కాంగీకి దేహ శుద్ధి

 
ఒక వ్యక్తిని చావగొట్టి చెవులు మూయడం మనమెఱిగిందే! దొంగకు దేహశుద్ధి చేయడం కూడా మనం విని ఉన్నాం. కాని ఇప్పుడు జరిగింది. ఒక పార్టీకి దేహశుద్ధి`వివరాల్లోకి వెడితే ఒరిస్సా రాష్ట్రంలో కాంగీపార్టీవారు రాష్ట్రబందుకు పిలుపు యిచ్చారు. ఎప్పటిలాగే విధ్వంసానికి దిగారు. కాని కాంగీ చర్యు ప్రజలకి నచ్చినట్లు లేదు, కాంగ్రెస్ కార్యకర్తలను కనపడినవారిని కనపడినట్లు చితకబాదారు. కాంగీపార్టీకి చెందిన ద్విచక్ర  వాహనాలను తగులబెట్టారు.  పరిణామాలకు నిర్ఘాంతపోయిన కాంగీ వీరులు తెల్లముఖం వేసుకుని కాళ్ళ బేరానికి దిగారు. తమ కార్యకర్తల చర్యకు క్షమించాలనిపిసీసీ అధ్యక్షులు ప్రసాదహరి చందన్ ఒరిస్సా ప్రజలను కోరాడు.