ప్రముఖుల మాట

భలేమంచి చౌకబేరమూ.. మించిన దొరకదుఅంటూ నాడు నారదమహర్షి శ్రీకృష్ణుని ద్వారకాపురి వీధుల్లో వేలం వేసిన తరహాలోనే ఇప్పుడు చైనా మన మార్కెట్లోకి తన చౌకబారువస్తువులను దింపి భారత్ దేశం వెన్నువిరిచే ప్రయత్నం చేస్తున్నది. మనదేశంలో తయారయ్యే ప్రతినాణ్యమైన వస్తువుకు చైనాలో తయారైన ఒక చౌకబారు వస్తువు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటోంది.ఇది ప్రధా ని నరేంద్ర మోదీ ఎన్నో ఆశలు, ఆశయాలతో చేపట్టి మేక్ ఇన్ ఇండియాకు పెనువిఘాతం. మరి మనం వస్తువులను నివరించలేమా.. భారత్ మార్కెట్పై  చైనా దాడిని సమర్థవంతంగా ప్రజలే ఎదుర్కొని మన దేశం ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలి.
- కున్నుమూరి నరిసింహమూర్తి, ఆర్థిక విశ్లేషకులు