హిందువులారా కళ్ళు తెరవండి

మనం ఏమంటామండీ? అన్ని మతాలు సమానమనా? పరమత సహనం కావాలనా? అందుకే దేవాలయాలు కూల్చినా, మనవారిని బవంతంగా  మతం  మార్చినా, మన కుమార్తెనులవ్్జిహాద్పేరుతో అపహరించినా మనం నోరు మూసుకుని ఊరుకుంటాము. ఒక మహమ్మదీయుడు మనకు ‘‘ భాయిజాన్, ఒక క్రైస్తవుడు ‘‘బ్రదర్’’. కానీ! మన సోదర హిందువు మాత్రం మనకు అస్పుస్యుడు. ఇటీవల మధ్యప్రదేశ్లోని  ఒక గ్రామంలో  ఒక దళితుడు తన వివాహం సందర్భంగా గుఱ్ఱం ఎక్కినందుకు గ్రామంలోని హిందువులంతా అతడిని రాళ్లతో కొట్టారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో ప్రతాప్ఘడ్ మండలం, రెహువాలాల్ గంజ్ గ్రామానికి చెందిన ఇద్దరు దళిత యువకులు ప్రతిష్ఠాకరమైన ఐఐటి పరీక్ష వ్రాసి ఉన్నత చదువుకు ఎంపిక అయ్యారు. ఐతే గ్రామంలోని కొందరు గ్రామస్థులు ఇది సహించలేక యువకుల ఇంటిపై రాళ్ళు రువ్వారు. అన్నదమ్ములో ఒకడైన రాజూసరోజ్ ఎంతో బాధపడుతూ ‘‘అయ్యా దళితులం చదువుకోరాదా? అదేమైనా నేరమా? అని ప్రశ్నించాడు. ఇద్దరు అన్నదమ్ములూ ఐఐటిలో సాధించిన విజయానికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ సన్మానం కూడా చేశాడు. హిందువులారా ఇకనైనా మేలుకొనండి. ప్రతి హిందువు మన బంధువు అనే ఇంగితం కలిగి ఉండండి.