సాంస్కృతిక ఏకతే జాతీయత

కేరళ రాష్ట్రంలో కాడి అనే గ్రామంలో పుట్టిన శంకరాచార్య దేశమంతా కలియ తిరిగారు. ఆరోజుల్లో ఇప్పటిలాగే ఒక కేంద్రప్రభుత్వం లేదు. ఒకే రాజ్యంగా కూడా లేదు. అయినా అట్లా హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు తిరగాలనే ప్రేరణ శంకరాచార్యులకు ఎట్లా కలిగింది? భూమి నా తల్లి అనే భావనే, దేశంలో ఉన్న ప్రజలందరూ నావారనే భావనే, అదే ప్రేరణ శంకరాచార్యను వివేకానందుడ్ని దేశమంతా తిప్పింది. దేశం గురించి విష్ణు పురాణంలో
ఉత్తరం యత్ సముద్రశ్చ
హిమద్రేశ్చైవ దక్షిణం
వర్షంతత్ భారతంనామ
భారతి యత్ర సంతతిః’’
అని వివరించబడిరది. ఉత్తరాన  ఉన్న హిమాలయాల నుండి దక్షిణాన ఉన్న హిందూమహా సముద్రం వరకు, దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రం నుండి హిమాలయాల వరకు వ్యాపించి ఉన్న భూభాగాన్ని భారతవర్షం అంటారని, ఇక్కడి ప్రజలను భారతీయులు అంటారని దాని భావన. ఇక్కడ మనకు కనబడేది భూమి యెడల ఉండే మమత్వము. అదే సాంస్కృతిక భావన, అదే మనను అందరిని కలిపి ఉంచేదని  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అఖిల భారత సహ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబళే సంస్కృతి పౌండేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ వివరించారు.
2015 మే 31 తేదీనాడు
. 10.00 గం.కు మారియట్ హోటల్ లో ‘‘సాంస్కృతిక జాతీయతఅనే అంశంపై ఒక కార్యక్రమం నిర్వహించ బడింది. కార్యక్రమానికి ముఖ్య అతిధుగా శ్రీ పల్లే రామారావుగారు, కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారు, శ్రీ వరప్రసాద్రెడ్డిగారు పాల్గొన్నారు. సంస్కృతి పౌండేషన్ ఛైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ డి.ఆర్.యస్.సి. రాజుగారు ప్రారంభ ఉపన్యాసంలో ‘‘సంస్కృతి పౌండేషన్ లక్ష్యాల గురించి, నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.  కార్యక్రమంలో శ్రీ వరప్రసాద్రెడ్డిగారు మాట్లాడుతూ ‘‘ ఒక జాతి ఔన్నత్యము శిఖరాయమానంగా కొన్ని వందల సంలు విలసిల్లింది అంటే దానికి జాతి సంస్కృతే కీలకమైంది. మన సంస్కృతి అనాది కాలం నుండి ఉంది ప్రపంచానికి వివేకాన్ని జ్ఞానాన్ని అందించిన జాతి మనది. మన జీవన విధానానికి కీలకం మన సంస్కృతి, మన ధర్మం. భారత దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వానికి తూట్లు పొడిచే విధంగా, భారతీయ సమగ్ర తను దెబ్బతీసే విధంగా కుట్రులు జరుగుతున్నాయి. కుట్ర లను వమ్ము చేయాలి. ప్రపంచంలో క్రైస్తవానికి ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి. క్రైస్తవ రాజ్య్ంగా పిలవ బడుతున్న అమెరికా, ఇంగ్లాండులో ఐరోపా ఖండంలో క్రైస్తవ మతస్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. అమెరికా, ఇంగ్లాండు దేశాలో చాలామంది తమని తాము నాస్తికులం అని చెప్పుకొంటున్నారు. కోల్పోతున్న సంఖ్యాత్మక బలాన్ని పూరిం చుకోవటానికి క్రైస్తవులు ఆసియా ఖండంమీద పడ్డారు.  భారతదేశంలో కూడా ప్రయత్నిస్తు న్నారు. ఆసియా ఖండంలో క్రైస్తవులు సంఖ్యాత్మక వివరాలు ఒకసారి గమనిద్దాం. ఇండోనే షియా దేశంలో 9.7% మంది, దక్షిణ కొరియాలో 29.3% మంది, ఫిలఫెన్స్లో 85.5% మంది, శ్రీంకలో 7.7% మంది బర్మాలో 9.9% మంది క్రైస్తవులైనారు. అదే భారత్లో వంద సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్న వాళ్ళ జనాభా 2.7% మాత్రమే ఉంది. దీనిపైన క్రైస్తవులు తర్జన భర్జనలు పడుతున్నారు. భారత్లో వాళ్ళకు పెద్ద సమస్య ఎదురవుతున్నది, ఎదిరించిన చోట యుద్ధాలు చేయవచ్చు, ప్రలోభ పెట్టవచ్చు, కాని అది ఇక్కడ సాగడం లేదు. బహుళత్వం భారతీయ విశిష్టత. పరమత సహనం, సర్వమత సమభావన దేశానికి శ్రీరామరక్షగా ఉంది. కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారు తాను ఏమి మాట్లాడలేను అంటూనే సూటిగా కొన్ని విషయాలు చెప్పారు.  నేను తీసిన సినిమాలో మన ధర్మం, ఆచారాలు, విలువలు చూపించే వాడిని, నాకు తెలిసింది ఒక్కటి తల్లిని, తండ్రిని, గురువు, అతిథిని గౌరవించాలని సంస్కారము నాకు మా తల్లి నుండి మా తాతమ్మ నుండి వచ్చింది అని చెప్పారు. శ్రీ పల్లె రామారావుగారు మాట్లాడుతూ సంస్కృతి వికాసం అంటే కళ, జీవన విధానం మాత్రమే కాదు శాస్త్ర సాంకేతిక రంగాలో అభివృద్ధి కూడా సంస్కృతి వికాసమేనని అనేక ఉదాహరణలు చెప్పారు.
మే 31 ఆదివారం 10గంకు సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖుల సమ్మేళనంలో  శ్రీదత్తత్రేయ హొసబళే (RSS సహసర్ కార్యవాహ) ప్రధాన ఉపాన్యాసకులుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా శ్రీపల్లెరామారావుగారు తదితరులు పాల్గొన్నారు. ‘‘సాంస్కృతిక జాతీయతఅంశంపై ఉపన్యాసాలు సాగాయి.