ఓయు తేనెతుట్టెను కదిపిన కేసీఆర్‌ రహస్య వ్యూహంలో భాగమేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు మానసపుత్రికగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ పథకం ఆచరణ పక్కన బెట్టి... ఆదిలోనే తీవ్ర విమర్శలకు, అనుమానాలకు కారణమవుతోంది. ఇటీవలి కాలంలో కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.