పల్లె పడుచుల్లో వెలుగులు నింపిన నందిత

యువతీ మేలుకో...

మహిళ శక్తి అపూర్వమైనది... తను తలుచుకుంటే కాని కార్యం  అంటూ ఉండదు. తన ఇల్లే కాదు ఊరు, దేశం కూడా బాగుండాలని కోరుకుంటుంది. అలాంటి మహిళ కోవకు చెందిన ఆమెనే నందితా పాఠక్. అది అమెకు పెళ్ళితో వచ్చిన పేరు. అసలు పేరు కౌస్య. కౌస్య మధ్యప్రదేశ్‌కి చెందిన భరత్ పాఠక్‌ను పెళ్ళి చేసుకొని నందితా పాఠక్ అయ్యారు. చదువుకుందామని వచ్చిన ఆమె జీవిత ప్రయాణం కొన్ని గ్రామాలునుదిటి రాతే మార్చేసింది...
చిత్రకూట్... మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న అద్భుతమైన ప్రదేశం. ప్రకృతి అందాలకు, పచ్చదనానికి పెట్టింది పేరు. శ్రీరాముడు అరణ్యవాసం చేసిన ప్రదేశం. కానీ ఇన్ని ఉన్నా అక్కడి ప్రజల్లో దైన్యం, వసు, నేరాలు, బతుకు పోరాటం.. ఇవి అప్పటి అక్కడి పరిస్థితులు. అవి చూసి చలించిపోయారు రామభక్తుడైన నానాజీ. వారికోసం చిత్రకూట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. అందులో చేరింది కౌస్య. దేశం అంతటా గుర్తింపు సాధించిన ప్రాజెక్ట్ వెనుక ఉన్నది కౌస్య. ఆమె పుట్టింది గుంటూరు జిల్లాలోని వినుకొండ. రచయిత కోడూరి కౌసల్యాదేవిపై ఇష్టంతో ఆమెకి కౌస్య అని ఆమెకు ఆమె తల్లిదండ్రు పేరు పెట్టారు. ఆమె పెద్ద పెద్ద నవలలు రాయకపోయినా వేల మంది గ్రామీణుల తలరాతను మార్చగలిగింది. ఇంటర్ ఇక్కడే చదివినా డిగ్రీ చేయడం కోసం మధ్యప్రదేశ్ వెళ్లింది. ఎన్సీసీ విద్యార్థినిగా దేశ గణతంత్ర వేడుకల్లో పాల్గొని ఆల్ రౌండ్ బెస్ట్ క్యాడెట్‌గా అవార్డ్ అందుకుంది. అప్పుడే ప్రఖ్యాత సంఘసంస్కర్త నానాజీ దేశ్ముఖ్తో పరిచయం తన జీవిత గమనాన్ని మార్చేసింది. వారు నీలాంటి వారు సంపాదన కోసం కాదు దేశం కోసం పనిచేయాలి అని అన్నారట, మాటలు ఆమెపై మంత్రంలా పని చేశాయి. దాంతో ఆమె అక్కడే పనిచేసేందుకు నిర్ణయించుకుంది.  నానాజీ ప్రారంభించిన చిత్రకూట్ ప్రాజెక్ట్‌లో 1994లో చేరి, అక్కడి పల్లెప్రజలకోసం ఉద్యమిత విద్యాపీఠం ప్రారంభించింది. అలా సాగిన ఉద్యమం గ్రామీణ సాధికారతకు గుర్తు. గ్రామం ఒక ఉత్పత్తి అనే నినాదంతో ప్రారంభించిన ప్రాజెక్ట్ పల్లె పడుచులకు ఊతం ఇచ్చింది. స్వయంగా తమంత తామే పైకి ఎదిగేలా చేసింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ద్వారా ప్రతీ మగువ నెలకు 1800 నుంచి 15000 రూపాయల వరకూ సంపాదిస్తోంది. దీనివ్ల అక్కడ చుట్టుపక్క ల వలసలు, నేరాలు తగ్గిపోయాయి. ప్రాజెక్టును ఎన్నో గ్రామాలు ఆదర్శంగా తీసుకున్నాయి. చాలా దేశాలో దీనిపై ప్రసంగించింది. నరేంద్రమోడీ, అబ్దుల్‌కలాం, ఎల్కే అద్వానీ లాంటి ప్రముఖులు ఈమె చేసిన సేవను మెచ్చుకున్నారు. అందరికీ ఆదర్శం అని కొనియాడారు.
ప్రజలను సంఘటితం చేయడం పెద్ద కష్టమైన పని కాదు.. దానికి కావలిసిందల్లా స్పందించే మనస్తత్వం. మనపై మనకు నమ్మకం, నిజాయితీ, ధైర్యం, కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం, ఓర్పు ఉంటే చాలు ఎలాంటి సమాజాన్నయినా అభివృద్ధి పథంలో నడిపించవచ్చు.