క్రైస్తవ మతమార్పిడులను ఎదుర్కొవాలి

క్రైస్తవ మతం మార్పిడి చరిత్ర అనేక దేశాలో హింసతో రక్తపుటేరులు పారించింది. వారి దేశాలో అనేక జాతుల్ని పశువులకంటే హీనంగా హింసించిన వైనాలు చరిత్రలో చెరగని యదార్థాలు. ఇప్పటికి అభివృద్ధి చెందిన వారిదేశాలో వైషమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత చరిత్ర త్రవ్వి వారంతా ద్వేషాలు నూరిపోయకపోవటమే ఆదేశాల ప్రత్యేకత. హిందూఛాందసవాది కూడా మతం మార్పిడిని సహించడు కాని మతాలను గౌరవిస్తాడు. క్రైస్తవం, క్రీస్తుపై గౌరవం ఉన్నవారు కూడా మార్పిడిలని మాత్రమే నిరసిస్తారు. తన మతాన్ని ప్రచారం చేసుకోటం తప్పుకాదుకాని భారతదేశం నుండి హిందూ మతం పోవాలని సభలు పెట్టడం నాగరిక సమాజం క్షమించదు. రాజ్యంగపరంగా ఆలోచిస్తే ఇది ఒక క్షమించరానినేరం. ఈదేశంలో ఆరితేరిన క్రైస్తవ మేధావులు ఈదేశంలోని సామాన్యప్రజలను ప్రక్కదారి పట్టిస్తున్న వైనాన్ని అందరం ఖండించాలి.
క్రైస్తవ మత ప్రచారాన్ని కొమ్ముకాస్తూ దేవుడు ప్రజాస్వామ్యవాదా కాదా? అనే వ్యాసం వ్రాసిన ఒక ప్రొఫెసర్ హిందూ సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తూ దళిత క్రైస్తవుల సంరక్షకుడిగా తనకుతాను భావిస్తూ పత్రికల్లో టివీల్లో చర్చలో తన వితండవాదాన్ని విన్పిస్తూ మన గ్రంధాలో చెప్పిన విషయాలను వక్రీకరిస్తూ దళితుల సంరక్షకుడి ముసుగులో క్రైస్తవ మిషనరీకు సహకరిస్తున్నాడు. ఇటువంటి వారి ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొని హిందూ సమాజంలో సామాజిక సామరస్యాన్ని సాధించేందుకు దిశానిర్దేశం చేసిన అంబెద్కర్ ఆలోచనను ప్రజలముందుకు తీసుకొని వెళ్దాము. ఇటువంటి విద్వేషులు దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ విషయంలో హిందువులు అప్రమత్తంగా ఉండాలి.