దృఢ సంకల్ప పరిణామాలు..


గతంలో జగిత్యాలలో శ్రీగణేష్ నవరాత్రులు పెద్దస్థాయిలో నిర్వహించబడుతుండేవి. ఉత్సవాలో భాగంగా ఒక కార్యకర్త నగరంలోని ప్రతిష్టించబడిన వినాయక మంటాపాల నిర్వాహణ తదితర అంశాలు తెలుసుకోవడానికి పర్యటించాడు. పర్యటనలో భాగంగా నగర శివారులోనున్న సేవా బస్తి మంటపం దగ్గర వెళ్ళేసరికి ఆశ్చర్యమేసింది. అది గాంధీనగర్లో గల సేవాబస్తి అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడున్నవారితో సంప్రదించగా తెలిసిందేమిటంటే తమని అంటరానివారుగా పరిగ ణించడం మూలాన గణేష్ మంటపం దగ్గరికి ఎవ్వరు రాలేదని, పూజలో పాల్గొనలేమని సమాధానం వచ్చింది. ఉదయం కొద్దిమంది యువకులు నగరం నుండి వచ్చి పూజలు చేసి వెళ్ళిపోయారన్నారు. అది విని` ప్రత్యక్షంగా చూసిన కార్యకర్తకు చాలా దుఖం వచ్చింది. అతను అనేక బస్తీలు పర్యటనా చేస్తు ఇక్కడికి చేరటం మూలాన ఒకింత అలసిపో యాడు, మరి విపరీతమైన దాహమగు టచేత అక్కడే ఉన్న మహిళతో త్రాగేందుకు మంచి నీళ్ళడిగాడు. మహిళ వ్యగ్యంగా మేము మీకు నీళ్ళవ్వలేమయ్యా బాబూ! మేం అంటరాని వారముగా!! అంది. కొద్దిసేపు మాట్లాడిన తరువాత ఇతయి నచ్చచెప్పగా మహిళామణి నీళ్ళవ్వడానికి ఒప్పుకుంది. కాని ఆమె నీళ్ళించింతరువాత చేయరాని ఆపరాధం చేసినట్లుగా దీనంగా ఉండిపోయినది. గణేశపూజోత్సవం తరువాతా సంఘటనా ఆధారంగా ఒక సమీక్షా` బైఠక్ నిర్వహించబడినది. బైఠక్లో తీసుకున్న నిర్ణయమేమిటంటే సమస్యనుండి బయటపడటా నికి ఒక కార్యయోజన నిర్ణయించాలి, స్వయంసేవకులు ఒక బృందంగా ఏర్పడి గాంధీన గర్లో, ఎవ్వరిమాట పులువురు వింటారో అలాంటి 20 మంది ఇళ్లకెళ్ళి సంప్రదించాలని, వారిని విశ్వాసంలోకి తీసుకొని`ఉన్నత వర్గంగా చెలామణిలోనున్న వారితోనూ సుదీర్ఘంగా చర్చించి, వీరి అహంకారం కారణంగా ఎంతటి విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో సవివరంగా విశదీకరించటం జరిగింది. అదే విధంగా అనేక కుల  పెద్దలతోను సంప్రదించారు. తరువాత బ్రహ్మాణ`  పండితులతోను నిశితంగా చర్చించి ఒప్పించడం జరిగింది. అందరు కలిసి నగరంలోని అన్ని ప్రధాన దేవాయాలో మాన్యుకు` సామాన్యుకు తరతమ బేధాలు లేకుండా మందిర ప్రవేశం, దైవదర్శనం, ప్రసాద ఆస్వాదం కల్పించారు. గణేశుఉత్సవాల తరువాత  వచ్చే విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించి గాంధీ నగర్ సేవాబస్తి వాసుల భాగస్వామ్యం కూడా జోడించబడింది. అందరూ కలిసి స్థానిక ప్రసిద్ధ శ్రీవేణు గోపాల స్వామి మందిర ప్రవేశం` దైవదర్శనం, పూజార్చను కావింప బడినాయి. సత్ససకల్పం` పరస్పర సహకారం` సహృదయ సంపర్కం` సదుద్దేశ్యంతో జటిల సమస్యను సైతం సద్దుమణిగి సమసమాజ స్థాపనం` సామాజిక సమరసతా భావం పెంపొందుతుందని తేటతెల్లమైనది.
అనువాదం : జగం