కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలి` భారతీయ కిసాన్‌ సంఘ్భారతదేశం మొదటి నుండి వ్యవసాయ ప్రధానమైన దేశం. రోజునైనా దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయమే. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఇంకారాలేదు.  స్వతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదు. పరిశ్రమలు పెంచేప్రయత్నాలు చేసింది కాని వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. దానికారణంగా వ్యవసాయభివృద్ధి రేటు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో తగిన ప్రాధాన్యతను కల్పించాలి. మూల నిధులను వ్యవసాయరంగానికి కేటాయించాలి. మధ్య సుప్రీంకోర్టు వ్యవసాయరంగానికి సంబంధించిన జాతీయపాలసీ`2007ను సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతు ఆత్మహత్యలను నివారించాలి. 2007 సం పాలసీ సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. భారతీయ కిసాన్సంఘ్్ కోర్టు సూచనను స్వాగతిస్తూ సమీక్ష జరగాలని కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నది. మధ్య మధ్యప్రదేశ్లో జరిగిన రైతు సదస్సు కార్యక్రమంలో భారతీయకిసాన్ సంఘ్్ కార్యదర్శి మాట్లాడుతూభారతీయకిసాన్ సంఘ్్ రైతులకు సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటమే కాదు తాము కూడా కొన్ని ప్రత్యేక పనులను చేయాలని సంకల్పించామని చెప్పారుపర్యావరణ పరిరక్షణ, వ్యవసాయానుకూల వాతావరణన్ని కాపాడుటకు తగు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పారు. నీటి సంఘాలను కాపాడటం, రైతుకు సరియి గిట్టుబాటు ధరను సాధించటంతో పాటు రైతుకు సరియి నష్టపరిహారము సాధించేందుకు కృషిచేస్తామని చెప్పారు. రైతు భూముల భూసేకరణ చట్టంకింద సేకరించే ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పారు. అవసరమైతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పారు. 16,000కోట్ల రూపాయలతో నీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని, 6,000 కోట్ల రూపాయలతో చెరకు రైతులను ఆదుకొనేందుకు వ్యవస్థ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. రైతుకు యూరియాను అందుబాటులో ఉంచాలని, పంట భూముల భీమా పథకం అమలు చేయాలని, గిట్టుబాటు ధరను సరిగా నిర్ణయించాలని సూచించారు.