విదేశీ ప్రచారకుడిని అడ్డుకున్న పోలీసులు

  మరోసారి భారతీయ వీసా ఉ్లంఘనకు ప్పాడిన విదేశీయుడిని పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాలో జరిగిన ఘటన ఇది. వేలాదిమందిని క్రైస్తవమతం లోనికి మార్చేందుకుగద్వాల్ పాస్టర్స్ అసోసియేషన్ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుండి 12 తేదీ వరకు ఒక భారీ బహిరంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఒక క్రైస్తవ ప్రచార సంస్థ అధ్యక్షుడు బెర్నీ మూర్ కార్యక్రమానికి హాజరవడానికి ఏప్రిల్ 8 తేదీన అమెరికా నుండి భాగ్యనగరం చేరుకున్నాడు. అక్కడే మొదలైంది అసలు కథ.
ఏప్రిల్ 8 తేదీ ఉదయం వివిధ హిందూ సంస్థ ప్రతినిథులు మహబూబ్నగర్ జిల్లా ఫారినర్స్ రీజనల్ రిజస్ట్రేషన్ అధికారిని కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. భారతదేశంలో విదేశీయు మతప్రచారం చేయడం చట్టవిరుద్ధం అని, అది వీసా నియమ నిబంధన ఉల్లంఘన క్రిందకు వస్తుందని పేర్కొంటూ, ఉల్లంఘనకు పాల్పడేందుకు సిద్ధమైన బెర్నీ మూర్ అనే విదేశీయుడిని కట్టడి చేయాల్సిందిగా కోరారు. వినతిపత్రంతో పాటు హోమ్మంత్రిత్వశాఖ సమాచార చట్టం క్రింద అందించిన లేఖ కాపీని జతపరిచారు. వెంటనే స్పందించిన FRRO అధికారి విదేశీయుడిని హైదరాబాద్ దాటి రాకుండా ముందస్తుగా కట్టడి చేసారు.
చట్టం ఏం చెప్తోంది?
భారతీయ వీసా చట్టా ప్రకారం మన దేశానికి వచ్చే విదేశీయులకు వారివారి పని, వృత్తినిబట్టి ప్రభుత్వం వివిధ రకా వీసాలు మంజూరు చేస్తుంది. అందులో పర్యాటక వీసా, విద్యార్థి వీసా, దౌత్యపరమైన వీసా, మెడికల్ వీసాతో పాటు మొత్తం 18రకాల వీసాలున్నాయి.   ఇందులో మిషనరీ వీసా కూడా ఒకటి. సేవ నిమిత్తం భారతదేశానికి వచ్చేవారికి మాత్రమే వీసా మంజూరు చేస్తారు. అయితే మిషనరీ వీసా కలిగిఉన్న విదేశీయుడు సేవపేరుతో మత పరమైన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, మతమార్పిడికి పాల్పడటం వంటివి నేరంగా పరిగణిస్తారు. అంతేకాదు, గత కొన్ని సంవత్సరాలుగా భారతప్రభుత్వం మిషనరీ వీసాలు ఇవ్వడం నిలిపివేసినట్లు సమాచారం. ఇంకొక విషయం ఏమిటంటే మతపరమైన కార్యక్రమాలకు వచ్చే విదేశీయులకు భారత ప్రభుత్వం ఎటువంటి వీసా ఇవ్వదు.
ఉల్లంఘన ఎలా జరుగుతోంది?
నిజానికి మతప్రచారానికి భారతదేశం వచ్చే విదేశీయులు ఎక్కువగా పర్యాటక లేదా వ్యాపార వీసా మీద వస్తారు. మతపరమైన కార్యక్రమాలకు వచ్చే విదేశీయులకు భారతప్రభుత్వం ఎటువంటి వీసా ఇవ్వదు కాబట్టి వీరు పర్యాటకానికి లేదా వ్యాపార నిమిత్తం భారత్ వెళ్తున్నట్లుగా ఆయా దేశాల్లోని కాన్సులేట్ అధికారులను నమ్మిస్తారు. అక్కడినుంచి వచ్చి ఇక్కడ మురికివాడల్లో, గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ మతమార్పిళ్ళకు పాల్పడుతున్నారు. నిజానికి విదేశీయులు ( వీసా కలిగి ఉన్నా) గిరిజన ప్రాంతాల్లో సంచరించడానికి నిబంధనలు అంగీకరించవు. అందుకు వారు భారతీయ విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందడం తప్పనిసరి. కానీ నిజానికి విదేశీయులు ఇది పాటించడం లేదు.
ఇలా అడ్డుకట్ట వేయవచ్చు?
ఎవరైనా మతప్రచారకుడు భారత్లో మత పరమైన సభకు వస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే అతను దేశం నుండి అయితే వస్తున్నాడో అక్కడి భారతీయ కాన్సులేట్ దృష్టికి కనీసం ఇమెయిల్ ద్వారా విషయాన్ని తీసుకు వెళ్ళాలి. అతడు భారత్ ఎందుకు వస్తున్నాడో తెలియచేస్తూ అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలి. తద్వారా విదేశీయుడు కాన్సులేట్ అధికారులను మోసం చేసి వీసా పొందకుండా చూడవచ్చు. తరువాత అతను ఎక్కడికైతే వస్తున్నాడో జిల్లా ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ (FRRO) అధికారికి విషయమై ఫిర్యాదు చేయాలి. (సాధారణంగా జిల్లా పోలీసు సూపరింటెండెంటు FRRO గా వ్యవహరిస్తారు).    మెట్రో నగరాల్లో FRROని విడిగా నియమి స్తారు). విధంగా వీసా నియమాలు ఉల్లంఘించేవారిపై కన్నేసి ఉంచవచ్చు.
` అయ్యలసోమయాజుల