నేపాల్‌ భూకంప బాధితుల కన్నీళ్ళు తుడుద్దాం
నేపాల్లో ప్రకృతి విలయతాండవం చేసింది. వందల సంవత్సరాల కాలఖండంలో ఎన్నడూ చూడని భూకంపం వచ్చింది. నేపాల్కు ఇది కోలుకోలేని దెబ్బ. సమయంలో నేపాల్లోని హిందూస్వయంసేవక సంఘ కార్యకర్తలు వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. భారత దేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అఖిల భారత సహసర్కార్యవాహ మా.దత్తాత్రేయ హోస బళే గారిని సంఘం కాఠ్మాండూకు వెంటనే పంపించింది. పరిస్థితులను అంచనా వేసి సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు వెంటనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సహాకారంతో అక్కడి హిందూ స్వయం సేవక సంఘం వెంటనే రంగంలోకి దిగింది. పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రీయ సేవాభారతి, సేవా ఇంటర్నేష నల్ కార్యకర్తులు పూర్తిస్థాయిలో దిగి పనిచేస్తున్నారు. నేషనల్ మెడికోస్ సంస్థ (ఎన్.ఎమ్..) అత్యవసర ఆరోగ్యసేవలను అందించేందుకు యాభైమంది డాక్టర్స్ను అక్కడికి పంపింది. లక్నో, ఢల్లీ, గుజరాత్ నుండి డాక్టర్స్ బృందాలుగా వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు. 29.4.2015 జరిగిన అత్యవసర సమావేశంలో పది వేల టార్పాలిన్స్, పదివేలరగ్గులు రెండురోజులో అక్కడికి పంపటానికి నిర్ణయం జరిగింది. నేపాల్లో 8 కేంద్రాలు గుర్తించి, కేంద్రాల ఆధారంగా పని చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ కార్య వాహ మా.భయ్యాజీ జోషి ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ `‘‘నేపాల్లో సంభవించిన భూకంపంలో వేలాదిమంది తమప్రాణాలు కోల్పోయారు. లక్షమంది శరణార్థులుగా మారారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో అక్కడి ప్రజలకు చేయూతనందించటం మన కర్తవ్యం. అందుకు ముందుకు వచ్చి, పునరావాస కార్య క్రమాలకు విరాళాందించలవసినదిగా విజ్ఞప్తి చేసారు. దేశవ్యాప్తంగా సంఘ స్వయంసేవకులు విరాళము సేకరించి నేపాల్ పంపే ప్రయత్నం ప్రారంభించారు. నేపాల్లోని భూకంప బాధితుల కన్నీళ్ళు తుడుద్దాం. వారిలో ధైర్యాన్ని నింపి, వారికి ఆసరాగా నిలబడదాం.
` సమాచార భారతి