పెరుగుతున్న ముస్లిం జనాభా

భారతదేశానికి స్వతంత్య్రం వచ్చిన 64 సం తరువాత మళ్ళీ మతా ప్రాతిపదికన 2011లో  జనాభా లెక్కల సేకరణ జరిగింది. లెక్క ప్రకారం హిందువుల జనాభా తగ్గుదల, ముస్లిం జనాభా పెరుగుదల కనబడుతున్నది.
దేశం ముక్కలైనప్పుడు బ్రిటిష్వాళ్ళు కాశ్మీర్ను పాకిస్తాన్లో కలపాలని భావించారు. జిన్నా అస్సాంను కూడా పాకిస్తాన్లో కలుపుకోవాలని తీవ్రప్రయత్నం చేశాడు. ఆనాడు ఆరెండు సాధ్యం కాలేదు. రెండూ భారత్ భాగాలుగానే ఉన్నాయి. కాని రెండిటి విషయంలో ముస్లింలు తమ ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదు. కశ్మీర్ సమస్య మనకు తెలుసు. కశ్మీర్లో వేర్పాటువాదులు కాశ్మీరును పాకిస్తాన్లో కలపాని కలుగంటున్నారు. మరో ప్రక్క అస్సాం పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అస్సాంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. మొన్నటి లెక్క ప్రకారం  అస్సాంలోని 27 జిల్లాకు గాను 9జిల్లాలు ముస్లిం మెజారిటీ జిల్లాలుగా మారిపోయాయి. అస్సాంలో ముస్లిం జనాభా 2001లో 30.9% ఉంటే 2011లో 34.27%కి చేరింది. బెంగాల్్, ఉత్తరాఖండ్లో కూడా ముస్లి జనాభా వీపరీతంగా పెరిగిపోతున్నది. ముస్లిం జనాభా పెరుగుదల ఇట్లా ఉంటే క్రైస్తవుల పెరుగుద లేనట్లుగా నివేదికలు చూపిస్తున్నాయి. క్రైస్తవులు గడిచిన కొద్ది సం నుండి మతం మార్పిడిలు వేగంగా చేస్తూనే మారిన వారిని చర్చికు వచ్చి ప్రార్థను చేయండి కాని హిందువుగానే గుర్తింపు పత్రాలు తెచ్చుకోండని సూచిస్తుంది. దానితో ఇతిమద్ధంగా వారి సంఖ్య ఎంత పెరిగిందో తెలియటం లేదు. ఇది ఒక ఎత్తుగడ. సత్యాన్ని హిందువులు గుర్తించి తమ ధర్మం కాపాడుకొనేందుకు సన్నద్ధలవుతారో లేక చరిత్ర పునరావృతమవుతుందో వేచిచూడాలి. 1961 నుండి హిందువుల జనాభా క్రమంగా తగ్గుదల కనబడుతున్నది. 1961 నుండి ఇప్పటివరకు 4.36% జనాభా హిందువులది తగ్గితే ముస్లిం జనాభా 3.33% పెరిగింది. ముస్లిం జనాభా కొన్ని ప్రత్యేక ప్రాంతాలో బాగా పెరుగుతున్నది గమనించదగ్గ విషయం.