పార్లమెంట్‌ సమావేశాలను అపహస్యం పాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ 
గత 2014 మే లోక్సభ ఎన్నికలో ఘోర పరాభవం చెంది కేవలం 44 సభ్యులను మాత్రమే గెలిపించుకొన్ని కాంగ్రెస్ తన పరాభవ పర్వం నుండి బయట పడ్డట్టుగా గోచరించటం లేదు. లోకసభ ఎన్నికలో ఎందుకు ఓడిపోయామో ఆత్మ విమర్శ చేసుకోకుండా ఎన్డియే ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టానే దురాలోచనతో కాంగ్రెస్పార్టీ గడిచిన పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్నట్లుగా తోస్తున్నది.
విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మస్వరాజ్ లిత్మోడీకి వీసా జారీ చేయడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసారనే ఆరోపణల నెపంతో, ఆమె రాజీనామా చేయాలని మంకు పట్టుపట్టి మొత్తం సమావేశాలను నీరు కార్చి ముఖ్యమైన బిలులు ఆమోదం పొందకుండా దేశాభివృద్ధికి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీ.
లోక్సభలో విదేశాంగ మంత్రి స్వయంగా వివరణ ఇస్తారు అని ప్రకటించినా, ప్రకటన ద్వారా తాము చేసిన అనేక అవకతవకలు చర్చకు వస్తాయనే భయంతోనే శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, స్వయంగా తమ సభ్యులను రెచ్చగొట్టి లోక్సభను స్తంభింపచేశారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నా లోక్సభ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహజాన్ అనేకసార్లు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటుచేసినా ఒంటెద్దుపోకడలతో, తమకు ఉన్న 44మంది సభ్యులో 25మందిని 5రోజులు బహిష్కరణ ప్రకటన వచ్చేదాకా పరిస్థితిని కొనసాగించారు.. లోక్సభలో మిగిలిన 29 పార్టీలు కేవలం విదేశాంగ మంత్రి రాజీనామాను ఒక అంశంగా చేయివద్దని సూచించినా ప్రస్తుత ప్రభుత్వాన్ని, తద్వారా మోడీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టానే దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ చర్యకు పాల్పడినట్లు మనకు సమావేశాలు జరిగిన తీరు తేటతెల్లం చేస్తున్నది.  సమాజ్వాది పార్టీ నాయకుడు శ్రీ ములాయం సింగ్ కాంగ్రెస్పార్టీని విషయంలో తీవ్రంగా విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు కూడా లోక్సభలో తమ రాష్ట్ర సమస్యలు చర్చకు రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని గుర్రుగా ఉన్నారు. స్వయం గా రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పార్లమెంట్లో సమావేశాలు జరిగిన తీరుపట్ల ఆవేదన చెందిన విషయం మనం గమనించాలి.
ముఖ్యమైన జీఎస్టి బిలు భూసేకరణ బిలుల్ల కనుక పార్లమెంట్ ఆమోదం పొందితే దేశాభివృద్ధి చెంది ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల్లో మంచిపేరు వస్తుందని భావించి కాంగ్రెస్ పార్టీ పై విధంగా ప్రవర్తించి దేశ ప్రజల ముందు తమ పరువును కోల్పోయింది. వాయిదా తీర్మానం ద్వారా చర్చ జరిగిన సమయంలో శ్రీమతి సుష్మస్వరాజ్ చేసిన ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీ వద్ద సమాధానం లేకపోవటమే పార్టీ యొక్క దీనస్థితిని తెలియజేస్తున్నాది. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవటం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవటం కారణంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పార్టీని ప్రజలు క్షమించరు.
-విహారి