చర్చలకు ముఖం చాటేస్తున్న పాకిస్తాన్‌ఆగస్టు 23 ఆదివారం జరుగవలసిన భారత్`పాక్ జాతీయ భద్రతా సలహాదారు (నేషనల్ అడ్వయిజర్స్) స్థాయి సమావేశం రద్దయింది. గత మాసంలో ప్రధాని నరేంద్రమోడి రష్యా పర్యటన సందర్భంగాఉఫాలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్షరీఫ్ మధ్య చర్చ ప్రక్రియలు ప్రారంభానికి ప్రాతిపదిక ఏర్పడింది. అక్కడ జరిగిన సమావేశంలో ఎన్ఎస్ సలహాదారుల సమావేశంలో ఉగ్రవాదం దాన్ని నివారించడాన్ని గురించి మాత్రమే చర్చు జరపాలని ప్రతిపాదిం చారు. కానీ ఈలోపుగా పాక్ సైనిక వర్గాలు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఒత్తిడి మేరకు చర్చ అజెండా లో కాశ్మీర్ అంశం ప్రధానమని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ ప్రకటించడం, చర్చను పక్కదారి పట్టించినట్లైంది. అంతేకాకుండా పాక్ భద్రతా సలహాదారులు న్యూఢల్లీ పర్యటన సందర్భంగా కాశ్మీరీ హురియత్ కాన్ఫరెన్స్, మరియు వేర్పాటు వాద, అతివాద, మితవాద వర్గాలనాయకులను ఢల్లీలో చర్చలకు ఆహ్వానించారు. ఇది 1972 ఇండియా`పాక్ మధ్య జరిగిన సిమ్లా ఒప్పందానికి విరుద్ధం. సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్-పాక్ చర్చలో మూడవ పక్షానికి చర్చకు అవకాశం లేదు. ఉభయపక్షాలు మాత్రమే సమస్యకు చర్చ ద్వారా పరిష్కారాలు సాధించాలి. కానీ పాక్ ప్రభుత్వం సిమ్లా ఒప్పందస్ఫూర్తికి విరుద్ధంగా, మరియు గత నెలోఉఫాలో ప్రధానలమధ్య జరిగిన ప్రతిపాదనలకు విరుద్ధంగా కీలకమైన తీవ్రవాద అంశాన్ని పక్కదారి పట్టించి, కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తేవడం, ఆదేశానికి ఉగ్రవాదాన్ని తుద ముట్టించడంలో చిత్తశుద్ధి లేదని నిరూపిస్తోంది. అలాగే ప్రతిసారి చర్చలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఇరుదేశాల మధ్య చర్చ పరిష్కారానికి నిబద్ధత పాటించడం లేదు. అంతేకాకుండా ఇటీవల భారత ప్రభుత్వం 1993 బొంబాయి పేలుళ్ళకు కారణమైన దావూద్ ఇబ్రహీం 9నివాసాలను, చిరునామా, ఫోన్ నెం.తో సహా బాహ్యప్రపంచానికి భారత్ చాటి చెప్పడంతో 23 జరగాల్సిన చర్చలో పాకిస్తాన్ సమాధానం చెప్పలేని పరిస్థితులలో ముఖం చాటేసిందని ప్రముఖ రాజకీయ పండితులు విశ్లేషిస్తు న్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఒకప్రక్క చర్చకు రావాలని ప్రయత్నిస్తూ, రెండోప్రక్క మిలటరీ వత్తిడికి లొంగిపోతూ వ్యవహరిస్తున్నది. ఒకప్రక్క సరిహద్దులో నియంత్రణ రేఖ ఉల్లఘించి దాడులు చేయడం, ఉగ్రవాదులను భారత్లోకి పంపించేందుకు ప్రయత్నం చేయటం, ఇంకోప్రక్క కాశ్మీర్ విషయాన్ని మాట్లాడుతూ పాకిస్తాన్ ఆర్మీ భారత్తో చర్చలు జరగకుండా అడ్డుపడుతున్నట్లు అనిపిస్తున్నది.  అంతే కాకుండా కేంద్రంలోని ఎన్.డి..ప్రభుత్వం ధృఢవైఖరితో కాశ్మీరీ వేర్పాటు వాదుల చర్చలను తిరస్కరిచడం, చర్చలు కేవలం తీవ్రవాదానికి మాత్రమే పరిమితమవ్వాని ధృఢమైన సందేశం ఇవ్వడంతో పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలకు ముఖం చాటేసింది.