమము` శ్రీ మన్మోహన్‌ వైద్య
గత 6 సంవత్సరాలుగా సంఘ కార్యం దేశ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ యొక్క అఖి భారతీయ ప్రచార ప్రముఖ్‌ శ్రీ మన్మోహన్‌ వైద్య గారు అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మాట్లాడుతూ ప్రజలో సంఘము పట్ల విశ్వాసము పెరగడం వననే ఇది సాధ్యమైనదని ఆయన అన్నారు. దీని కారణంగా సంఘ్ శాఖ సంఖ్య 57 వేకు చేరింది.  బిఠూరులోని వకుశనగర్‌, కాన్పూర్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ  యొక్క ప్రాంత ప్రచారకు సమావేశం సమయంలో పత్రికా విలేఖర్లతో వారు మాట్లాడారు. ఆ సమయంలో గత ఐదు రోజులుగా మీడియా సంఘ సమావేశాను భాజపాతో జోడించి ప్రస్తావించడము చూస్తున్నాను. ఇది సరైన పద్ధతి కాదు. ఈ సమావేశాలు సంఘ్కి సంబంధించినవి. దీనితో భాజపాకు ఎటువంటి సంబంధమూ లేదు. గత ఐదు సంవత్సరాలో క్రొత్తగా వచ్చిన కార్యకర్తకు ప్రచారకు విధు నియమ నిబంధనలు తెలియజేస్తారని ఆయన అన్నారు. సామాజిక సమస్యలు మరియు బౌద్ధిక విషయా గురించి చర్చలు మరియు రానున్న సంవత్సరములో పర్యటన గురించి చర్చలు జరుగుతాయని తెలిపారు. దీనితో పాటుగా సంఘ్ యొక్క ప్రచార- ప్రసారము గురించి గూడా చర్చలు జరుగుతాయి. సంఘ సమావేశాలు ఎన్నికను దృష్టిలో వుంచుకొని చేయబడుటలేదు అని ఆయన అన్నారు. 2010 సంవత్సరము తరువాత సంఘ్ పట్ల ప్రజకు విశ్వాసము పెరుగుతూ క్రమేపి ఎక్కువ అవుతున్నదని ఆయన అన్నారు. ఇందువ2010 సంవత్సరములో 45 వే దగ్గరలో ఉన్నసంఘ్ శాఖ సంఖ్య ఇప్పుడు 57 వేలు దాటి పోయిందన్నారు.
గ్రామీణ క్షేత్రాల్లో ప్రవేశించనున్న సంఘ్
సంఘ్ గురించి చేస్తున్న దుష్ప్రచారం ప్రజలు నమ్మటం లేదు అని అనటానికి సంఘ్ వైపు ప్రజలు ఆకర్షితువడం నిరూపిస్తుందని డా. మన్మోహన్‌ వైద్య చెప్పారు. గ్రామాలో సంఘ్ సిద్ధాంతాను ప్రచారము చేయడము ద్వారా సంఘ్ పట్లగ దురభిప్రాయాను దూరం చేయడానికి వీవుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
జాకీరు యొక్క వ్యాఖ్యలు తప్పు
విలేఖరు సమావేశములో డా. మన్మోహన్‌ వైద్యను జాకీర్‌ నాయక్‌ యొక్క వ్యాఖ్యపై సంఘ్ యొక్క అభిప్రాయము ఏమిటని మీడియా అడిగినప్పుడు ఆయన దాటవేసే ప్రయత్నము చేశారు కానీ తరువాత వారు మీ అభిప్రాయ మేమిటని మీడియానే ఎదురు ప్రశ్నించారు మరియు సంఘ్ యొక్క అభిప్రాయము మీ అభి ప్రాయముకు మరియు ప్రజ అభిప్రాయముకు భిన్నము కాదని అన్నారు అది తప్పు అయితే తప్పు అనే చెప్పాలి అని అన్నారు.

ప్రాచీన గ్రామ పంచాయితీ వ్యవస్థలోనే భారతదేశం మనుగడ- హితవచనం
ఈ రోజులో అందరూ ప్రజా స్వామ్యపు ఆధునిక రూపమైన పార్లమెంటరీ విధానాన్నే కావాలంటున్నారు. పార్లమెంటరీ విధానానికి పతనం తప్పదు. యూరప్‌ని ప్రస్తుత దయనీయస్థితికి తెచ్చిందదే.. (భారతదేశంలో) మన ప్రాచీన గ్రామపంచాయతీ పద్ధతితోనే ప్రారంభించాలి... అక్కడ నుండి క్రమేపీపైకి పనిచేసుకుంటూ రావాలి. పంచాయితీలో, వృత్తి సంఘాలో ప్రజాప్రాతినిధ్యమెక్కువ. వాటికి ప్రజతో సన్నిహిత సంబంధ ముంటుంది. ప్రజ భావాలో అవి అంతర్భాగాలు. పార్లమెంటరీ వ్యవస్థలో స్థానిక సంస్థలు` పురపాక సంఘాలు ఉంటాయి. అవి ఎందుకూ పనికి రావు. పురపాక సంఘాకు ప్రజతో సంపర్కమేమీ ఉండదు. కౌన్సిర్లు వేదికనెక్కి ఉపన్యాసాలిస్తారు, వారు మూడు నాలుగు సంవత్సరా పాటు ఏమి చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆ కాపరిమితి అయిపోగానే వాళ్లలో వాళ్లే అన్ని సర్దుబాట్లనీ చేసుకుంటారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ తమ పబ్బంగడుపుకొని కొంత వెనక వేసుకుంటారు.
` యోగి అరవింద మహర్షి