మనదైన యోగను వికసింపచేద్దాం


జూన్ 21 ప్రపంచ యోగదినోత్సవము సందర్భంగా ప్రత్యేకం.
యోగ మానవజాతికి గొప్పగా ఉపయోగపడే పురాతనమైన శాస్త్రము. మానసిక శాస్త్రవేత్తలు దీనిని మానసిక చికిత్సకు ఉపయోగిస్తూ, మంచిఫలితాలు సాధిస్తున్నారు. యమ, నియమాలు వ్యక్తిగతంగా, సామాజికంగా ఎంతో మేలు చేస్తాయి. మనఋషులు వీనిని ఇంకా ఆరుమెట్లు పైకితీసుకువెళుతూ అత్యున్నత సమాజరూపకల్పన చేసారు. యోగాసనాలు చాలా ప్రసిద్ధిగాంచుతున్నవి. ఆరోగ్యాన్ని సహ జంగా కాపాడుకొనుటకేగాక, కోల్పోయిన ఆరో గ్యాన్ని తిరిగి రాబట్టుకొనుటకు చికిత్సాపరంగా వాడుతూ, మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
యోగకు మూలాధారము ఈశ్వరుడు, ప్రకృతి మరియు పురుషులపై విశ్వాసము, పురుష వ్యక్తి ఆత్మలు. ఇది అనంతము. ఈశ్వరుడు సర్వవ్యాపి, సచ్చితానంద స్వరూపుడు. అతనిని ఓంకార ప్రణవనాదముతోనే గుర్తిస్తాము. ఈశ్వరేచ్ఛతో పురుషకర్మ ఆధారంగా, సత్వ రజో తామస ప్రకృతి గుణాలు విశ్వంలో వికసిస్తాయి.
అవిద్యతో తన నిజమైన అస్తిత్వమును తొసుకొనని పురుష ఆత్మ ఐహిక బంధనాలలో చిక్కుకుని, పుట్టుక చావుతో సతమతమవు తుంది. కాని అష్టాంగ యోగసాధనతో ఇట్టి వయబంధనము నుండి ముక్తి పొందవచ్చు. దీనినే కైవల్యప్రాప్తి అంటారు.
యోగమునుచిత్తవృత్తి నిరోధమని పతంజలి నిర్వచించాడు. ఎప్పుడైతే అన్నిరకాల చిత్తవృత్తి రూపాలు నియంత్రించబడతాయో అప్పుడు నిజమైనస్వబహిర్గతమౌతుంది. చిత్తమంటే అంతఃకరణాలైన మనోబుద్ధు. వీటిపై కండ్లు, చెవులు మొదలైన జ్ఞానేంద్రియా ప్రభావముతో కలిగే ఆలోచను, భావోద్రేకాలే చిత్తవృత్తు.
యోగాభ్యాసములో మంచి ఏకాగ్రతతో సమాధిస్థితి వరకు చేరుటలో అంతరాయాలు రాకుండా పతంజలి ఇచ్చిన మరికొన్ని సలహాలలో వైరాగ్యము మరియు నిరంతర అభ్యాసము ప్రముఖమైనవి. మొదటిది ఐహిక వాంఛ నుండి దూరము చేస్తే, రెండవది అంతర్ముఖును చేస్తూ పరమాత్మవైపు తీసుకెడుతుంది.
ఇతర సూచను ఇలా ఉన్నాయి : సంతో షంగా ఉన్నవారితో స్నేహము పెంచుకొనుట (ఈర్ష్య పడుటకన్న), బాధితు పట్ల కరుణ, ప్రాణశక్తియైన శ్వాస ప్రక్రియను నియమాధీనం చేయుట, గుండె కేంద్రములో వెలిగే జ్యోతిపై ధ్యానముంచుట, తనలో కుగుతున్న ఉన్నత భావా సదాస్మరణ, దేవీదేవత చిత్రాపై, చంద్రుడు మొదలగు గ్రహాలపై తన శరీరములోని నాడీకేంద్రాలపై ధ్యానముంచుట.
ఇవన్నీ చేయటమూలాన ఆధ్యాత్మిక సాధకునికి మానసిక శాంతి చేకూరుటయే గాక దానిపై నియంత్రణ కూడా కలుగుతుంది.
అష్టాంగయోగము : పురుష (జీవాత్మ) ప్రకృతి సంబంధమైన తన శరీ రము మనస్సుతో బంధిం చబడి ఉంటుంది. యోగ క్ష్యము బంధనాన్ని వియోగము చేయడమే. ఇది ప్రకృతి పురుష రెండును వేరే అనేవివేక ఖ్యాతిద్వారానే సాధ్యమవుతుంది. దీనికై 8 మెట్లుగ అనుశాసనాపద్ధతేఅష్టాంగ యోగము.
ఇవి 1.యమ (నిగ్రహము), 2.నియమ (అనుష్టానము), 3.ఆసన్ (స్థితి), 4.ప్రాణాయామము (ప్రాణాధార ప్రవాహాపై నియంత్రణ), 5.ప్రత్యాహార (సకలేంద్రియమును వెనక్కి తీసుకొనుట), 6.ధారణ (ఏకాగ్రత), 7.ధ్యాన (ధ్యానము) మరియు 8.సమాధి (పూర్తి అచేతన స్థితి). వీనిలో మొదటిఐదు బహిరంగము, చివరి మూడు అంతరంగము. యోగలో స్వయం అనుశాసనము కలిగిన సమాజం నిర్మాణమవు తుంది. సంక్షోభాలో చిక్కుకున్న ప్రపంచ మానవాళిని సరియైన దిశలో నడపించుదాం.
జూన్ 21 ప్రపంచ యోగదినోత్సవము జరుగబోతున్నది. మనదైన యోగను వికసింప చేసి ప్రపంచ శాంతికి దారులు ఏర్పాటు చేద్దాం.
` డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆరోగ్యభారతి