ఈవార్తలు చదివారా?ఆంజనేయుడి స్వదేశాగమనం 
బౌద్ధ బిక్షువులు సన్యాసుల మంత్రోచ్ఛాటన మధ్య ప్రజలు పై నుండి పూల వర్షం కురిపిస్తూ ఉండగా చిరునవ్వు చిందిస్తూ ఆంజనేయస్వామి తన స్వంత గుడికి తిరిగి వచ్చాడు. సంఘటన ఎక్కడ జరిగిందా! అని ఆశ్చర్య పోతున్నారా? ఇది జరిగింది హిందూ దేశంలో మాత్రం కాదు, కాంబోడియా దేశంలో. ప్రసిద్ధఅంకోర్వాట్ప్రదేశంలోనికోకేర్అనే దేవాలయం నుండి ఆంజనేయస్వామి విగ్రహం 1970లో దొంగిలించబడింది. విగ్రహం క్లీవ్లాండ్ ప్రదర్శనశాలలో (అమెరికా) ఉన్నట్లు తెలుసుకున్న కాంబోడియా ప్రభుత్వం అమెరికాతో సుదీర్ఘచర్చలు జరిపి స్వామి విగ్రహాన్ని తిరిగి దక్కించుకున్నది. కాంబోడియా ఆంతరంగిక మంత్రిఛాన్తానీమాట్లాడుతూ మా దేశం నుండి కొల్లగొట్టబడిన పవిత్ర విగ్రహాంను మేము వదులుకోము, ఎక్కడున్నా తిరిగి సాధిస్తాము గత 40 సంవత్సరాలలో దొంగిలించబడిన మూడు విగ్రహాలను కూడా తిరిగి దక్కించుకున్నాము`అని చెప్పారు. వీటిల్లో రారాజు దుర్యోధనుడి విగ్రహం కూడా ఉండడము విశేషం.
పెరుగుతున్న హిందువుల సంఖ్య
ఔనండీ ఇది నిజమే ! అచ్చు తప్పు కాదు. హిందువుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమే! కానీ... అది మన దేశంలో కాదు ` అమెరికాలో. వివిధ అంశాలను విశ్లేషించి ఫలితాను వ్లెడించే అమెరికా సంస్థ ‘‘ప్యూ రీసెర్చ్ సెంటర్  తన నివేదికలో యీ విధంగా పేర్కొంది. గత ఏడు సంవత్సరాలలో అమెరికాలో హిందువుల సంఖ్య 0.4 శాతం  నుండి 0.7 శాతానికి పెరిగింది. అంటే దాదాపు రెండింతలు అయ్యింది. అదే సమయానికి క్రైస్తవుల సంఖ్య 78.4 శాతం నుండి 70.6 శాతానికి పడిపోయింది. తురక సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ప్యూ సంస్థ తన నివేదికలో హిందువులు బాగా విద్యావంతులనీ అత్యధిక ఆదాయం కలవారనీ 30 నుండి 29 వయోవర్గంలోని వారు చాలామంది హిందువులేనని పేర్కొంది. ఇటీవలి కాలంలో రాజకీయ, ప్రభుత్వ రంగాలతో పాటుగా అన్ని రంగాలో అమెరికా హిందువులు ముందంజలో ఉన్నారని పేర్కొన్నది. హిందువులో 90 శాతం భారతీయులు కాగా మిగిలిన 10 శాతంలో న్నల్లవారు తెల్లవారు ఇతర దేశస్థులు ఉన్నారు.
విమర్శలాపండి ` వెన్నుదన్నుగా ఉండండి

నరేంద్రమోడీ ప్రధానమంత్రి బాధ్యత స్వీకరించి ఒక సంవత్సరం గడిచింది. పొగిడేవాళ్ళు పొగుడుతూ ఉంటే `తిట్టేవాళ్ళు తిడుతున్నారు. ది హిందూ అనే ఆంగ్ల దిన పత్రిక ఐతే కేంద్ర ప్రభుత్వం మీద విషం క్రక్కుతున్నది. ఇది యిలా ఉండగా! ప్రముఖ .టీ. సంస్థ స్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి అభిప్రాయం భిన్నంగా ఉన్నది. వారు ఏమన్నారో వారి మాటల్లోనే:
గత సంవత్సర కాలంగా ఎన్నో మంచి పనులు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. మోడీ ఉత్తేజంగా ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాలు, ఇతరులూ, ప్రజలు అందరూ కూడా మోడీకి వెన్నుదన్నుగా నిలవాలి, సమర్థించాలి. ఒక సంవత్సరంలోనే ఏదో జరిగిపోతుందని మనం అనుకోరాదు ప్రభుత్వానికి సమయం యివ్వాలి, అని అంటూనే నారాయణమూర్తి యింకా ఇలా అన్నారు. ‘‘నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది` మన దేశం ప్రగతి పథాన నడుస్తున్నది. ఇది నిజం (మే మాసం 20 తేదీనాడు ఢల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పిన అంశాలు)
పాఠశాలలో ఆర్య శాస్త్రం
భారతదేశం విశ్వానికే గురువు. జ్ఞానం జన్మించినది భారత భూమిలో, జ్ఞానానికి ప్రాతిపదిక వేదం. ‘‘ వేదమూలమిదం జ్ఞానంఅన్నది ఆర్యోక్తి. అటువంటి వేద విజ్ఞానం పాఠశాల పిల్లలకు బోధించాలని అనిపించింది. ‘మందర్ హల్బేఅనే ఒక ప్రజాప్రతినిధికి. ఇతడుకల్యాణ్`డోంచ్విలినగర పాక సంస్థలో కార్పొరేటర్. ఆర్యశాస్త్రం పేరుతో వేదాన్ని, వేదంలోని విజ్ఞాన శాస్త్రం, తర్కం, హేతుబద్ధత మొదలైన విషయాలను పిల్లలకు బోధించి మన ప్రాచీన వైభవం తెలియజెప్పాలని ఆయన కోరిక. విషయాన్ని ప్రస్తావించిన వెంటనే నగరపాలక సంస్థ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చర్చ కూడా జరగలేదు. ఐతే ఇటువంటి ఆలోచనను ప్రభుత్వం వ్యతిరేకిస్తుందేమో అనే  సందేహం వ్యక్తం కావటంతో మందర్ హల్చే ‘‘మదార్సాను పోషిస్తున్న ప్రభుత్వం, ఆర్యశాస్త్రాన్ని వ్యతిరేకించజాలదుఅని అన్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సమితి సభ్యుడైన మందర్ హల్చేను మనం కూడా అభినందిద్దాము.
శృతి మించి రాగాన పడుతున్న మతోన్మాదం
ఈనాడు ముస్లిం మతోన్మాదంతో బాధపడని దేశం ప్రపంచంలో ఒక్కటీ కూడా లేదు అనడం అతిశయోక్తి కాబోదు. ఒకప్పుడు ఆసియా దేశాకి మాత్రమే పరిమితమైన సమస్య ఇటీవలి కాలంలో ఐరోపా, ఆస్ట్రేలియా, ఆమెరికా వంటి ఖండాలకు కూడా ప్రాకిపోయింది. బురఖాలు వేసుకోవటం, ముఖం కనపడకుండా ముసుగు వేసుకోవటం, పొడవైన గడ్డాలు పెంచుకోవటం ఫ్రాన్స్ నిషేధించింది.  అయినా వారికి సమస్యలు తప్పటం లేదు. బహిరంగంగా నమాజు చేయటం `నమాజు పేరుతో జనవాసాలు దిక్బంధించటం వంటి చర్యను చైనా నిషేధించింది. నమాజును నిషేధించడానికి కారణం చెబుతూ చైనావారు ఇలా ప్రకటించారు. ‘నమాజులో ఏడవ సురా ప్రకారం, ప్రతి మహమ్మదీయుడూ అల్లా సాక్షిగా ఇతర మతస్థులను మతం మార్చాలి లేదా  చంపివేయాలి`కాబట్టి చైనాలో నమాజు చేయటం మా దేశానికి ప్రమాదకరం అన్నారు.
ప్రకృతి వ్యవసాయమే మేలు
గ్రామభారతి ఆధ్వర్యంలో జూన్ 2నుంచి 4 తేదీవరకు కరినగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. శిక్షణ కార్యక్రమంలో సుభాస్ పాలేకర్ ఆవుమూత్రం, ఆవుపేడతో తయారు చేసిన జీవామృతం సాగువిధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చునని చెప్పారు. రైతు ఆత్మహత్యలకు అధిక రసాయన ఎరువువాడకం, పంటకు సరైన గిట్టుబాటు ధరలేకపోవటం, ప్రకృతివైపరిత్యాలతో నష్టపోయిన పంటలకు ఇన్సురెన్సులేకపోవటం మొదలైన కారణాలు. కారణాలను సరిచేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతు జీవనాలను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అక్కడిజిల్లా కలెక్టర్, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.