పరాభవం ఓడింది పరాక్రమం జయించింది
జ్యేష్ఠశుద్ధ త్రయోదశి, 1674 సంవత్సరం. భారత పౌరుషం ప్రకటితమైన రోజు. పరాభవం మరచి పండుగ చేసుకొన్నరోజు. 35 సంవత్స రాలపాటు నిద్దురలేకుండా దేశం కోసం యుద్ధం చేసినవీరుడ్ని జాతి స్మరించుకునే రోజు. హిందూ పదపాదుషాహిగా శివాజీ పట్టాభిషిక్తుడైన రోజు. వరుస విదేశీ దండయాత్రతో కునారిల్లిన జాతిలో ఆత్మవిశ్వాసం నింపాడు శివాజీ. చైతన్యం రగిలిం చాడు. హిందువులు శాసించగలరా? శస్త్రాు ధరించగలరా? సంధించగలరా? అన్నవాదనను రోదనను పటాపంచలు చేసి యుద్ధస్ఫూర్తి రగిలించాడు శివాజీ. శివాజీ తన స్వంత కీర్తిప్రతిష్ఠ కోసం, సామ్రాజ్యవిస్తరణ చేయలేదు. విదేశీయు దురాక్రమణలో సర్వం కోల్పోయి ప్రజ జీవితాలు దుర్భరమయ్యాయి. వారిలో విజయకాంక్ష సన్నగిల్లింది. శివాజీ కర్తృత్వశక్తి వారికి అండ అయింది. అందుకే కేవలం మహారాష్ట్ర వాసులే కాక దేశప్రజందరికి శివాజీ ఆశాకేంద్రమయ్యాడు. కాశీలో విశ్వేశ్వర ఆలయ విధ్వంసం కళ్ళారా చూసిన ఆయ పూజారుల వంశస్థుడు గంగాభట్టు కూడా శివాజీ గురించి విని, చూసి వెళ్ళి శివాజీని సింహాసనం అధిష్ఠించ మని కోరాడు. ఔరంగజేబుకు శివాజీ అంటే చచ్చేంత భయం. సభలో 20 అడుగు దూరంలో నిలబెట్టి మాట్లాడేవాడు. ఎక్కడ శివాజీ దూకి చంపుతాడోనన్న భయం. శివాజీ యుద్ధ నీతి కూటనీతి. గెరిల్లా యుద్ధతంత్రం, తక్కువ సేనతో శత్రువలకు ఎక్కువ ప్రాణనష్టం కల్గించడం. అందుకే అఫ్జల్ఖాన్కు భయపడుతున్నట్లు నటించి ఏకాంతంగా కలిసేందుకు ఒప్పించి, పులిగోళ్ళతో కడుపులో గ్రుచ్చి సంహరించాడు. వేలసేనతో కొలువుదీరిన షయిస్తఖాన్ శిబిరంలోకి పదుల సంఖ్యలో చొరబడి, వేళ్ళు తెగనరికి భయానక వాతావరణం సృష్టించి కనుమరుగైపోతాడు శివాజి. శత్రువు గుండెలో భయం పుట్టించడమే  ఆయన రణనీతి. అదొక యుద్ధవ్యూహం. నేడు అణ్వాయుధాలు కల్గిఉన్నామని చెప్పడం కూడా దేశ రక్షణవ్యూహంలో ఒక భాగం. శివాజీ పట్టాభిషిక్తుడైన తరువాత రాజస్థాన్లో రాజపుత్ర రాజులంతా తమ విభేదాలు విడిచి ఒక్కటై దుర్గాదాస్ రాథోడ్ నాయకత్వంలో ఒకటిగా నిలిచారు. శివాజీ పట్టాభిషిక్తుడైన కొన్నిరోజులకే విదేశీయులైన మొగు రాజస్తాన్ను విడిచి పోయారు. రాజాఛత్రసాల్ శివాజీ నుంచి ప్రేరణ పొందాడు. అస్సాం రాజు చక్రధ్వజసింహుడు, కుచ్బీహార్ రాజు రుద్రసింహుడు శివాజీ అనుస రించిన నీతినే పాటించారు. ‘సింధునది పుట్టిన చోటు నుంచి కావేరి నది దక్షిణతీరం వరకు ఉన్నదంతా మన మాతృభూమిఅని శివాజీ చేసిన గర్జన పోర్చుగీసువారి శాసనాల్లో ఉంది.
శివాజీ ఏర్పాటు చేసుకున్న అష్టప్రధాను మండలి అనే పద్ధతి ప్రాచీన భారతీయ పరంపర లోనిది. శివాజీ సంఘటనశీలి. అన్నివర్గాలు, వర్ణాల ప్రజలతో మమేకమయ్యేవాడు. మావళీ ను సంఘటితపరచాడు. అందులోనుంచి సూర్యాజీ, తానాజీ, బాజీప్రభు దేశపాండే వంటి వీరుల్ని తయారుచేశాడు. తన అనుచరులలో ఒకడైన సాజీకంక, గోల్కొండ కతుబ్షా ప్రభువు తానీషా మైదానంలో నిబెట్టిన ఏనుగుతో కలబడి తొండం నరికి హతమారు స్తాడు. తాను కష్టిస్తూ యుద్ధాలు చేస్తూ, సాహసం ప్రదర్శిస్తూ తన అనుచరులకు ఉత్సాహ మిచ్చేవాడు శివాజీ. ముస్లింగా మార్చబడిన నేతాజీ పాల్కర్, బజాబి నింబల్కర్ను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువచ్చాడు. ‘ఘర్ వాపసీగా నేడు వినవస్తున్నమాట నాటిది కాదన్నమాట. స్వరాజ్య ప్రభుత్వం నుంచి సైనికులకు జీతాలు చెల్లించడం ద్వారా వారి విధేయతను రాజ్యపరం చేశాడు. పేద రైతుకు వాళ్ళ పొలం విస్తీర్ణం, పంట దిగుబడిని బట్టి పన్ను రాయితీనిచ్చి రైతుబాంధవుడనిపించు కున్నాడు. ఫిరంగు, ఖడ్గాను స్వదేశంలో తయారుచేయించే ఏర్పాటు చేశాడు. రక్షణ రంగంలో స్వావలంబనకు నాడే శ్రీకారం చుట్టాడు. సముద్రతీర రక్షణకై నౌకాదళ నిర్మాణం చేశాడు. జలదుర్గాలను కట్టించాడు. ఎంతో దార్శనికత గల్గిన ధీశాలి శివాజీ. గో వధను నిషేధించాడు. ఫారశీ భాషకు ముగింపు పలికి ప్రజల భాషతో కూడిన రాజ్యవ్యవహార కోశాన్ని తయారుచేయించాడు. స్త్రీ రక్షణకు ప్రాధాన్యత నిచ్చాడు. ఆయన సర్వశక్తులు వొడ్డి చేసిన కష్టానికి సఫల పరిష్కారం ఆయన పట్టాభి షేకం. ఇది అలంకారప్రాయమైన వేడుక గాదు. జాతికి ఆదర్శప్రాయమైన కథగా చరిత్ర పుటకెక్కింది.
` హనుమత్ ప్రసాద్