ప్రపంచ వ్యాపార రంగంలో అలజడిఆగస్టు నెల ఆఖరివారంలో ప్రపంచ ఆర్థిక రంగం పెద్ద కుదుపుకు గురైంది. భారత్కు సంబంధించినం తవరకు వ్యాపారం విలువలతో కూడి ఉంటుంది. అందుకే దేశ ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతోంది. విపణిలో లభ్యమయ్యే సరుకు పరిమాణం, ముద్రించబడే కరెన్సీ మధ్య వ్యత్యాసమే ద్రవ్య్బోణం. నల్లధనం చలామణి అవుతున్నప్పుడు సరుకు ధర అంతర్జాతీయంగా పెరుగుతుంది. ద్రవ్య్బోణంను మోడీ ప్రభుత్వం బాగా కట్టడి చేయగ ల్గింది. కాని అవి మార్కెట్లు పతనమయ్యాయి. ఆగస్టు 24 ఇది జరిగింది. దీనికి కారణం చైనా ఆర్థిక సంక్షోభం తాలుకు ప్రకంపనలు మార్కెట్లను కుదిపేశాయి. చైనా సంక్షోభం తోపాటు రూపాయి విలువ పడిపోవడం, డాలర్ బలపడడం, చమురుధర అంతర్జాతీయం గా బారెల్కు 40 డార్లకు పడిపోవడం కూడా ఇందుకు దోహదపడింది. ప్రధానంగా చైనా తన కరెన్సీ విలువను తగ్గించడం వల్ల జరిగిన అనర్థం ఇది. స్టాక్మార్కెట్ల లో 7లక్షల కోట్ల ప్రజాధనం క్రయ విక్రయాల్లో ఆవిరైపోయింది. దేశీయ కారణాలు మార్కెట్ల పతనానికి కారణం కాదు. నిజానికి ముడిచమురు ధర, లోహాలు, ఇతర సరుకు ధరలు తగ్గి దేశానికి ఆర్థికంగా మేలు జరిగింది. కరెంటు ఖాతాలోటు తగ్గింది. దిగుమతులు తగ్గింది, ఇతర దేశా ఆర్థిక వ్యవస్థకంటె భారత్ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోంది. చైనా వంటి దిగజారుడు విధానాలను భారత్ అవలంభించే అవకాశం లేదని ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. చైనా చేసిన నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. భారత్లోని విదేశీ మారకద్రవ్య నిల్వ 39000కోట్ల డాలరులు వున్నాయని, భారత్కు మార్కెట్ ఒడిదుడుకును ఎదుర్కొనే శక్తివుందని ఆయన అన్నారు. ప్రపంచంలో గత ఏడాదిగా జరిగిన గొప్ప మార్పు లో అమెరికా కూడా చమురుశుద్ధి, తయారీ ప్రారంభిం చడం ముఖ్యమై నది. దీనివ్ల కూడా చమురు ధర గణనీయంగా పడిపోయింది. చైనా సంక్షోభం నేపథ్యంలో చమురు వినియోగం భారీగా తగ్గవచ్చన్న ఆందోళన ఇందుకు కారణం. చైనా కరెన్సీ ప్రభావం దేశీయ కరెన్సీపై ప్రభావం చూపింది. ఆందోళన పడిన మదుపరులు లావాదేవీ ఎట్టకేలకు రూపాయి మరింత పడిపోయేలా చేసింది. మనకే కాదు ప్రభావం ఐరోపా, అమెరికా మార్కెట్లను భారీగా ప్రభావితం చేసింది.
- హనుమత్ ప్రసాద్