భావ స్వేచ్ఛ ప్రకటనకు ఇంటర్నెట్‌ శక్తివంతమైన సాధనముదేశాన్ని సరిగానడిపించటానికి మూడు వ్యవస్థలు ఉన్నాయి. 1) శాసన నిర్మాణ వ్యవస్థ 2) కార్యనిర్వాహక వ్యవస్థ 3) న్యాయ వ్యవస్థ. మూడింటింతోపాటు సమాచార రంగము అనేది నాలుగవ వ్యవస్థగా రూపుదిద్దుకొన్నది. వేగంగా విస్తరిస్తున్న శాస్త్ర,సాంకేతిక యుగంలో మీడియా పాత్ర చాలా ప్రాధాన్యత కలిగింది. ప్రాధాన్యతను అధిగమించి విస్తరించింది ఇంటర్నెట్. మానవ నాగరికత వికాసంలో అద్భుతమైన సృష్టి ఇంటర్నెట్. వ్యక్తికి అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. ఉంది అనుకొంటుంటాము. ఇంటర్నెట్ సృష్టించటంతో అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ సాకార రూపం సంతరించుకొన్నది. ఎవరైనా తన గొంతుక వినిపించే వేదిక  ఇంటర్నెట్ అని మాడభూషి శ్రీధర్గారు సమాచారభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన నారదజయంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ చెప్పారు. నారద జయంతిని ప్రపంచ పాత్రికేయ దినోత్సవము అంటున్నారు. నారదుడికి జర్నలిస్టుకి సంబంధం ఏమిటి? నారదడు త్రిలోక సంచారి. నిరంతరము మేఘా లో సంచరిస్తూ ఉంటాడు. మేఘాలు (క్లవుడ్), సాంకేతిక విప్లవంలో మనం సమాచారము క్లవుడ్లో దాచుకొనే వ్యవస్థ¸ ఏర్పడిరది. దేశానికి నాల్గవ వ్యవస్థ శక్తివంతంగా పని చేస్తున్న సమయంలో దూసుకొని వచ్చింది ఐదవ వ్యవస్థ అదే సోషల్ మీడియా, ఇంటర్నెట్. సోషల్ మీడియా (ఫిఫ్త్ ఎస్టేట్) రాకతో ఫోర్త్ ఎస్టేట్ ప్రాధాన్యం గణనీయంగా తగ్గిపోయింది, ప్రామాణికతపైకూడా అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఎవరైనా, అభిప్రాయమైనా చెప్పు కునే అపూర్వ అవకాశం ఇంటర్నెట్ ద్వారా వచ్చింది. అందుకే ఇంటర్నెట్, సోషల్మీడియా మీద కూడా ఆధిపత్యం చెలాయించే కుట్ర నడుస్తోంది. ప్రజలందరికీ యథేచ్ఛగా అందు బాటులో ఉన్న ఇంటర్నెట్ను రెగ్యురైజ్ చేసే పేరుతో నెట్న్యూట్రాలిటీపై పరిమితులు విధించే భారీ కుట్ర నడుస్తోంది. కంప్యూటర్లలో బ్రౌజింగ్ చేసినంతకాం ఇబ్బందులు పెద్దగా ఎదురు కాలేదు. కానీ ఎప్పుడైతే మొబైల్స్ లో ఇంటర్నెట్ వెసులుబాటు వచ్చిందో టెలికామ్ సర్విస్ ప్రొవైడర్లుఇంటర్నెట్ మాల్స్ను తయారుచేసే పనిలోపడ్డాయి. అంటే నెట్లో వారు చూపించేదే మనం చూడాలి. వాళ్లకు ఒప్పందం కుదిరిన కంపెనీ ప్రొడక్టునే మనచేత కొనిపి స్తారు. వారు ధర నిర్ణయిస్తే ధరకే మనం కొనుక్కోవాలి. దురదృష్టవశాత్తూ టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా ప్రైవేట్ టెలికం సర్విస్ ప్రొవైడర్లవలో చిక్కి నెట్ న్యూట్రాలిటీని రెగ్యురైజ్ చేసేందుకు యత్నించింది. అయితే నెటిజన్ల నుంచి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రజాస్వామ్య వాదుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వెనుకంజ వేసింది. దీనిపై పౌర సమాజం కూడా స్పందించాల్సి ఉంది. ఇలాంటి చర్య ద్వారా అత్యంత చవకైన సోషల్ మీడియా కూడా ఖరీదుగా మారే ప్రమాదం ఏర్పడింది. అంటే ఫోర్త్ ఎస్టేట్ ఎంత ఖరీదుగా, కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతుందో రాబోయే రోజుల్లో ఫిఫ్త్ఎస్టేట్కు కూడా అలాంటి దుర్గతి పట్టే ప్రమాదం లేకపోలేదని శ్రీధర్ హెచ్చరించారు. మీడియా పేరుతో భారీ అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచురితమైన లేదా ప్రసారం చేసిన వార్త ద్వారా మనకు అర్థం అవుతున్నది కొంతే. కానీ ప్రచురితం కాని వార్త వెనుక జరుగుతున్న కుంభకోణాల గురించి ఉన్నదున్నట్టు మాట్లాడుకుంటే మన ప్రజలు విస్మయం కావడటం ఖాయమన్నారు. ఇక చిన్నపత్రిక పేరుమీద జరుగుతున్న  స్కామ్ గురించి మాట్లాడుకుంటే పెద్దచిట్టానే తయార వుతుందన్నారు. చాలా చిన్నపత్రికలు కేవలం లెటర్హెడ్ మీద మాత్రమే ఉంటున్నాయని ప్రింట్ రూపంలో ఎక్కడా కనిపించవని అన్నారు.
 నేపాల్లో భూకంపం సంభవించినప్పుడు భారత్ ఎంతో వేగంగా స్పందించి సహాయచర్యలు ముమ్మరం చేసింది. భారత సహాయం మిగతా ప్రపంచ దేశాలకన్నా చాలా ఉదారంగా ఉంది. కానీ భూకంప దృశ్యా కవరేజీ కోసం ఇండియన్ మీడియా పడ్డ కక్కుర్తి ప్రపంచదేశాల్లో మన పరువుతీసింది. అంతేకాదు ట్విట్టర్ అనే సోషల్మీడియా ద్వారా 125వేల విమర్శలు  ఇండియన్ మీడియా ఎదుర్కొంది. ఇండియన్ మీడియా గోబ్యాక్ అంటూ నేపాల్ పౌరసమాజం మన మీడియాను గెంటేసింది. ప్రజలకు చేరాల్సిన సమాచార సేకరణలో ఇంతటి అమాన వీయత ప్రజాస్వామ్యం ఉనికికే ప్రమాదకరమని శ్రీధర్ మీడియా సంస్థను హెచ్చరించారు. ఒక ప్రశ్నకు ఉండే శక్తి ఎంతటిదో ఎన్టీఆర్ చేత సిగరెట్ మాన్పించిన ఆయన కూతురు పురందేశ్వరి ఉదంతం ద్వారా వివరించారు. ఒక సామాన్యవ్యక్తికి ఉండే ప్రశ్నించే హక్కుద్వారా అక్బర్లాంటి మహా ప్రభువు సైతం పునరాలోచనలో పడి ప్రజా పాలనలో నిర్ణయాలు మార్చు కున్న ఉదంతలాను శ్రీధర్ ఉటంకించారు.  ప్రశ్నించే హక్కు కాపాడు కోవటం మనందరి బాధ్యత అని గుర్తు చేసారు. మే 30 తేదీ శనివారం ఉదయం 10.40గం.కు జాగృతి భవనంలో నిర్వహించ బడిన నారదజయంతి కార్యక్రమానికి శ్రీ హరిహరశర్మగారు అధ్యక్షత వహించారు. సందర్భంగా నలుగురు పాత్రికేయులకు సన్మానం చేయటం జరిగింది. శ్రీ భండారు సదాశివరావు స్మారక పురస్కార మును శ్రీ వక్కంక రమణ గారికి, శ్రీ క్రాంతిదేవ్ మిత్రగారికి ఇవ్వటం జరిగింది. శ్రీ వడ్లమూడి రామ్మోహన్రావు స్మారక పురస్కారమును  శ్రీ వేదు నర్సింహంగారికి, శ్రీమతి మేడపాటి రామక్ష్మిగారికి అందజేయటం జరిగింది. శ్రీ తిగుళ్ళ కృష్ణమూర్తిగారు కార్య క్రమము నిర్వహిస్తే శ్రీ బీరప్ప వందన సమర్పణ చేసారు. కార్యక్రమంలో అనేకమంది ప్రముఖులైన జర్నలిస్టులు పాల్గొన్నారు. జనగణమణ జాతీయగీతంతో కార్యక్రమం ముగిసింది.
మే 30 శనివారం ఉదయం 10:40కు జాగృతిభవనంలో శ్రీహరిహరశర్మగారి అధ్యక్షతన నారద జయంతి కార్యక్రమం  సమాచార భారతిఆధ్వర్యంలో జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీమాడభూషి శ్రీధర్గారు పాల్గొన్నారు సందర్భంగా నలుగురు పాత్రకేయులను సన్మానించటం జరిగింది. ఈకార్యక్రమంలో  125మంది పాత్రకేయులు పాల్గొన్నారు.