డిఆర్‌డీవో శాస్త్రవేత్త సతీశ్‌రెడ్డికి రిన్‌ ఫెలోషిప్‌
భారతరక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డీవో) సీనియర్ శాస్త్రవేత్త, అగ్ని`5 రూప క్పనలో కీలకపాత్రధారి, ఇమారత్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ జి.సతీశ్రెడ్డి ప్రతిష్ఠాత్మక రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్ (రిన్) ఫెలోషిప్కు ఎంపికయ్యారు. ఉపగ్రహ ఆధారిత నావిగేషన్, ఏవియానిక్స్ సాంకేతిక పరిజ్ఞానంపై ఆయన కృషికిగాను గుర్తింపు లభించింది. జూలై 15 లండన్లో నిర్వహించే రిన్ వార్షిక సమావే శంలో ఫెలోషిప్ అందుకునేందుకు రావాల్సింది గా ఆయనకు ఆహ్వానం అందింది. భారత్ నుండి గుర్తింపు పొందిన తొలివ్యక్తి డా.సతీష్రెడ్డి కావడం విశేషం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమూరు గ్రామవాసి సతీశ్రెడ్డి దేశంలోని నావిగేషన్, ఏవియానిక్స్ నిపుణుల్లో ఒకరు. 5వేల కి.మీ.పైగా దూసుకెళ్ళే ఖండాంతర అగ్ని`5 క్షిపణి తనలక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగల నావిగేషన్ వ్యవస్థను రూపొందించింది వీరే.