రామలీల మైదానంలో శాఖపై ముస్లిందాడి 
ఉత్తర పూర్వ ఢిల్లిలో యొక్క భజారీ భాస్ ప్రాంతంలోని శ్రీరామ్కాలనీకి చెందిన వాళ్ళు 1984 సం౤౤లో రామలీలా మైదానంలో శాఖ ప్రారంభించారు. అప్పటి నుండి శాఖ నడుస్తూనే ఉంది. శాఖను అక్కడ లేకుండా చేయాలని పరిసరాలోని ముస్లింలు అప్పటి నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గడిచిన కొద్దినెలలుగా దాడులు పెరిగాయి. గత జూన్ మాసం28 తేదిన ఉదయం శాఖకు  వెళ్తున్న శాఖ కార్యావహ సర్వేశ్కుమార్పైన, శాఖ ముఖ్యశిక్షక్ రాజేశ్కుమార్ పైన రామలీలామైదానం పరిసరాలలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నలుగురు ముస్లిం యువకులు దారి కాచి మరి దాడిచేశారు. దీనిపై గొడవ జరిగింది. పోలీసు కేసు కూడా అయ్యింది.
దాడికి ముందు అక్కడి ముస్లింలు రకరకాల ప్రయత్నాలు చేసారు. శాఖ ఉదయం నడుస్తుంది. ఉదయంశాఖ జరిగే మైదనంలో ముస్లిం మహిళలను మార్నింగ్ వాకింగ్కు పపించారు అది కొద్దిపాటి ఘర్షణకు దారితీసింది. తరువాత చిన్నపిల్లలను ముస్లింలు శాఖకు పంపి శాఖలో గోడవలు చేసే ప్రయత్నాలు చేసారు. దానితో ఉద్రిక్తత పరిస్థితులు నిర్మాణమైనాయి. ప్రయత్నాలో చివరగా జరిగింది భౌతికదాడి. పరిస్థితులను అధిగమించేందుకు స్వయం సేవకులు ప్రయత్నం చేస్తున్నారు.
1993 సంలో వరదలు వచ్చినపుడు స్వయంసేవకులు వరద బాధితులకు ఆదుకోవటానికి విశేష ప్రయత్నం చేసారు. బాధితులలో ముస్లింలు  కూడా ఉన్నారు. వారికి సహకరించారు. బస్తీలో హిందువులు`ముస్లిం మధ్య మంచి సంబంధాలు ఉండేవి. కాని దానిని చెడగొట్టే ప్రయత్నాలు నేడు సాగుతున్నాయి. 2004 సం శాఖ మీద దాడి చేసి శాఖలో ధ్వజాన్ని చింపేసారు. దీటుగానే పరిస్థితులను స్వయం సేవకు ఎదుర్కొంటున్నారు.
అనువాదం : శ్రీరామాచారి