హిందూ సమాజంలో విశ్వాసం నిర్మాణం చేస్తున్న సంఘం

 సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవము
మే 2 తేదీ నుండి ఘటకేశ్వర్ దగ్గర అన్నోజీగూడలోని శ్రీ విద్యావిహార్ పాఠశాలలో ప్రారంభమైన సంఘశిక్షావర్గ ప్రథమవర్ష, ద్వితీయ వర్ష మే 22 సా. 6.00 గం. సార్వజని కోత్సవ ముతో ముగిసింది.  మే 22 జరిగిన సార్వజని కోత్సవంలో ముఖ్యఅతిధుగా డా కే.పి.రెడ్డి C.E.O మాక్స్ విజన్, మరియు శ్రీ అనంత పాయ్ (ప్రముఖ పారిశ్రామిక వేత్త) పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో శిక్షార్థులు శారీరక ప్రదర్శను చేసారు. దండ, దండయుద్ధ,నియుద్ధ, ఆసన్, ఘోష్, వ్యాయామ్యోగ ప్రదర్శను చేసారు. అనంతరము సాంఫీుక్గీత్ ప్రదర్శన జరిగింది. తదుపరి వైయక్తిక్గీత్ అనంతరము ముఖ్య అతిథి శ్రీ కాసు ప్రసాద్రెడ్డిగారు ప్రసంగిస్తూ  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్్ను కొనియాడుతూ ‘‘క్రమశిక్షణ అంటే ఏమిటో మిమ్మల్ని చూస్తే అర్థం అవుతోంది. మీ ప్రదర్శను నాకు ముచ్చట వేసాయిఅన్నారు. ‘‘నేను లండన్లో దశాబ్ద కాలం వున్నాను. అక్కడి పిల్లలో వున్న దేశభక్తిని నేను గమనించాను. దేశాన్ని దూషిస్తే చిన్న పిల్లవాడు కూడా ప్రతిఘటించడం నేను చూసాను. అలాంటి పరిస్థితి మన దేశంలో లేదేమో అనుకొనేవాడిని ` నా అంచనా తప్పు అయ్యింది` ‘సంఘందేశభక్తిని, క్రమశిక్షణని నేర్పిస్తున్న సంఘటనఅని అంటూ కార్యక్రమానికి రావటం తన ‘‘అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మరో ముఖ్య అతిధి శ్రీ అనంతపాయ్ తన హిందీ ప్రసంగంలో వ్యక్తి సర్వాంగీణ వికాసానికి సంఘం చేస్తున్న కృషిని అభినందించారు. ‘‘సంఘంవల్లనే దేశసమైక్యత సాధ్యమయింది’’ అన్నారు.
అనంతరం ప్రధాన వక్త శ్రీ బండి జగన్ మోహన్ ప్రసంగించారు.‘‘దేశంలో 41 ప్రాంతాల్లో, 60 కేంద్రాల్లో దాదాపు 20 వేలమంది యువకులు దేశ సేవకు అంకితమై శిక్షణ పొందు తున్నారు `వారికి అభినందనలు.అంటూ శ్రీ జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ప్రపంచానికి మార్గ దర్శనం చేసే హిందువు తన లోపాలను సరి దిద్దుకోవటం అవసరంఅని అంటూకృణ్వంతో విశ్వమార్యంఅనే హిందువు అంటరానితనాన్ని రూపుమాపాలి` దేవాయ ప్రవేశానికి నోచుకోని వారు వుండటం దురదృష్టకరం` భగవంతుడు అందరివాడు` అందరిలో చైతన్యం ఒక్కటే అంటూ ఉద్వేగంతో వివరించారు. భారతీయుల కుటుంబ వ్యవస్థను ప్రపంచం కొనియాడుతున్న విషయాన్ని వివరించారు. అటువంటిది ఈనాడు మన దేశంలో చిన్న కుటుంబాల వల్ల `వత్తిడు పెరిగి  కుటుంబ వ్యవస్థ సతమతమవుతోంది’’ అన్నారాయన.
స్వామి వివేకానంద ఆశించిన సంఘటన, అనుశాసనం సాంస్కృతిక విజ్ఞానం అనే ఆశయాలకు అనుగుణంగా ఆర్ఎస్ఎస్ ఉద్భవించిందనీ ` మహాత్మగాంధీ, అంబేత్కర్, ‘‘సంఘ కార్యం దేశవ్యాప్తం కావాలి’’ అని ఆశించారని శ్రీ జగన్ పేర్కొన్నారు. దేశం నడిబొడ్డున అటువంటి కేంద్రం వుండాలని స్వామీజీ ఆశించినట్లుగానే ఆర్ఎస్ఎస్ స్థాపన నాగపూర్లో జరిగిందనీ ఈనాడు 51 వేల గ్రామాల్లో సంఘ శాఖలు విస్తరించాయని శ్రీ బండి జగన్ పేర్కొన్నారు. సంఘం చేస్తోన్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిశ్చారు.
వేదికపైన ప్రొటి. తిరుపతిరావు గారు, డాజనార్థన్గారు, ప్రధానవక్త శ్రీ జగన్గారు, శ్రీ ప్యాట వెంకటేశ్వరరావుగారు (ప్రాంత సంఘ చాలకులు) ఉన్నారు. కార్యక్రమంలో క్షేత్రప్రచారక్ శ్రీ శ్యామ్కుమార్, ప్రాంత సహకార్యవాహ, క్షేత్ర బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ కాచం రమేశ్, ప్రాంత కార్యవాహ శ్రీ ఎక్కా చంద్రశేఖర్, సహకార్యవాహ అన్నదానం సుబ్రహ్మణ్య తదితర సంఘ పెద్దలు అనేక మంది పాల్గొన్నారు. 1500 మందికి పైగా సంఘ స్వయం.సేవకులు, అభిమానులు కార్యక్రమములో పాల్గొన్నారు.