జనతకు చేయూత మోడీ పానలో ఘనత


10 ఏళ్ళ యుపిఎ పాలనతో విసిగిపోయిన జనం గత ఏడాది శ్రీ నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్‌డిఎను గద్దెనెక్కించారు.  గత ఏడాదిగా మోడీ పాలన సామాన్య జనానికి భరోసా యిచ్చే దిశగా నడిచింది. 50% బ్యాంకు ఖాతాలు లేని జనానికి జనధన్ యోజన క్రింద ఆయన బ్యాంకు ఖాతాలు తెరిపించారు. తరువాత దీన్ని జన సురక్షవైపు మళ్ళిస్తూ భీమా పథాకాల్ని ప్రవేశపెట్టారు. సామాజిక, ఆర్థిక భద్రత కల్గించే ప్రయత్నం చేశారు.  అవినీతి మకిలి లేశమాత్రం అంటకుండా పాలన సాగింది.ఉగ్రవాదులదాడుల భయం లేకుండా శాంతియుతంగా పాలన సాగింది. ‘హోమంత్రిత్వశాఖ ఎక్కడికక్కడ నిఘావేసి అనేకమంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసింది. దేశంలోకి అక్రమంగా వస్తున్న నిధుల ప్రవాహాన్ని అరికట్టేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలపై వేటు వేసింది.  ధరలు అదుపులోకి వచ్చాయి. ఆలుగడ్డ, ఉల్లిపాయ ధరలు పెరగకుండా అక్రమ నిల్వదారుల లైసెన్సు రద్దవుతాయని బెదిరించింది. 2014`15లో భారత వృద్ధిరేటు 4.2 నుంచి 6.9 శాతానికి చేరింది. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలకై మోడీ ఏడాదిలో 18 దేశాలు పర్యటించారు. సుమారు 3 లక్షల కోట్ల వ్యాపార వొప్పందాలు కుదుర్చుకున్నారు. 7000 కోట్ల విదేశీ గ్రాంట్లు రాబట్టారు. విదేశీ మారకద్రవ్య విలువలు రెండురెట్లు పెరిగాయి.  నల్లధనం  రాబట్టడం విషయంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.  120 మందిపై కేసు పెట్టారు. నల్లదనం పోగేసే వారిని శిక్షించే విధంగా పార్లమెంటులో బిలు తెచ్చారు. బిన్న వ్యాపార రంగాలను ప్రోత్సహించేందుకు, వాటికి రుణ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ముదరా బ్యాంకును ప్రారంభించింది. మహిళలను  ప్రోత్సహిస్తూ మొదటిసారి రిపబ్లిక్‌డే పెరేడ్లో మహిళలతో కవాతు చేసే విధంగా ప్రోత్సహించింది. అమెరికా అధ్యక్షుడికి మహిళా ఆఫీసర్‌తో గార్డ్ ఆఫ్ ఆనర్ యిప్పించడం జరిగింది. మహిళ కోసం బేటీపడావో, బేటీబచావో పథకం ప్రవేశ పెట్టారు. మేక్ ఇన్ఇండియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించి తయారీ రంగాన్ని అభివృద్ధి పరచాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2జి లైసెన్స్ కోసం, బొగ్గుగనుల కేటాయింపు కోసం ఆంక్షలను విధించి సుమారు 4 లక్షల కోట్ల రూను కార్పొరేట్ నుంచి మోడీ ప్రభుత్వం రాబట్టింది.  పబ్లిక్‌రంగ వాటా విక్రయాలు కలిపి మొత్తం 5 లక్షల కోట్ల రూఖజానాకు జమ అయ్యాయి. 67 బొగ్గుగనులను వేలం ద్వారా 3.35 లక్షల కోట్లు సమకూరాయి. ఇంకా 137 పై చిలుకు బొగ్గు గనులను వేలం వేయాల్సి వుంది.  వీటి నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల ఆదాయ లోటును భర్తీ చేస్తూ 10% అదనపు నిధులను అన్ని రాష్ట్రాలకు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు రూపంగా 22,113 కోట్లు భించాయి. విద్యుత్ కష్టాల నుండి తెంగాణాను ఆదుకునేందుకు 222 మెగావాట్ల విద్యుత్తును కేటాయించింది.
వ్యవసాయరంగానికి 8.5లక్షల కోట్లు ఋణ సహాయం అందిస్తామన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు 30% నష్టపోయినా పంటకు 50% నష్టపరిహారం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. 6వేల కోట్ల పెట్టుబడులతో 17 ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు 2015-16 బడ్జెట్లో ప్రతిపాదించారు. దీని వల్ల రైతు ఆదాయం పెంచుకునే వీలు కలుగుతుంది. రైతుకు సహాయమే కాదు సాధికారత చేకూర్చే ఉద్దేశ్యంతో భూసేకరణ చట్టం తెచ్చింది. నాల్గింతల నష్టపరిహారం ప్రకటించారు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలిచ్చే విధంగా చట్టం రూపొందించారు. ఇది చట్టసభలో ఆమోదం పొందవసి వుంది. మోడీ ప్రభుత్వం నిర్ణయాల్లో వేగాన్ని, పారదర్శకతని పెంచింది. విద్యుత్, రహదారులు, రైల్వేు, నౌకాయానరంగాలో నూతన నిర్మాణాలు, స్మార్ట్ సిటీస్, డిజిటల్ యిండియా వంటి కార్యక్రమాలు సైతం మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2019 వరకు స్వచ్ఛభారత్ ఆవిష్కరణకై ప్రయత్నం ప్రణాళికా సంఘం స్థానంలోనీతి ఆయోగ్తద్వారా ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాల సహకారంతోటీమ్, ఇండియాగా పనిచేయటం వంటివి మరికొన్ని మోడీ ప్రభుత్వం విజయాలు. రక్షణ రంగంలో ఏడాది కాలంలో ప్రభుత్వం 2 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ద్రవోల్బణం 6.18 శాతం నుంచి 2.65శాతానికి తగ్గింది. రాజకీయంగా మహారాష్ట్ర, హరియానా, ఝార్ఖండ్,కాశ్యీర్లో బిజెపి పాగా వేసింది. పాలన మొదటి సంవత్సరమే, ప్రారంభంలో ఎన్నో  అంటూ మోడీ ప్రభుత్వం ప్రకటలను జారీచేయడం వాస్తవానికి దగ్గరగావుంది.

- హనుమత్ ప్రసాద్