అమరవాణిప్రత్యుత్ధానంచ యుద్ధంచ
సంవిభాగం చబంధుషు
స్వయం ఆక్రమ్య భుక్తంచ
శిక్షతే చత్వారి కుక్కుటాత్
` చాణక్య నీతి (6`17)
కోడిపుంజు నుండి మనం నాలుగు పాఠాలు నేర్చుకోవాలి. (1) త్వరగా లేవటం (2) ఆత్మరక్షణకైనా, యుద్ధానికైనా సదా సన్నద్ధంగా ఉండడం (3) తోటివారికి ఉదారంగా పంచడం (4) తన అవసరాలకు తానే సంపాదించుకోవటం.