నిజాం నిరంకుశ పాలననుండి విముక్తమైన తెలంగాణనిజాం నవాబు నిరంకుశపాలననుండి తెలంగాణ ప్రజలు విమోచనం పొంది వచ్చే సెప్టెంబర్ 17నాటికి 67సంలు పూర్తి అయి 68 సంలో కి అడుగుపెట్టబోతున్నది. రోజును మహారాష్ట్ర ప్రభుత్వము మరఠ్వాడ సంగ్రామ ముక్తిదివస్గా, కర్నాటక ప్రభుత్వము హైద్రబాద్` కర్నాటక విభజన దినంగా అధికారికంగా నిర్వహిస్తే పోరాటాలగడ్డ మాత్రము ముస్లిం మతస్థుల బూచిని చూసి వెనకడుగువేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్17 కు ప్రాధాన్యతనిచ్చి ప్రజలను ఏకం చేసిన ఇప్పటి అధికార పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం అధికార వేడుకలకు ఆమడదూరంలో ఉంది.
నిజాం నలభైలనాటికి పాలనాదక్షుడిగా దివాన్ పుణ్యాన కీర్తిగడించినా రెండవ ప్రపంచ యుద్ధం పేరిట బ్రిటష్ ప్రభుత్వము నిలువునా దోపిడి చేయడముతో రాజ్యభారాన్ని నట్టేట ముంచి సంపాదనే పరమలక్ష్యంగా జాగీర్ధాయి, దేశ్‌ముఖ్ నిరంకుశ దోపిడిలో ప్రజలను మగ్గేలా చేశాడు. తెలంగాణలో బడులలో సరైన వసతులు ఉండేవి కావు. ఉర్దూ భాషనే నిర్భంధంగా పాఠాలు బోధించారు. ఆంగ్లవిద్యకు ప్రభుత్వము ఆమడ దూరంలో ఉండేది. తెలుగుకు ఏమాత్రం అవకాశముండేది కాదు. గ్రామాలు, పట్టణాలో ఎగువతరగతి కుటుంబాలకు భాగ్యనగరము విద్యాతృష్ణను తీర్చి ఆదరించింది. ముస్లిం జాగీర్ధాయి, గ్రామ స్థాయిలో పటేళ్లు, పట్వారీలు పెత్తందారుల మధ్య, దిగువతరగతి ప్రజలతో వెట్టిచాకిరి చేయిస్తూ అన్యాయంగా పీడించి పీల్చిపిప్పి చేసేవారు.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక ఆంగ్ల ప్రభుత్వము హైద్రాబాద్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తుందని నిజాం నవాబు పిచ్చి ఆశతో ఉండి ప్రజలను గాలికి వదిలేసాడు. మరొకవైపు మజ్లిస్` `ముతైహాదుల్ అనే ముస్లిం మతఛాందసవాద మూక బహదూర్ యార్ జంగ్ నేతృత్వంలో ముస్లిం రాజ్యస్థాపనే లక్ష్యంగా నినదించింది. ‘అనల్‌మాలిక్ (నేనే ప్రభువు) అనే నినాదంతో ప్రతిముస్లిం తనేరాజుగా భావించుకొని నిజాం పాలనను బలపరచాలని సాటి హిందువులను ద్వేషించాలని ప్రకటించాడు. మతపిచ్చి తలకెక్కిన ముస్లిం ప్రజలు గ్రామాలలో ప్రశాంతతను పాడుచేశారు. ఆరోజులో ఉన్న ఆంధ్రా కమ్యూనిస్టు విభాగము పెద్ద పుచ్చపల్లి సుందరయ్య, చండ్రరాజేశ్వర రావు తెంగాణలో పార్టీ విస్తరణ లక్ష్యాంగా తెలంగాణలో చేరారు. ఆంధ్రమహా సభలోకిసుబ్బా రావుపేరిట చండ్రరాజేశ్వరరావు చొరబడ్డాడు.  ఆంధ్రమహాస భలోని ఆవేశపరులైన నాయకులు రావినారాయణ రెడ్డి, బద్ధం ఎల్లారెడ్డిలను చేరదీసి అందులోని జాతీయ వాదులైన సురవరం ప్రతాపరెడ్డి, మందుము నర్సింగరావు, బూర్గుల రామకృ ష్ణారావు, మాడపాటి హనమంత రావులను దారము నుండి పూలను సున్నితంగా వేరుచేసినట్టుగా 1944 నాటికి ఆంధ్ర మహాసభ నుండి నెట్టివేసి దానిని కమ్యూనిస్టు సభగా మార్చేసారు. ‘సభస్థాపకులైన వారిని పెత్తందార్ల మద్దతుదారులని బట్టకాల్చి వారి మీదవేసారు.

కమ్యూనిజం భావాలు కలిగి కమ్యూనిస్టు పార్టీ కు దూరంగా ఉండిన మఖ్దూం మొహియిద్దీన్ వంటి తొలితర అభ్యుదయ కవులు, కార్మిక, శ్రామిక, విద్యార్థి సంఘాలను బలోపేతం చేసారు. అదే కార్మికుల పక్షాన పోరాడి ఎదురునిలిచిన స్వామి రామానంద తీర్థ హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించి ఆర్యసమాజము, ఆదిహిందూ తదితర సంఘాలోని నాయకు లందిరిని ఒకేవేదికపైకి తెచ్చారు. మరోవైపు ముస్లిం మతపార్టీకి రజాకార్లు అనే మత ఛాందస మూక నాయకుడు కాశీం రజ్వీ అధ్యక్షుడయ్యాడు. ఇతను దివాన్‌ను చితకబాదినా నిజాం ఇతనిని శాసించలేని స్థితిలో ఉన్నాడు. కారణము నిజాం రాజ్యరక్షణే తన ధ్యేయమని, బంగాళాఖాతం నీటితో నిజాం కాళ్ళను కడిగిస్తానని, ఎర్రకోటపై అసఫ్‌జాహీ జెండాను ఎగిరేస్తానని అతను ప్రగల్భాలు పలకడమే.
నిజాం స్వతంత్ర రాజ్యం కోసము ప్రయత్నిస్తూనే, గ్రామాలోకి ముస్లిం మతమూకలైన రజాకార్లను చొప్పించాడు. రజాకార్ల ముసుగులో ముస్లిం మత అధికారులు ఎందరో హిందూ స్త్రీలపై అత్యాచారాలు చేసారు. మాచిరెడ్డిపల్లి గ్రామానికి లెవీధాన్యము వసూలుకు వచ్చిన తహశీల్దారు ఖాజామొయి నోద్దీన్ హిందూ స్త్రీలను హింసించిన విషయము రావినారాయణరెడ్డి ప్రపంచానికి తెలిపాడు. ఇంగ్లాండ్, రష్యాపై చేసేదాడులను సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించి అదే ఇంగ్లాండ్ ఫాసిస్టులైన జపాన్, జర్మనీలను ఓడిస్తే ప్రజాయుద్ధముగా ప్రకటించిన ఘనత కమ్యూనిస్టులదే. మతఛాందవాదులు కమ్యూనిస్టు ముస్లిం మూకలు, హిందువులపై చేస్తున్నవి దాడులుగా ఎందుకు కనిపించలేదో చరిత్రకందని విచిత్ర సత్యం.
అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రాకమ్యూనిస్టు పార్టీలు రజాకార్లను ఎదుర్కోవడానికి ఆంధ్రస్టాలిన్ గ్రాడ్గా పేరుపడిన విజయవాడ కేంద్రంగా కమ్యూనిస్టులకు ఆయుధాలు సమకూర్చారు. తెలంగాణలోని కమ్యూనిస్టులకు కొండపల్లి, కంకిపాడులో ఆయుధ, గెరిల్లా శిక్షణలు ఇచ్చారు. నిజాంను ఫాసిస్టుగా ప్రకటించారు. కేంద్రప్రభుత్వాన్ని గుర్తించలేదు. అసలు ఆయుధాలు వీరికి ఏదేశం ఇచ్చిందన్నది పెద్ద ప్రశ్న!?
శాంతియుత పద్ధతులతో గాంధేయ మార్గములో రామానంద తీర్థ చేసిన నిరసన దీక్షలో రహస్యంగా కమ్యూనిస్టు నాయకులు రావినారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు చొరబడి అతనికి వెన్నుపోటు పొడిపించి అరెస్ట్ చేయించారు. గాంధీకి విషయం తెలిసి రావినారాయణరెడ్డిని నిలదీస్తే గాంధీమార్గంలో స్వాతంత్య్రము అసాధ్యమని నిస్సిగ్గుగా బదులిచ్చారు.
గ్రామాలలో రైతులు కమ్యూనిస్టుల సహకారము లేకుండానే తమను, తమ శ్రమను దోపిడిచేస్తున్న పెత్తందార్ల పైకి, మతమార్పిడిలకై బలవంతం చేస్తున్న ముస్లిం జాగీర్దార్లపైకి మూకుమ్ముడిగా దాడులు చేసారు. బేతవోలు, కొనుపాక, మునుగోడు, పరిటాల, గోండు, అమ్మపాలెం రైతులు చేసిన తిరుగు బాట్లు ఆంధ్రకమ్యూనిస్టు పార్టీలను ఆకర్షించాయి. ‘సంఘంపేరిట గ్రామాలలో ప్రజలకు, పెత్తందార్లకు మధ్యవర్తిత్వం వహించి శాంతిస్థాపన చేసే బదులు రెచ్చగొట్టారు. గోండు తిరుగుబాటును నిజాం హైమన్‌డార్ఫ్ కమీషన్ నివేదికతో భూముకు పట్టాలిచ్చి చల్లబరిచాడు. ఒక దేశంలో మరో ప్రత్యేక దేశం పేరిట ఉద్యమము కొనసాగించడము సరియినది కాదు అని ఆనాటి నాయకులు కొమురంభీమ్‌కు  చెప్పి ఉంటే కొమురంభీమ్ అమరుడయ్యే వాడేకాదు. తమ సంఘం కార్యాయాలు స్థాపించిన కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రమహాసభ పేరిట ధైర్యాన్ని నూరిపోశాయి. ‘సంఘంకోసం తన ఇంటినే ఇచ్చిన చాకలి అయిలమ్మ చేసిన వీరోచిత పోరాటాన్ని వెనకుండి నడిపించిన కమ్యూనిస్టు పెద్దలు పోరాటంలో అమరుడైన దొడ్డికొమురయ్యను తమ ఖాతాలోకి వేసుకున్నారు. కేసు గెలిచి, జీవితము ఓడిన ఐలమ్మకు ఒక్క ఎకరం కౌలుభూమిని కూడా దక్కించుకోలేదన్నది, బిడ్డ సోమనర్స మ్మను చెరిచినారన్న ది, పోలీసుదెబ్బలు తిని భర్త మరణించినది, చరిత్ర చీకటిన మరుగునపడింది. 1985 సెప్టెంబర్ 10 కాలం చేసిన ఐలమ్మకు పార్టీలో సభ్యత్వము లేనందున పింఛన్ కూడా దక్కలేదన్నది వాస్తవం. ఆమె మరణించాక మాత్రం స్థూపంకట్టి సిపియం పార్టీ తమ ఖాతాలో వేసుకున్నది జగమెరిగిన సత్యం. ఆంధ్రనుండి వచ్చిన గెరిల్లాదళాలు భూస్వాముల ఇంట్లో ధన, మాన, ప్రాణాలను, పోలీస్‌స్టేషన్ నుండి ఆయుధాలను, మధ్యతరగతి, రైతు కుటుంబాల నుండి ఆహారధాన్యాలను లూటీచేసేవి. గ్రామరక్షక్దళాలు తెలంగాణ గ్రామీణ యువకులచే నిర్మాణం అయ్యేవి. వీరు రజాకార్లను నేరుగా ఎదుర్కొనేవారు. రజాకార్ విధ్వంసక దళాలు గ్రామంలోకి రాకుండా వంతెనను కూల్చేవి.
1947 మే7 ప్రముఖ సోషలిస్టునాయకుడు జయ ప్రకాష్ నారాయణ నిజాంను కలిసి హైద్రాబాద్‌ను భారత్‌లో కలపాలని కోరాడు. దీనికి ఒప్పుకోని నిజాంకు వ్యతిరేకంగాజాయిన్ ఇండియాఉద్యమం రాజు కుంది. సోషలిస్టు దేశము రష్యాను ప్రేమించే కమ్యూనిస్టులు, భారత సోషలిస్టు పిలుపును విస్మరించారు. ఇంగ్లాండ్‌కు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్రానికి తహతహలాడిన సుభాష్ చంద్రబోస్‌నే విమర్శించిన ఘనచరిత్ర కలిగిన కమ్యూనిస్టుపార్టీ తమ పోరాటాలను మాత్రము చరిత్ర పుస్తకాలకు ఎక్కించాలని విశ్వప్రయత్నాలు చేసింది.
1947 ఆగస్టు 15 భారత్‌కు స్వాతంత్య్రము సిద్ధించడాన్ని నిజాం గుర్తిస్తూనే, మరో రెండు రోజుల తరువాత తన స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. మరొకవైపు రజాకార్లు భారత స్వాతంత్య్రఫలా రుచి తమకు ఏదో ఓనాడు లభిస్తుందని భావిస్తున్న హిందు ప్రజలపై దాడులను పెంచింది. నిజాం తన స్వాతంత్య్రానికి బలంగా పునాదులు వేసుకోవడానికి పాకిస్తాన్ మద్దతు కోరాడు. ఆస్ట్రేలియా నుండి ఆయుధాలను దిగుమతి చేసుకున్నాడు. దీనికోసము భారత ప్రభుత్వంతో యథాతథ స్థితి కొనసాగింపు ఒప్పందము పేరిట లభించిన వెసులుబాటును వాటంగా వాడుకు న్నాడు. రజాకార్లు నిజాం ఇచ్చిన ఆసరాతో బీబీనగర్ రైల్వేస్టేషన్‌లోకి చొరబడి మూకుమ్మడి అత్యాచారాలు చేసారు.
1947 సెప్టెంబర్ 11 కమ్యూనిస్టు నైజాం కేంద్ర ప్రభుత్వంతో చేసుకొన్న యధాతథస్థితి ఒప్పందాన్ని గుర్తించబోమని, నిజాం సర్కార్‌తో పోరాడి ప్రత్యేకదేశాన్ని ఏర్పాటు చేస్తామని, భారత ప్రభుత్వంను గుర్తించమని అది ప్రజా ప్రభుత్వమే కాదని తెంగాణ సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపు ఇచ్చారు. ఇది తెలంగాణ ప్రజలను హతాశులను చేసింది. కమ్యూనిస్టు దళాలు, నిజాం సైన్యం, రజాకార్లు తెలంగాణ ప్రజలను నిలువునా దోపిడి చేశారు. దున్నపోతు కొట్లాటలో లేగదూడ కాళ్ళు విరిగాయి, రజాకార్లు స్థానిక ముస్లింలతో కలిసి గుండ్రాంపల్లి గ్రామంలో హిందువులను బావిలోకి తోసి నిప్పంటించారు. నల్గొండ కలెక్టర్ మొహజం హుస్సేన్, డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్ హసీం రజాకార్లతో కలిసి భైరాన్‌పల్లి గ్రామంలోని యువకులను కాల్చిచంపారు. గ్రామంకు దగ్గరే గల కూటికళ్ళు గ్రామంలోకి రాత్రి చొరబడి దళితస్త్రీలను చంపేసారు.
1948 ఆగష్టు21 నిజాం తన ప్రతినిధులను ఐక్యరాజ్యసమితికి పంపడము, వారు చర్చలను సెప్టెంబర్17 నిర్వహిస్తామని చెప్పడము, తెలంగాణ నుండి స్వామిరామానంద తీర్థ తదితరులు ఢల్లీకి వెళ్లి కమ్యూనిస్టులు, రజాకారులు తెంగాణలో చేస్తున్న ఘోరన్ని  వివరించడముతో నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వ్లభయిపటేల్ భారత మాత గర్భాన ఉన్న రాచపుండును తొలగించాని నిర్ణయించారు. సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ జనరల్ మహారాజా రాజేంద్రసింప్జీ, మేజర్ జనరల్స్ జయంత్నాధ్ చౌధురీ, .రుద్రు హైద్రాబాద్‌పై దాడికి వ్యూహం రూపొందించారు. సైన్యం కిల్ఫోర్స్, స్మాష్ఫోర్స్, స్ట్రైక్‌ఫోర్స్, వీర్ఫోర్స్ అనే నాలుగు భాగాలుగా విడిపోయి నలుదిక్కులనుండి దాడులు చేయాలని నిశ్చయించింది. దీనికి మొదట ఆపరేషన్ కబడ్డీ అని, ఆపరేషన్ పోలో అనీ, ఆపరేషన్ కాటర్ప్లిర్గా పేర్లు నిర్ణయించారు. నలుదుర్గం, విజయవాడ తదితర సరిహద్దుల నుండి దాడులు చేస్తూ సునాయాసంగా భారతసైన్యము 108 గంటలో యుద్ధాన్ని ముగించింది. నిజాం సైన్యాసేనానిఎల్.ఎడ్రూస్హైద్రాబాద్కు మొదటగా చేరిన జనరల్ చౌధురికి 1948 సెప్టెంబర్ 18 లొంగిపోయాడు. పోలీసు చర్య ముగిసింది. పోలీసు చర్య ముగిసిన అనంతరం కేంద్ర గృహమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్న వెంటనే నిజాం వల్లభాయ్‌పటేల్ ముందు లొంగుబాటును ప్రకటించాడు. దాంతో నైజాం ప్రభుత్వం కేంద్రంలో విలీనమైంది. 1948 సెప్టెంబర్ నుండి మిలటరి గవర్నర్ జయంతనాథ్ చౌధురీ నేతృత్వంలో పౌరప్రభుత్వపాలన వచ్చింది. రాజాజీ సూచన మేరకు నైజాంపై జరిగిన చర్య పోలీస్చర్యగా ప్రచారం పొందింది. దేశంలో అంతర్భాగమైన ఒక ప్రాంతంపై సైన్యం దాడి చేయదు. పోలిసులకే హక్కు ఉంటుందన్నది ఇందలి పరమార్థం.
రాజ్యాధికారమే లక్ష్యముగా గ్రామాలో అశాంతిరేపిన కమ్యూనిస్టు దళాలు భారతసైన్యముతోకుంటిగుర్రాలు, తోలుకత్తుతోతపడ్డాయి. పౌరప్రభుత్వము ప్రధాన పౌర పాలనాధికారి డి.ఎస్.బాఖ్లే ప్రతి ఉన్నతోద్యోగంలోనూ రాజ్యంలో కేవలం 12శాతం కూడా లేని ముస్లింలు 30శాతము ఉద్యోగాలు ఆక్రమించుకొన్నారని ప్రకటించాడు.
1950 జనవరి 26 రాజ్యాంగం అమలు అయిన నాటి నుండి ఎమ్.కె.వెల్లోడి పాలన మొదలయింది. నిజాం నవాబు రాజ్‌ప్రముఖ్ పదవి పొందా డు. జాగీర్దారీ విధానాన్ని రద్దుచేసాడు. కౌలుదార్లకు పూర్తిరక్షణ కల్పించాడు.
స్థానిక కమ్యూనిస్టు పార్టీకి సంబంధం లేకుండానే కమ్యూనిస్టు నాయకుడు పుచ్చపల్లి సుందరయ్య, చండ్రరాజేశ్వరరావు సాయుధ పోరాటంలో ఏకపక్షంగా వ్యవహరించారు. నిజాం నుండి, ముస్లిం రజాకార్ మూకల నుండి విమోచనం పొందిన తెలంగాణ ప్రజలు 1948 సెప్టెంబర్ 17ను మది లో గుర్తుంచుకున్నారు. తెలంగాణ విముక్తి కారకుడైన సర్దార్‌వల్లభాయ్ పటేల్‌ను స్మరించుకుంటూనే ఉన్నారు. కమ్యూనిస్టులు తాము చేసామని చెప్పుకుం టున్న 3000 గ్రామాల విముక్తి వారి గ్రంథాలోనే నిక్షిప్తమై ఉంది. వీరి నుండి విముక్తి పొందిన తెలంగాణ మాత్రము తర్వాత ఎన్నికలో వీరికి అధికారం అప్పగించకుండా విముక్తము అయింది.