మనం కూడా నేర్చుకుందాంఅన్ని దిక్కుల నుండి జ్ఞానాన్ని స్వీకరించుకుందాం గావుతాఅని ఘోషిస్తోంది ఋగ్వేదం. క్రింది మూడు సంఘటనలను పరిశీలించుదాం!
1) సేవ్ ది చిల్ర్డన్ పేరుతో ఒక ఎన్జీవో సంస్థ పాకిస్తాన్లో 35 సంవత్సరాల నుండి పనిచేస్తున్నది. ఐతే ఎన్జీవో పని పాకిస్తాన్ దేశహితానికి వ్యతిరేకంగా ఉన్నందున ఫారెనర్స్ కంట్రిబుట్.ఓఆర్జి యాక్ట్`2015 అనే చట్టాన్ని అనుసరించి, దేశం అంతరంగిక మంత్రినిస్సార్ అలిఖాన్, ఎన్జీవోను బహిష్కరించి దేశం నుండి గెంటి వేశాడు.
2) జునైద్ హుస్సేన్ ఐఎస్ఐఎస్కి చెందిన ఒక కంప్యూటర్ హ్యాకర్ ఇతడి పని అమెరికా దేశ రక్షణకి ప్రమాదకరంగా ఉన్నందున 27`08`2015 నాడు వాడిని డ్రోన్ విమానం సహాయంతో కాల్చిచంపారు.
3) కొరాడో (యుఎస్)లో జేమ్స్హోమ్స్ అనే వ్యక్తి 12 మందిని చంపి 70 మందిని చంపేయత్నం చేసినందుకు కార్లోస్ సమూర్ అనే జడ్జి జేమ్స్కు 12 యావజ్జీవ శిక్షలు మరియూ 3,318 సంవత్సరాల కఠినకారాగార శిక్ష విధించాడు. జేమ్స్ మరణించే వరకూ జైలులో ఉండాలని తీర్పుచెప్పాడు.
వీటి నుండి మనం ఏమైనా పాఠాలు నేర్చుకోగలుగుతామా? ఆలోచించండి!
- ది హిందూ