కృతజ్ఞతకి` ఇది నిదర్శనంపిడుక్కి బియ్యానికీ ఒకటే మంత్రమా?’ అన్నది సామెత అంటే మంచిచెడు విచక్షణ ఉండాలని దాని అర్థం. మనదేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలు మనను పీడించిన ఆంగ్లేయులంటే మనకి సహజంగానే కోపం ఉంటుంది. కానీ! మనం మంచిని మంచిగానే చూస్తాము. ఆంగ్లేయ ఇంజనీరు సర్ ఆర్థర్ కాటన్ అంటే ఉభయగోదావరి జిల్లా ప్రజలకు ఎంతో అభిమానం, ఆప్యాయత, గౌరవం ఉన్నాయి. గతంలోఅన్నీ ఉన్నా అలుడి నోటిలోశనిఅన్నట్లు అఖండ గోదావరి ప్రచండంగా శతాబ్దాలుగా ప్రవహిస్తున్నా కూడా, గోదావరీ జిల్లాలోనిత్యం క్షామంఅనే స్థితి నెలకొని ఉండేది, సమయంలో గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి కాలువల ద్వారా నీరు పారించి ప్రాంతంలో భూమిని సశ్యశ్యామలం చేశాడు కాటన్ దొర. ప్రజలు ఆయన చేసిన ఉపకారం మరచిపోలేదు. జిల్లాలో కాటన్ దొర విగ్రహాలు విరివిగా కనబడతాయి. మొన్న జరిగిన పుష్కరాలో స్థానిక ప్రజలు కాటన్దొరకి శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మ నిర్వహించి పిండప్రదానం చేశారు. చనిపోయిన తరువాత కూడా జీవించి ఉండే వ్యక్తి కాటన్, పిండప్రధానం చేసి కృతజ్ఞత చాటుకున్న ప్రజలు ధన్యులు.
ది హిందూ`20`07`05