మొదటి మహిళా డ్రైవర్‌ సరితయువతీ మేుకో...

కుటుంబ వ్యవస్థకు మూలం మహిళ. ఉన్న దానిలోనే అందరికీ ఎలా పంచాలో తెలిసిన సమర్థురాలు. ఇంట్లో ఎలాంటి సమస్య తలెత్తినా సరే, నేర్పుతో, ఓర్పుతో అధిగమిస్తూ, కుదిరితే తనవంతు సహాయాన్ని అందిస్తుంది. తను పస్తున్నా సరే ఇంట్లో అందరూ సంతృప్తిగా తినాలనుకుంటుంది. అందుకే భారతీయ సంస్కృతి ఆమెను ధీశాలిగా, త్యాగ మూర్తిగా వర్ణించింది. కుటుంబం కోసం ఉద్యోగం చేస్తున్న ఎందరో మహిళులు ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది సరిత. కాకపోతే ఆమె చేసేది మామూలు ఉద్యోగం కాదు. బస్సుడ్రైవర్. తెంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన మహిళ. వయస్సు 30. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చింది. తండ్రి పనికి వెళితేకాని పూట గడవదు. తోటి వారందరిలో ఆమె చిన్నది. అనుకోని నష్టం వల్ల వ్యవసాయంలో లాభాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. దాంతో కుటుంబంలో చిన్నదైనా పెద్దదిక్కుగా నిలవాలనుకుంది. అందుకోసం డ్రైవర్ వృత్తిని ఎంచుకుంది. ఉన్న ఊరిలోనే ఆటో నడుపుతూ జీవనం సాగించిన సరిత కుటుంబ పోషణ కోసం ఢల్లీ వెళ్ళింది. అక్కడ బి.ఎమ్.డబ్ల్యు.కార్ డ్రైవర్గా పనిచేసింది. అక్కడ ఉండే కొద్దిమంది వ్యక్తుల సహకారంతో క్యాబ్డ్రైవింగ్లో శిక్షణ తీసుకుని అక్కడి స్కూల్లో వాహనాలకు డ్రైవర్గా పనిచేసింది.
ఢల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్వాళ్ళు నిర్వహిం చిన శిక్షణకు అర్హత సాధించింది. శిక్షణలో 243 మంది మహిళా కండక్టర్లు ఉంటే సరిత ఒక్కరే డ్రైవర్. అలా ఢల్లీ నగరంలోనే మొదటి డి.టి.సి. డ్రైవర్ పోస్టుకి సెలెక్ట్ అయి తనను తాను నిరూపించుకుంది.స్త్రీ తలచుకుంటే ఏమైనా సాధించగలదు, దానికి ధైర్యం చేయగలనుఅన్న ఆత్మస్థైర్యం ఉంటే చాలు.సమానత్వం, సాధికారత అంటే సంస్కృతి, విలువలను కాలరాయడం కాదు. తాళి త్రెంచినంత మాత్రాన సమానత్వం రాదు. అలా వస్తుందనుకునే కొన్ని సంఘాలు సమాజంలో ఉన్న ‘‘పరదాపద్ధతిని ఎందుకు తొగించలేక పోయారు? కాబట్టి మహిలళూ.. సమానత్వం, సాధికారత అంటే నైతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడమే తప్ప నైతిక విలువను చేజార్చుకోవడం కాదని గుర్తించండి.
`లతా కమలం